Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Gentle Woman ..! మునుపటి మహిళ కాదు… కోపమొస్తే రుద్రకాళే…!!

May 3, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ………. టైటిలే జెంటిల్ ఉమన్ . సినిమా క్రూయెల్ ఉమన్ . సినిమా మొదట్లో శాకాహార సినిమాలా , సంసారపక్షంగా ప్రారంభం అవుతుంది . క్రమక్రమంగా మెత్తటి క్రూరంగా మారిపోతుంది.

హల్లో మొగోళ్ళూ ! జర జాగ్రత్త . రోజూ మీడియాలో చూస్తూ ఉంటాం . వివాహేతర సంబంధం కల మొగుడ్ని లేపేసిన మహిళ . లేపేసాక బాడీని ఏం చేయాలి ? ముందు ఫ్రిజ్లో పెట్టాలి . తర్వాత ఖండఖండాలుగా కట్ చేయాలి . పూటకో ముక్కని బిర్యానీలో కలిపి బయట కుక్కలకు వేయాలి .

Ads

బహుశా ఇందువలనే ఏమో వీధి కుక్కలు ఎక్కవయి జనాలని కరిచేస్తున్నాయి , పీక్కు తింటున్నాయి . కల్కి కాలం . మళ్ళా సినిమాలోకి వెళదాం .

ఈ సినిమాలో అమాయకంగా కనిపించే మూడు నెలల పెళ్ళికూతురు మొగుడికి వేరే సెటప్ ఉందని విడిచేసిన బట్టల నుండి వచ్చే వాసనను బట్టి పట్టేసి లేపేస్తుంది . సృష్టిలో ఆడవారికి మగవారి దుస్తుల వాసనను , శరీరం వాసనను ఇట్టే పట్టేసే శక్తి ఉంటుందని అంటారు . ఆ శక్తి వలనే భార్య లేపేసి ఫ్రిజ్లో పెడుతుంది .

సదరు మొగుడి గారికి పెళ్ళికి ముందే ఉన్న సెటప్ పోలీస్ స్టేషనుకి వెళ్లి కేసు పెడుతుంది . సందట్లో సడేమియా పోలీసాయన ఈ సెటప్ మీద అత్యాచారం చేయబోతే సెటప్ గారు వాడిని లేపేసి ఫ్రిజ్లో పెట్టేస్తుంది . ఇప్పుడు అర్థం అయిందా ? మనుషులు పట్టే ఫ్రిజ్జులను ఇంట్లో ఉంచుకోకూడదని . చివరాకర్లో భార్య గారు , సెటప్ గారు కలిసిపోతారు అధికార పక్షం , ప్రతిపక్షం లాగా …

అమెజాన్ ప్రైంలో ఉంది . సాదాసీదాగా మొదలయి , స్లోగా ముందుకు సాగుతుంది . చూడబులే . మారుతున్న కాలంలో వినూత్న పోకడలు . సతీ సావిత్రి , సతీ సుమతి రోజులు కావివి అని తన్ని చెప్పే సినిమా .

మహిళాగ్రహ సినిమా అన్న మాట . ధర్మహింసా తదైవచా . మొగోడు అధర్మరాజు అయితే లేడీ తన ధర్మాన్ని తాను అమ్మోరయి పైసల్ చేస్తుంది …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సుమంత్‌ను ఫ్లాప్ కెరీర్ వెంటాడుతూనే ఉంది – ఖర్మ థియరీ !!
  • ఉన్నమాటే అన్నాడు – నాణ్యమైన సరుకు ఉత్పత్తే లేదు కదా…
  • చిన్న చిన్న ఆశ ! కొందరికి అస్సలు నచ్చదు – వాళ్లు చూడొద్దు !!
  • వాడు మొనగాడు – చేతిలో పార, గడ్డపార… కళ్లెదుట ఓ ‘దారి’…!
  • కేసీయార్ సార్, మీ విజ్ఞతపై ఇంకా నమ్మకముంది… మరి ఇదేం పోకడ !?
  • ప్రతి పనికీ పార్టీ ఆమోదమా? ఇవి సీఎం ముందరికాళ్లకు బంధాలు?
  • అనుకున్నదే ! బొద్దింకలకు జతగా క్రిమినల్స్ ! ఏదో ప్రిప్లాన్‌డ్ స్కెచ్ !!
  • రామాయణ్ దర్శకుడు నితేశ్ తివారీ నాకెక్కడ నిజంగా నచ్చాడంటే..!?
  • రక్తసంబంధాలు పెళుసుగా మారి… ఇంటింటికో ఇలాంటి కథ!
  • నిండుకుండ ఎల్లంపల్లి గేట్లు ఓపెన్ ! – గులాబీ నోళ్లు క్లోజ్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions