.
సెలవులు దొరికాయి… పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఎటు వెళ్లాలి..? చాలా ఇళ్లల్లో ఈ ప్లానింగ్, మథనం నడుస్తూనే ఉంది… అఫర్డబులిటీ పెరిగింది… పర్యాటకంపై జనం ఖర్చు పెరుగుతోంది… రిలాక్స్ కోసం అప్పుడప్పుడూ టూర్లు అవసరమనే భావనా పెరుగుతోంది…
ఐతే ఎటు..? ఓ ప్రశ్న… గోవా..? వారణాసి..? ఏది ఎంచుకుంటారు అంటే..? కోటిమంది గోవా అంటే 11 కోట్ల మంది వారణాసి అంటున్నారు… ఇదీ ప్రజెంట్ ట్రెండ్… ఇంకాస్త వివరాల్లో వెళ్తే…
Ads
ఇండియాలో పర్యాటక రంగంలో కొత్త ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది… COVID-19 మహమ్మారి తర్వాత దేశీయ పర్యాటకుల సంఖ్య పెరగడం చాలా విశేషం… ప్రత్యేకంగా, ఆధ్యాత్మిక యాత్రలు, పుణ్య క్షేత్రాలు, వెల్‌నెస్, యోగా వంటి మార్గాల్లో పర్యాటకులు భారీగా పెరుగుతున్నారు…
గతంలో గోవా వంటి తీరప్రాంతాలు పర్యాటకులను బాగా ఆకర్షించేవి…కానీ ఇప్పుడు ట్రెండ్ స్పిరిట్యుయల్ టూరిజం… ప్రభుత్వ గణాంకాల ప్రకారం.., 2024లో గోవాకు కోటి మంది వెళ్తే, వారణాసికి 11 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని వెల్లడిస్తున్నాయి… ఈ సంఖ్య నాన్-స్టాప్‌గా పెరుగుతోంది… వారణాసితో పాటు తిరుమల, అయోధ్య, తిరుపతి, ప్రయాగ్‌రాజ్, పూరీ, అజ్మేర్ లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది… ప్రజలు కేవలం మతపరంగా కాకుండా వేర్వేరు జీవితానుభూతులు పొందేందుకు అక్కడికి వెళుతున్నారు…
Agoda ట్రెండ్ – తిరుపతి టాప్
FHRAI (Federation of Hotels and Restaurants Association of India) వార్షిక సదస్సు ఒకటి Futurescape2047- redefining hospitality for new india పేరిట మొన్నటి 19న బెంగుళూరులో జరిగింది… వందలాది మంది డెలిగేట్లు… హోటళ్ల ప్రతినిధులు, పాలసీ మేకర్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూరిజం ఫెసిలిటేటర్లు పాల్గొన్నారు…
ప్రధాన నగరాలు కాదు, రెండవ, మూడవ శ్రేణి పట్టణాలు, నగరాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది… ఆ డిమాండ్ తట్టుకునేలా కొత్త వ్యూహాలు అవసరమని ఈ సదస్సు అభిప్రాయపడింది… తీర్థయాత్రలే కాదు… యోగా, ఆయుర్వేదం, మెడిటేషన్ అవసరాల కోసం రిషీకేశ్ వంటివి ప్రధాన యాత్రాస్థలాలుగా మారుతున్నయనీ సదస్సు గుర్తించింది…
ఈ వార్షిక కన్వెన్షన్‌లో.., Agoda సంస్థకు ఓ ప్రశ్న ఎదురైంది..? పర్యాటకులు ఏ టూరిస్ట్ స్పాట్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అని… అది ఏం చెప్పిందీ అంటే… బెంగుళూరు, గౌహతి, ఆగ్రాలు కాదు… ఇండియాలో ఎక్కువగా సెర్చ్ అయిన నగరాల్లో తిరుపతి ముందు వరుసలో ఉంది… ఇంట్రస్టింగు…
చాలామందికి జెన్ జీ అనగానే అల్లర్లు, విధ్వంసం, ఆవేశం, అనాలోచిత ఆందోళనలు గుర్తొస్తున్నాయి కదా… నిజానికి జెన్ జీలో యాత్రాస్థలాల పట్ల విపరీతంగా ఆసక్తి పెరిగింది… భక్తిపర్యాటకంపైనే ప్రధానంగా..! ఓ కంట్రాస్టు..! వాళ్లకు జీవనయాత్రలో వైవిధ్యం కావాలి… భిన్న సాంస్కృతిక పరిచయం కావాలి… ప్రయాణాల్లో కొత్త జ్ఞానం కావాలి… కొత్తదనం కావాలి…
కనెక్టివిటీ, మౌలిక వసతులు
ఈ ట్రెండ్ పెరుగుతూ, మంచి కనెక్టివిటీ, మెరుగైన వసతులు, ఈ రంగ విస్తరణకు తోడ్పడుతున్నాయి… మీరు గమనించారో లేదో… శ్రీశైలం మంచి ఉదాహరణ… ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, ఘాట్ రోడ్లు, దట్టమైన అటవీ వాతావరణానికితోడు దేవుడు… పర్యాటకులకు అన్నీ మిక్స్ ప్యాకేజీలు కావాలి ఇప్పుడు… సేమ్, డార్జిలింగ్, నైనిటాల్ వంటి ప్లేసులు…
కేంద్రం కూడా భక్తిపర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తోంది… పర్వతమాల కింద రెండు రోప్‌వేలు కడుతున్న తీరు చెప్పుకున్నాం… ఒడిశా ప్రభుత్వం తార తరణి టెంపుల్‌కు రీమోడల్ చేసింది… వారణాసి, ఉజ్జయిని రూపురేఖలు మారిపోయాయి… అయోధ్య సరేసరి… అంతెందుకు..? పక్కా నాస్తిక ప్రభుత్వం, అదీ కోట్లమంది అయ్యప్త భక్తుల మనోభావాలను దెబ్బతీయటానికి పూనుకున్న కేరళ ప్రభుత్వం అదే శబరిమల విషయంలో లెంపలేసుకుని, 1100 కోెట్ల ప్యాకేజీని ప్రకటించింది ఇటీవలే…
పిల్లల ఆటలు, పెద్దల సరదాలు… కిలోమీటర్ల కొద్దీ కార్లు రోడ్డు మీద ఆగిపోయి కనిపిస్తుంటాయి రద్దీ రోజుల్లో… అంత డిమాండ్ పెరిగింది… నిజానికి పెరుగుతున్న డిమాండ్‌కు తగినన్ని హోటళ్లు లేవు… ఇదే రాబోయే రోజుల్లో హోటల్ రంగానికి సవాల్… (కంట్రాస్టు ఏమిటంటే..? గోవాలో హోటళ్లు, వాహనాల అనైతిక వ్యాపార పద్ధతులతో జనం గోవాకు వెళ్లడానికి జంకుతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు… రియాలిటీ ఇది…)
కర్ణాటకలో కొత్త ఉత్తేజం…
కర్నాటక అంటే జస్ట్ బెంగుళూరు, మైసూరు ఒకప్పుడు… కానీ ట్రెండ్ మారింది… గోకర్ణ, ధర్మస్థలి, కుక్కే సుబ్రహ్మణ్యం, శృంగేరీ వంటివి పాపులరయ్యాయి… ప్రత్యేకించి కోస్టల్ టూరిజం మీద కర్నాటక అధికారగణం బాగా కాన్సంట్రేట్ చేస్తోంది…
భక్తి, పర్యాటకం… స్పోర్ట్స్, ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, ఫారెస్ట్ క్యాంపింగ్ ఎట్సెట్రా… కర్ణాటక ప్రభుత్వం 320 కిలోమీటర్ల కోస్ట్‌లైన్‌తో ప్రత్యేక ‘కోస్టల్ టూరిజం పాలసీ’ను విడుదల చేసేందుకు సిద్ధమైంది… కొత్త హోం స్టే పాలసీ తయారుచేస్తోంది… 2024లో రాష్ట్రంలో మొత్తం 30.46 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని సీఎం ప్రకటించారు… ఇది గత ఏడాదితో పోలిస్తే 56% వృద్ధి…
4 లక్షల మందికి పైగా ఉద్యోగాల కల్పనకు ప్లాన్… అలాగే వచ్చే రెండు సంవత్సరాల్లో 50,000 యువతను టూరిస్ట్ గైడ్స్‌గా ట్రెయిన్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు… గుడ్ పాలసీ… FHRAI కాన్ఫరెన్స్‌లో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పిన ప్రకారం.., ఇండియాలో టూరిజం రంగం రాబోయే సంవత్సరాల్లో 20 శాతం వృద్ధి సాధించబోతుంది…!! ఇప్పుడు చెప్పండి ఎటు వెళ్దాం… గోవా..? వారణాసి..?
Share this Article