.
గరికపాటి నర్సింహారావు… నరసింహా అనాలి కదా, ఈ నర్సింహా అనే అప్రాచ్యపు పదం ఏమిటి అంటాడేమో… సరే, ఏదో ఒకటి… ప్రవచనకర్త… సహస్రావధాని… నిజానికి నేను తన అభిమానినే… ఎక్కడ..?
వాస్తు మూఢాలు దగ్గర నుంచి ఏడాది మైల, వైకుంఠదర్శనం దాకా అనేకానేక మూఢ విశ్వాసాలను ఖండఖండాలుగా తనదైన కామెడీ శైలిలో ఖండిస్తుంటాడు… నిజానికి ఇలాంటి ప్రవచనకారులే ప్రస్తుతం సమాజావసరం… పైగా అసాధారణ ధారణ ప్రతిభ తనది… అమోఘమైన పురాణజ్ఞానం తనది… పిచ్చి నమ్మకాలను ఖండించే సాహసం తనది…
Ads
కానీ..,? సమాజంలో వ్యక్తులు రకరకాలు… అందులో హఠాత్తుగా చిప్ కొట్టేసే బాపతు కొందరు… కొందరికి అనారోగ్యం, మరికొందరికి అజ్ఙానం, ఇంకొందరికి అతివృష్టి తాలూకు కరప్షన్… ఇక్కడ కరప్షన్ అంటే అవినీతి కాదు, చిప్ కరప్ట్ కావడం… తెలివి, విద్వత్తు ఎక్కువ కావడం వల్ల హఠాత్తుగా సంభవించే జ్ఞానప్రమాదం… ఇది అరుదుగా సంభవించే ఓ మానసిక వ్యాధి…
సరిగ్గా గరికపాటి అదే స్థితిలోె ఉన్నాడనిపిస్తోంది… మొన్నామధ్య ఆంధ్రప్రదేశ్ ఏమిటి, నా ఖర్మ, తెలుగునాడు పెట్టాలి అని ఎక్కడో గొంతు చించుకున్నాడు… అక్కడికి అచ్చమైన తెలుగు భాషలో పేరు పెడితే అవేవో వరాల వాన కురిసినట్టు… ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు అయితే అదే తెలుగును అఘోరిస్తున్న మా తెలంగాణ పేరు ఏమిటి మహాపురుషా అని అడిగేవాడు లేక…
ఇప్పుడు తాజాగా ఏమన్నాడో తెలుసా..? చిప్ మరింత కరప్ట్ అయినట్టుంది… (అయ్యా, నీకన్నా చిన జియ్యరుడు అనబడే అపసవ్యుడే వేయి రెట్లు మేలు అనిపిస్తోంది సుమీ)…
‘‘గుడ్డా, గాడిదగుడ్డా, బడిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏమిటండీ, పైగా టీచర్లు గుడ్ల లెక్కలు రాసుకోవాలిట, అసలు ఈ భోజనాలు, యూనిఫామ్స్, ఉచిత పుస్తకాలు ఏమిటి..? మానేయండి, వస్తే వస్తాడు, వచ్చాక శోభనం పెళ్లికొడుకులు అవుతున్నారు’’
ఇంత దరిద్రపు, నీచపు వ్యాఖ్యానాలు నేనిన్నాళ్లూ వినలేదు… వినబోనేమో కూడా… అందుకే గరికపాటి చిప్ దొబ్బింది అంటున్నది… (నాతోసహా గరికపాటి అభిమానుల మనోభావాలు అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నా సరే… ఆయన వదిన, సంసారం, కుటుంబ కలహాలు అనే వ్యక్తిగత అంశాల జోలికి పోవడం లేదు ఇక్కడ…) అన్నట్టు రాముడు కృష్ణుడు క్షత్రియులు, యాదవులు కదా, వెజ్జా, నాన్- వెజ్జా అనే మీమాంస జోలికి కూడా పోవడం లేదిక్కడ…
సరే, ముందుగా ముఖచిత్ర మిత్రులు Gottimukkala Kamalakar కౌంటర్ ఓసారి చదవండి, ఇంకా చెప్పుకుందాం…
ఇందాకే ప్రవచనకారులవారు కోడిగుడ్డు మీద ఈకలుపీకే వీడియో చూసాను.
విధినిర్వహణలో భాగంగా నేను ఏ ప్రభుత్వ పాఠశాలకు తనిఖీకి వెళ్లినా, మధ్యాహ్నభోజన సమయంలో పిల్లలతో కలిసి వాళ్ల భోజనం చేస్తాను. బియ్యం బానే ఉంటాయి కానీ, కూరాపప్పూ చాలా నాసిరకంగా ఉంటాయి. వాళ్ల భోజనంలో అంతో ఇంతో పౌష్టికాహారం ఆ ఉడకబెట్టిన గుడ్డొక్కటే..!
- ప్రతి ప్రాంతానికీ, వర్గానికీ ఓ ప్రత్యేకమైన ఆహారపుటలవాట్లు ఉంటాయి. మేం తినేదే సరైన/ శుద్ధమైన భోజనం; మిగతాదంతా తప్పుడు/ చెత్త తిండి అని వాటివాటి బావుల్లో ఈదులాడుతున్న ప్రతి కప్పా అనుకుంటుంది.
మనిషి ఎంతవాడైనా; ఎంత చదువుకున్నా సహానుభూతిని ఎందుకు వదిలేస్తున్నాడో అర్ధం కాదు. దక్షిణ భారత దేశపు సంప్రదాయ శాకాహారి; జపాన్ సుమో యోధుడు; చైనా శ్రామికుడు; మెహికో ట్రక్కు డ్రైవర్; థాయిలాండ్ మసాజ్ సెంటర్ లో అమ్మాయిల భోజనపుటలవాట్లు ఒకేలా ఎలా ఉండగలవు..?
సదరు ప్రవచనకారుడే రోడ్డు మీద మిరపకాయ బజ్జీలు తినలేకపోతున్నానంటూ ఏదో వీడియోలో ఏడ్చినవ్వి; పానీపురీ మీద నవ్వీఏడ్చి; గోంగూర పచ్చట్లో అందర్లో ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు; ఎవరూ లేనప్పుడు ఉల్లిపాయలు నంజుకోవాలంటూ ద్వైద్వీభావాన్ని నవ్వేడ్చారు….
వీరు ఒకానొక కార్తీకసమారాధనలో మౌనం పాటిస్తూ అంతర్ముఖుణ్ని అవుతానని బహిరంగంగా చెప్పినప్పటి నుండీ వీరి వాచాలత్వం బహుముఖీయమైపోయింది.
ఆ పరాత్పరుడు వీరికి భూషణమైన వాక్కును ప్రసాదించు గాక..!
****
మా మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయులవారు పిల్లల మధ్యాహ్న భోజన పథకంలో గుడ్ల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఎనిమిదివేల ఆరువందల నలభై తొమ్మిది రూపాయలను కైంకర్యం చేశారు.
ఇస్కాన్ అక్షయపాత్ర ద్వారా రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం అందుతోంది.
శ్రీకృష్ణపరమాత్ముడు వీగనూ వెజిటేరియనూ కాకపోయినా, ఆయన్నారాధించే వీళ్లు పిల్లలకు గుడ్లు పెట్టరు. సరే, అది వాళ్ల ఇష్టం కాబట్టి, ఇస్కాన్ భోజనంతో, ప్రభుత్వం పిల్లలకు గుడ్డు అందజేస్తే బావుంటుంది…!
అన్నం బ్రహ్మ..!
సరే, విషయానికొద్దాం… మధ్యాహ్న భోజనమే వేస్ట్ అంటున్న ఓ శుష్క ప్రవచనకర్తా… నిజాలు ఏమిటంటే..?
1) మధ్యాహ్నభోజనం ధర్మం కాదు, భిక్షం కాదు, అది జాతి ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం ఉద్దేశింపబడిన ఓ ఉదాత్త, ప్రయోజనకర, అత్యవసర పథకం…
2) ఈ భోజనం కడుపు నింపేది మాత్రమే కాదు, డ్రాపవుట్స్ నిరోధం… అది భావి నాణ్యమైన తరం కోసం ఉద్దేశించిన పథకం…
3) గుడ్డు శాకాహారమా, మాంసాహారమా నువ్వెవరు నిర్ధారించడానికి..? బలహీనవర్గాల భావి పౌరులు ఆరోగ్యంగా ఎదగటానికి ఉద్దేశించిన మధ్యాహ్నభోజనం మీద ఎవడు పిచ్చి కూతలు కూసినా… అది ధర్మవిరోధం… సకల పాపలోకాలూ పట్టిపోతారు…
4) కొన్నికోట్ల మందికి అక్షయపాత్ర ఫౌండేషన్ మధ్యాహ్నభోజనం నాణ్యంగా వడ్డిస్తోంది, దానికి తెలియదా ఆ ప్రయోజనాలు ఏమిటో…?
అవునూ... పద్మశ్రీలను అర్జెంటుగా వెనక్కి తీసుకునే స్కీమ్ ఏమీ లేదా మోడీ భాయ్... ప్లీజ్ థింక్..!!
Share this Article