Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుండమ్మ కథలాగే గయ్యాళి గంగమ్మ… తెర నిండా సూర్య‘కాంతులే’…

December 20, 2024 by M S R

.

.          ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )   …….. ఫక్తు జంధ్యాల మార్క్ సినిమా గయ్యాళి గంగమ్మ… కక్షలు , పగలు , చంపటాలు , చంపుకోవటాలు , చాతబడులు వంటి వయలెన్స్ లేకుండా ఫేమిలీ ఓరియెంటెడ్ , వినోదాత్మక సినిమాలను పాపులర్ చేసింది జంధ్యాలే .

ఒకప్పుడు విజయా వాళ్ళు ఇలాంటి వినోదాత్మక సినిమాలు తీసేవారు . 1980 ఆగస్టులో వచ్చిన ఈ గయ్యాళి గంగమ్మ కూడా విజయా వారి గుండమ్మ కధ సినిమా లాంటిదే . రెండింటిలోను టైటిల్ పాత్రలను వేసింది సూరేకాంతమ్మే .

Ads

గుండమ్మ కధలో సవతి కూతుర్ని రాచిరంపాన పెట్టే పాత్ర అయితే ఈ గయ్యాళి గంగమ్మ సినిమాలో ఆమె పాత్ర అహ నా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు , ఆడపడుచు సినిమాలో రేలంగి , నిలువుదోపిడి సినిమాలో షావుకారు చుక్కమ్మ పాత్ర లాంటిది .

ఇంట్లో వాళ్ళ కడుపు , తన కడుపు కాల్చుకొని పైసా పైసా కూడబెట్టే పాత్ర . బీదాసాదాకు అప్పులిచ్చి షైలాక్ లాగా రక్తమాంసాలు పిండే పాత్ర . ఈ సినిమా ఆమె చుట్టూ తిరిగేదే .

సత్యానంద్ , జంధ్యాల కలిసి కధను నేయగా , బీరం మస్తాన్ రావు స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించారు . డైలాగుల్ని జంధ్యాల ఒక్కరే వ్రాసారు . గయ్యాళి గంగమ్మకు నోరు లేని మొగుడు , నోరు లేవకపోయినా పెంకిఘటం కొడుకు ఉంటారు .

పట్నం వెళ్ళి ఉద్యోగం చేస్తూ అందమైన అమ్మాయిని మనువాడాలనే కోరికతో మిత్రుడి సహాయంతో పట్నం చేరతాడు హీరో . అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు . ఆ అమ్మాయి అతని మేనత్త కూతురే .

వాళ్ళ కుటుంబాన్ని గతంలో ఆరళ్ళు పెట్టి అతలాకుతలం చేసిన గయ్యాళి గంగమ్మ ఇంటికి తన కూతుర్ని పంపనంటే పంపనని భీష్మించుకుని కూర్చుంటాడు పిల్ల తండ్రి . అందరూ కలిసి గయ్యాళి గంగమ్మకు బుధ్ధి చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటారు . టూకీగా కధ ఇది .

పెంకి హీరోగా చంద్రమోహన్ , మిత్రుడిగా లక్ష్మీకాంత్ , వారిద్దరికి జోడీలుగా నూతన నటి రజనీ శర్మ , పల్లవిలు నటించారు . రజనీ శర్మ తెలుగులో ఈ సినిమా కాకుండా కృష్ణ హీరోగా నటించిన అమ్మాయి మొగుడు మామకు యముడు సినిమాలో మాత్రమే నటించినట్లు గుర్తు . ఇతర పాత్రల్లో నాగభూషణం , గుమ్మడి , మాడా , పి ఆర్ వరలక్ష్మి , జయమాలిని , కె వి చలం , పి యల్ నారాయణ ప్రభృతులు నటించారు .

ఈ సినిమా బాగుండటానికి మరో కారణం చక్రవర్తి సంగీతం . పాటల్ని వేటూరితో పాటు సాహితి వ్రాసారు . బహుశా సాహితి రచయితగా ఈ సినిమాతోనే అరంగేట్రం చేసారు . చంద్రమోహన్ రజనీ శర్మ డ్యూయెట్లు , జయమాలినితో క్లబ్ డాన్స్ , సినిమా ఆఖర్లో సాములోరి మారువేషంలో చంద్రమోహన్ సర్వం గోయిందా పాటలు అన్నీ బాగా చిత్రీకరించబడ్డాయి . హుషారుగా ఉంటాయి కూడా .

రాధా నా రాధ , వాంగో సామి వాంగో , నా కొంప ముంచింది వాన డ్యూయెట్లు చాలా హుషారుగా ఉంటాయి . జయమాలిని , చంద్రమోహన్ క్లబ్ డాన్స్ కూడా చాలా హుషారుగా ఉంటుంది . కావలసినన్ని ద్వంద్వార్ధ పలుకులు ఉంటాయి . బహుశా వేటూరి వారే వ్రాసి ఉంటారు .

మా తరంలో వాళ్ళు ఈ సినిమాను ఎంత మంది చూసారో నాకు తెలియదు . చూసి ఉండకపోతే మాత్రం తప్పకుండా చూడండి . 100% వినోదం గ్యారెంటీడ్ . యూట్యూబులో సినిమా , పాటల వీడియోలు అన్నీ చక్కగా ఉన్నాయి .

గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు సూరేకాంతమ్మ . పబ్లిసిటీ పోస్టర్లలో కూడా పది తలలతో ఆమె ఫోటోనే వేసారంటే ఆమె పాత్ర సినిమాలో ఎంత ప్రధానమయిందో అర్థం అవుతుంది . మరో గుండమ్మ , మరో చుక్కమ్మ కధే . A complete feel good family entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు


వికీపీడియాలో ఈ సినిమా వివరాలు చూస్తుంటే కాస్త నవ్వొచ్చింది… లక్ష్మీకాంత్ బదులు రజినీకాంత్, రజినీ శర్మ బదులు శశికళ/రజని వివరాల లింకులు…


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ఎన్టీయార్ ఫోటో వెనుక నేపథ్యం తెలుసా..? గతంలో చదివారా..?
  • KTR ప్రెస్ క్లబ్ డ్రామాకు రేవంత్ డిఫరెంట్ కౌంటర్… రక్తికట్టింది…
  • తన తొలి మూవీ ప్రివ్యూ చూస్తూ దర్శకుడు ఎస్.రాంబాబు కనుమూత
  • కథ, నటుడు, పాట, సంగీతం… అన్నీ పర్‌ఫెక్ట్ అంచనా వేయగల దర్శకుడు…
  • నయనతారపై మరో పిటిషన్… మెడకు చుట్టుకున్న ఆ డాక్యుమెంటరీ…
  • భద్రాచలంపై చంద్రబాబు సర్కార్ వక్రదృష్టి… రేవంతే స్పందించాలి…
  • ఏమి సేతురా లింగా..! భారీ లాసుల్లోకి కన్నప్ప… నితిన్ తన తమ్ముడే…!!
  • ఏకకాలంలో కేంద్రంతో, ఏపీతో… మూడు పార్టీలతో రేవంత్ పోరాటం..!!
  • ఆ ఒక్క సీన్… సాగరసంగమం సినిమాను అమాంతం పైకి లేపింది…
  • ప్లీజ్… నెత్తురు అంటిన ఆనాటి నా టోపీ ఒకసారి ఇప్పించండి యువరానర్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions