.
ఇక్కడ సోనమ్ వాంగ్‌చుక్ జాతి వ్యతిరేక కార్యకలాపాల వార్తలు, ప్రచారాల గురించి చెప్పుకోవడం లేదు… కాక్రోచ్ పార్టీకి తను ఎందుకు మద్దతుగా నిలబడ్డాడు, దీక్ష చేశాడు, వెనుక ఎవరున్నారో కూడా ముచ్చటించుకోవడం లేదు… అంతేకాదు…
నీట్ ఆందోళనతో మొదలైన దీక్ష చివరకు జాతి వ్యతిరేక, హిందూ వ్యతిరేక వేదికగా ఎలా మారిందో కూడా ఇక్కడ చెప్పడం లేదు… హిందూ పురాణాలపై వెకిలి వ్యాఖ్యానాలు, ప్రసంగాలు సరేసరి… కేజ్రీవాల్, అరుంధతీరాయ్, ప్రకాష్ రాజ్, లెఫ్ట్ కార్యకర్తలు తమ తమ ఎజెండాల ప్రదర్శన కోసం ఈ వేదికను ఎలా వాడుకున్నారో కూడా ఇక్కడ అప్రస్తుతం…
Ads
దీక్ష భగ్నం చేశాక… కపిల్ సిబల్ తన తరఫున వాదించడానికి సిద్ధపడ్డాడు అంటేనే… పక్కాగా ఇదంతా దేశ వ్యతిరేక ప్రదర్శన అని పక్కాగా చెప్పుకోవచ్చు… తన న్యాయవాద చరిత్ర అంతే అదే కదా… అసలు కేసు లేకుండా హాస్పిటల్‌లో ఉంచడం అక్రమ నిర్బంధం అంటాడు తను… సరే, హైకోర్టు ప్రభుత్వ చర్యను సమర్థించింది, కపిల్ సిబల్ వాదనను తోసిపుచ్చింది…
ఈ కేసు వేసింది వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో..!! ఎవరామె? వాళ్లిద్దరి ప్రణయ, పరిణయ కథేమిటనేది కాస్త ఆసక్తికరం అనిపించింది… నిజానికి ఈమె వాంగ్‌చుక్‌కు రెండో భార్య… వాంగ్‌చుక్ మొదటి భార్య అమెరికన్ రచయిత్రి, సంపాదకురాలు రెబెక్కా నార్మన్… లడఖ్ సంస్కృతి, బౌద్ధ తత్వం, హిమాలయ ప్రాంతాలపై ఆసక్తి ఉన్న రెబెక్కా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసింది.
వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కాలక్రమంలో వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఈ విషయంపై సోనం వాంగ్‌చుక్ గానీ, రెబెక్కా నార్మన్ గానీ ఎప్పుడూ బహిరంగ విమర్శలు చేసుకోలేదు. వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగానే ఉంచారు.

గీతాంజలి జె. ఆంగ్మో ఎవరంటే?
గీతాంజలి జె. ఆంగ్మో ఒడిశాలో జన్మించింది. ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, అనంతరం ఎంబీఏ చేసి దాదాపు పదిహేనేళ్లు కార్పొరేట్ రంగంలో పనిచేసింది. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఉద్యోగ అనుభవం సంపాదించింది.
అయితే మంచి ఉద్యోగం, మంచి వేతనం కంటే సమాజానికి ఉపయోగపడే పని చేయాలనే ఆలోచన ఆమెను సామాజిక సేవ వైపు మళ్లించింది. విద్య ద్వారా పర్వత ప్రాంతాల అభివృద్ధి సాధ్యమనే భావనతో పనిచేయడం ప్రారంభించింది. అదుగో అక్కడే కలిశారు వాంగ్‌చుక్, గీతాంజలి. పరిచయం నుంచి ప్రణయానికి, ప్రణయం నుంచి పరిణయానికి వేగంగానే అడుగులు పడ్డాయి…
వివాహం తర్వాత ఇద్దరూ కలిసి Himalayan Institute of Alternatives, Ladakh (HIAL) అనే వినూత్న విద్యాసంస్థను నిర్మించారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన, నిర్వహణ, నిధుల సమీకరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటులో గీతాంజలిదే కీలక పాత్ర…
ఇప్పటి వరకు గీతాంజలి ఎక్కువగా తెర వెనుకే పనిచేసేది. ప్రస్తుతం జంతర్ మంతర్ దీక్ష దగ్గర ఆమె మీడియాకు కనిపించడం ప్రారంభమైంది… తనను లిఫ్ట్ చేసి, హాస్పిటల్‌లో చేర్చాక, తాము కోరిన హాస్పిటల్‌లో చేరడానికి అనుమతించాలని కోర్టుకెక్కింది. వాంగ్‌చుక్ ప్రతి అడుగు వెనుక ఆమె ఉంటుంది… నిజమైన సహచరి !!
Share this Article