Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గీతూ రాయల్… ఇలాంటి కేరక్టర్లే అవసరమబ్బా… లేకపోతే షో శుద్ధ దండుగ…

September 6, 2022 by M S R

గలాటా గీతు… గీతు రాయల్… చిత్తూరు చిరుత… ఏ పేరుతోనైనా పిలవండి… నోరిప్పితే చాలు, దడదడ మాటల ప్రవాహమే… చిత్తూరు యాస పర్‌ఫెక్ట్‌గా పలుకుతుంది తన గొంతులో… ఇంకా ఏ కృతిమత్వమూ ఆమె యాసను పెద్దగా పొల్యూట్ చేయనట్టుంది… ఎందుకు చెప్పుకోవడం అంటే..? కాస్త భోళాగా, తనేం మాట్లాడుతుందో కొన్నిసార్లు తనకే తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటుంది కదా… కానీ ఇలాంటి కేరక్టర్ బిగ్‌బాస్‌లో అవసరమే… మొత్తానికి సోమవారం షోను డామినేట్ చేసిపడేసింది… మిగతా ఆడ, మగ కేరక్టర్లు హోప్‌లెస్ యాక్షన్… నేహా మినహా… ఓ టాస్క్‌ను తనంతటతనే సిద్ధపడింది…

నిన్న ఏదో బాత్‌రూం బొచ్చు గొడవ జరిగిందిగా… ఇనయ రెహమాన్‌తో గీతూ గొడవ… ఇనయ కూడా తక్కువేమీ కాదుగా… గీతూను కార్నర్ చేస్తూ పోయింది… ఇక గీతూకు class category పేరుతో ఓ చాన్స్ దొరికింది… తను మిగతా కంటెస్టెంట్లతో ఎలాగైనా పనిచేయించుకోవచ్చు నిర్ణీత టైం ఫ్రేంలో… ఇంకేం..? ఇనయను ఓ ఆట ఆడుకుంది గీతూ… ఓ దశలో ఇనయ హేండ్సప్… సో, గీతులా సందడి చేస్తూ, అల్లరల్లరిగా వ్యవహరించే కేరక్టర్లు ఉంటేనే బిగ్‌బాస్‌ షో చూడబుల్ అయ్యేది… ఇనయ కూడా డిఫెన్స్ ప్లేయర్ కాదు, యాక్టివే…

అందరూ పెద్ద మనుషుల్లా వ్యవహరిస్తూ ఉంటే, డిఫెన్స్ ఆడుతూ ఉంటే… ఇక బిగ్‌బాస్ షో దేనికి..? వాళ్ల తిండీతిప్పలు, బాత్రూంల వద్ద వేషాలు చూడటానికా..? నిజానికి ఫైమా కాస్త ఎనర్జిటిక్… కానీ ఇంకా తను బయటపడటం లేదు… మంగళవారం షో పరిశీలిస్తే… దాదాపు మగ కేరక్టర్లన్నీ శుద్ధ దండుగ… బుధవారం ప్రోమో చూస్తున్నా గీతూయే డామినేట్ చేసినట్టు కనిపిస్తోంది…

Ads

Geethu royal

ఇప్పుడు గడ్డాలు ట్రెండ్ కదా… నప్పినా నప్పకపోయినా అందరూ గడ్డాలతో కనిపిస్తున్నారు… చలాకీ చంటి మినహా… మరీ సూర్య అలియాస్ కొండబాబు మొహం ఆ చిత్రమైన గడ్డంతో అదోరకంగా కనిపిస్తోంది… ఈ మగ తోపుల్లో రేవంత్, షానీల హెయిర్ కట్ ఓ చెత్త స్టైల్… సో, మొత్తానికి ఆడ లేడీస్ మొహాలే కాస్త చూడబుల్‌గా ఉన్నాయి… రేవంత్ performance మళ్ళీ hopeless… ఓ దశలో తను ఎందుకు ఏడుస్తున్నాడో, పొద్దుణ్నుంచీ ఏమీ తినకుండా ఎందుకు నిరాహారంగా ఉన్నాడో, గంట సేపు మొహం పదే పదే ఎందుకు కడిగాడో… అంతా గందరగోళం… సగం మంది పేర్లు అసలు ఇప్పటికీ ప్రేక్షకుల బుర్రల్లో రిజిష్టర్ కాలేదు… అంటే ఉత్త దేభ్యం మొహాల్లా నిలబడుతున్నారు, అంతే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions