తెలుగు ఇండియన్ ఐడల్ గురించి చెప్పాలంటే… ఈ సీజన్ 3 కాస్త డిఫరెంటుగానే ఉంది… కామెడీ పోర్షన్ పెంచినట్టున్నారు… అంటే, దానికి మరీ వేరే ట్రాకులేమీ లేవు… థమన్ చాలు, స్పాంటేనియస్‌గా వేసేస్తున్నాడు… అక్కడక్కడా కాస్త శృతి తప్పినా ఓవరాల్‌గా వోకే…
అన్నింటికీ మించి గీతా మాధురికి గత సీజన్ తాలూకు విమర్శలు తలకెక్కినట్టున్నాయి… పిచ్చి మేకప్ లేదు, తిక్క డ్రెస్సుల్లేవు… ప్లెయిన్‌గా కనిపిస్తోంది… జడ్జిమెంట్ చెప్పేటప్పుడు కూడా కాస్త డొక్క శుద్ధితో మాట్లాడుతోంది… గత సీజన్‌లో పిచ్చి పిచ్చి జడ్జిమెంట్లతో శ్రోతలను పిచ్చెక్కించింది… మనమూ కొన్ని చెప్పుకున్నాం కదా గతంలో…
ఏవో కొన్ని పిచ్చి అంత్యప్రాసల కవిత్వాలను క్రియేటివ్ టీం రాసి కార్తీక్‌కు పంపించడం, తను చదవడం ఫర్ ఫన్… పర్లేదు… మొన్నటి వారం ఎపిసోడ్‌లో థమన్ తన జడ్జిమెంట్లలో నిశిత పరిశీలన, కామెంట్లను మరిచిపోయాడా..? మొత్తం భజనే చేస్తున్నాడు అన్నట్టుగా కనిపించింది…
Ads
కానీ ఈ వారం ఎపిసోడ్ వోకే… ఒకరిద్దరి పర్‌ఫామెన్స్ విషయంలో గీతా మాధురి, కార్తీక్ పెద్దగా తప్పుపట్టకపోయినా థమన్ నిర్మొహమాటంగా మొహం మీదే చెప్పేశాడు… వాళ్ల పర్‌ఫామెన్స్‌లో ఏం లోపించిందో… నిజానికి అదే బలం ఈ షోకు… సరైన పరిశీలన, సరైన తీర్పు… ఇవే కదా అసలు పరీక్ష… పరీక్షే కదా ఈ షో ఉద్దేశం కూడా…
ఒక కంటెస్టెంట్ మాండలిన్, మరో కంటెస్టెంట్ వయోలిన్ తెచ్చుకుని వాయిస్తున్నారు… అవసరం లేదు, వాటిని అవాయిడ్ చేయాలి… ఎలాగూ ఆర్కెస్ట్రా సహకారం ఉంది కదా… పైగా ముదురు ఘటాలు ఈ ఆర్కెస్ట్రా వాయిద్యకారులు…
ఈసారి బాగా నచ్చుతున్నది ఏమిటంటే కోరస్… దాదాపు ప్రతి పాటకూ తోటి కంటెస్టెంట్లు కోరస్ పాడుతున్నారు… అలాంటి పాటలే సెలెక్ట్ చేయిస్తున్నారు, సాధన చేయిస్తున్నారు… మంచి కోరస్, మంచి ఆర్కెస్ట్రాతో కంటెస్టెంట్లు పాడుతుంటే లైవ్ కాన్సర్ట్‌లా ఉంది…
రికార్డింగ్ స్టూడియోలో ఎవరి ట్రాకులు వాళ్లు పాడేసి వెళ్తారు, ట్రాకు కలిపేస్తారు, కొన్ని లోపాలు కంప్యూటర్‌లో సరిదిద్దుతారు… అక్కడ రికార్డింగ్ చూసినా థ్రిల్ ఉండదు… ఇదుగో ఇలాంటి షోలే మ్యూజిక్ లవర్స్‌కు వీనులవిందు… గత రెండు సీజన్లలో కోరస్ మైకులు కూడా ఘోరం… గుడ్ గోయింగ్… ఈసారి ప్రతి పాటా దాదాపు ఫైనల్స్‌లో పాడుతున్నట్టే ఉంది…
ఫాఫం, ధర్మపురి శర్మ గారు ఎలిమినేటయ్యారు… అనుకున్నదే… సంగీతంలో ఎలాంటి శిక్షణ లేకుండా ఇలాంటి టఫ్ కంపిటీషీన్‌లో రాణించడం, ముందుకెళ్లడం కష్టమే… రాబోయే ఎపిసోడ్లలో మరింత గట్టి పోటీ, సంగీతాభిమానులకు మరింత ఆసక్తి ఖాయమే…
Share this Article