అందుకే ఇండియన్ ఐడల్ తెలుగు షో చూస్తున్నవాళ్లు బలంగా ఫీలయ్యేది జడ్జి స్థానంలో నిత్యామేననే కొనసాగి ఉంటే బాగుండేది అని… గీతామాధురిని తీసుకొచ్చి షో ఉదాత్తతను చెడగొడుతున్నారు అని… ఆమె నిజానికి ఓ బిగ్‌బాస్ కేరక్టర్… పరిణతి, హుందాతనం ఉండవు… దట్టంగా మేకప్ వేసుకుని, తొడలు కనిపించేలా ఓ చెత్త డ్రెస్ వేసుకుని వచ్చిన తీరు ఓసారి మనమే చెప్పుకున్నాం తెలుసు కదా… విషయంలోకి వస్తే…
ఇండియన్ ఐడల్ షోలో థమన్, కార్తీక్‌ల ప్రజెన్స్ బాగుంది… వాళ్ల వ్యాఖ్యల్లో గానీ, కంటెస్టెంట్ల మెరిట్ అంచనా వేయడంలో గానీ మెచ్యూరిటీ కనిపిస్తుంది… ఎప్పుడూ ఒకే తీరు గాకుండా ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కోరకంగా డిజైన్ చేస్తుంటారు… కంటెస్టెంట్లలో టెన్షన్ తగ్గించడం, ఫ్రీగా పాడగలిగే వాతావరణం కల్పించడం కోసం ఎప్పటికప్పుడు వాతావరణం తేలికపడేలా ఆ ఎపిసోడ్ డిజైన్ ఉండాలి…
దాస్ కా ధమ్కీ సినిమాలో నటించిన విష్వక్సేన్, నివేధా అతిథులుగా వచ్చారు… జడ్జెస్ ప్లేలిస్టు అని టాస్క్… అయాన్ ప్రణతి 14 ఏళ్లకే తన పాటతీరుతో అదరగొడుతోంది… ఆమెకు శ్రేయో ఘోషాల్ పాడిన ఓ పాటను టాస్కుగా ఇచ్చింది గీతామాధురి… ఆమెకన్నా ప్రణతి బాగా పాడింది… అది మనసులో మంటరేపినట్టుంది… కుళ్లుబోతుతనం… ప్రణతి అస్సలు బాగా పాడలేదు, నాకు నచ్చలేదు, పంచ్ లేదు అంటూ… ఇదీ కారణం అని స్పష్టంగా చెప్పలేక ఏదేదో వాగేసింది…
Ads
ఆమె మాట్లాడుతుంటే థమన్, కార్తీక్ థూ అన్నట్టుగా చూశారు ఆమెవైపు… ఎందుకు ఈమెను ఈ షోకు జడ్జిగా పట్టుకొచ్చార్రా బాబూ అన్నట్టుగా… చివరకు స్వరజ్ఞానం లేని విష్వక్సేన్ కూడా గీతామాధురి వైపు అదోరకంగా, అంటే ఛీత్కారంగా చూశాడు… నిజానికి ఈమె మొదటి నుంచీ ఫుల్లు మేకప్పుతో ఓ గ్లామర్ డాల్‌గా కూర్చుంటున్నదే గానీ ఓ గాయకురాలితనం ఏమీ కనిపించడం లేదు ఆమెలో… గ్లామరే కావల్సి ఉంటే ఇండస్ట్రీలో ఎందరు లేరు..? తెచ్చి కూర్చోబెట్టొచ్చు కదా…
కంటెస్టెంట్లు ఎలా పాడినా ప్రశంసించాలని ఏమీ లేదు… కానీ సరైన కారణం చెప్పగలగాలి… అదీ థమన్, కార్తీక్‌లకు చిరాకెత్తించినట్టుంది… తరువాత కాస్త వెటకారాన్ని దట్టించి కార్తీక్, థమన్ విసుర్లకు దిగారు… ఈ దేభ్యం మొహానికి ఆ వ్యాఖ్యలు కూడా అర్థం కాలేదు… సాధారణంగా ఇలాంటి షోలలో వీలున్నంతవరకూ నెగెటివిటీని చూపవద్దని, ఎంకరేజ్ చేసినట్టుగా కామెంట్లు ఉండాలని ముందే చెబుతారు… మార్కులు మీ ఇష్టం కానీ ఎయిర్‌లోకి వెళ్లే కామెంట్ల విషయంలో జాగ్రత్త అని చెబుతారు…
థమన్, కార్తీక్ కూడా కొన్నిసార్లు కంటెస్టెంట్ల పట్ల నెగెటివ్ కామెంట్స్ చేస్తారు… కానీ ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో సాధికారంగా చెబుతారు… అదీ గీతామాధురిలో లోపించింది… అందుకే ఆమె ఆ జడ్జి స్థానానికి బ్యాడ్ సెలక్షన్… పైగా ఇలాంటి నిష్కారణ కామెంట్ల వల్ల ఆయా కంటెస్టెంట్లకు పడే వోట్లు కూడా ప్రభావితం అవుతుంటాయి… ఐనా ఇవన్నీ తెలిస్తే ఆమెను గీతామాధురి అని ఎందుకంటారు..?! ఆమె జీతెలుగు సరిగమ ప్రోగ్రామ్‌కు మాత్రమే సూటయ్యే మ్యాటర్…
Share this Article