Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!

August 20, 2026 by M S R

.

Srini Journalist … ‘జెన్ జీ’ కేవలం రోడ్లపై లేదు… దేశ సరిహద్దుల్లో కాపలా కూడా కాస్తోంది!
కార్గిల్ (మినిమార్గ్) చెక్‌పోస్ట్ వద్ద ఒక పర్యాటకురాలు భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ, “మేము జెన్ జీ (Gen Z)… మా పన్నుల డబ్బులతోనే మీకు జీతాలు వస్తున్నాయి” అంటూ మాట్లాడిన వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

మొదట చిన్న గొడవలా అనిపించిన ఈ సంఘటన, సోషల్ media వల్ల ఇప్పుడు ఒక పెద్ద వివాదంగా మారింది. సదరు మహిళ “మేము జెన్ జీ, మాతో పెట్టుకోవద్దు” అని ఎవరినైతే బెదిరించిందో, ఆమె మర్చిపోయిన అతి పెద్ద నిజం ఏంటంటే… ఆ కార్గిల్ మంచు కొండల్లో, ఆ చెక్‌పోస్ట్ వద్ద తుపాకులు పట్టుకుని డ్యూటీ చేస్తున్న సైనికులు అందరూ 100% ఆమె వయసున్న జెన్ జీ (Gen Z) యువకులే! ప్రస్తుతం సరిహద్దుల్లో ఫ్రంట్‌లైన్ డ్యూటీలు చేసేవారంతా 17 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న కుర్రాళ్లే.

Ads

ఒకే వయసున్న ఒక అమ్మాయి పర్యాటకురాలిగా వచ్చి అహంకారం చూపిస్తుంటే, అదే వయసున్న యువకులు అక్కడ దేశం కోసం రక్తం గడ్డకట్టే చలిలో ప్రాణాలు పణంగా పెట్టి నిలబడ్డారు.
మొత్తం సైన్యంలో సగం జెన్ జీ వాళ్ళే: కేవలం ఆ చెక్‌పోస్టే కాదు, ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిపి మొత్తం భారత సైన్యంలో 45% నుండి 50% మంది ఈ జెన్ జీ తరానికి చెందినవారే. ‘అగ్నిపథ్’ ద్వారా చేరుతున్న అగ్నివీరులు, సరిహద్దుల్లో ఉండే యువ అధికారులు (లెఫ్టినెంట్లు, కెప్టెన్లు) అందరూ ఈ తరమే.

పన్నుల అహంకారం తప్పు
“మేము పన్నులు కడుతున్నాం కాబట్టి మీకు జీతాలు వస్తున్నాయి” అనే వాదన చాలా అపరిపక్వమైనది. భారత సైన్యంలో పనిచేసే ప్రతి జవాన్, అధికారుడు కూడా తమ జీతంపై సాధారణ పౌరులలాగే ఆదాయపు పన్ను (Income Tax) కడతారు. దేశంలో ఉప్పు కొనే సామాన్యుడి నుండి ప్రతి ఒక్కరూ పరోక్ష పన్నులు (GST) కడుతున్నారు. పన్నులు కట్టడం అనేది పౌరుడిగా ఒక బాధ్యత, కానీ అది సైనికులపై దౌర్జన్యం చేయడానికి ఇచ్చిన ‘లైసెన్స్’ కాదు.

కార్గిల్ వంటి వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ కాన్వాయ్‌ల కదలికలు, వాతావరణ పరిస్థితుల వల్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడం సర్వసాధారణం. ఏ తరానికి చెందిన వారైనా, ఎంత పన్ను కడుతున్నా… దేశ భద్రతను మించిన హక్కులు ఎవరికీ ఉండవు. సైనికుల పట్ల గౌరవం చూపడమే నిజమైన దేశభక్తి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!
  • చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !
  • 4 వేల కోట్లు కాదు – 8 లక్షలు- 50 దేశాలు- మన తొలి పాన్ వరల్డ్ జెండా !!
  • భారం- ప్రేక్షకుడు ఇంకా దూరం- కూర్చున్న కొమ్మ నరుక్కునే టాలీవుడ్ !
  • జలధికన్నా లోతైన ప్రేమ ! ఓ పట్టాన నమ్మలేని వాస్తవ కథ !!
  • ‘నాన్నా… ఈసారి బామ్మ దగ్గరికి నేనొక్కడినే వెళ్తాను ప్లీజ్…’
  • చివరికి ఆ ఇంటిపేరుతోనూ తెగతెంపులే ! జాతకం అదే చెబుతోందట !!
  •  జ్ఞాపకాలు తరిమితే… మైఁ వాపస్ ఆవుంగా… జరూర్ ఆవుంగా… 

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions