Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడంటే బొద్దింకలు ! ఈ ‘జెంటిల్‌మేన్’ ఎప్పుడో చర్చించాడు !!

July 27, 2026 by M S R

.

( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) …. డబ్బింగ్ సినిమాలా డైరెక్ట్ టేక్ సినిమాలా అని ప్రేక్షకుడు ఆలోచించడు . సినిమా బాగుందా లేదా అనేదే ప్రేక్షకుడు చూసేది . బాగుంటే బ్రహ్మరథం పడతాడు . ఆ కోవలోకి వచ్చే సినిమాయే ఈ జంటిల్మెన్ . 1993 జూలైలో వచ్చిన ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది .

అలా ఊపేయటానికి కారణాలు సినిమా థీం , పాటలు , డాన్సులు , ఫైట్స్ , ఏక్షన్ , బిర్రయిన స్క్రీన్ ప్లే , దర్శకుని ప్రతిభ . ఆరోజుల్లో తమిళనాడు , కర్నాటక రాష్ట్రాలలో మెడికల్ , ఇంజనీరింగ్ సీట్లు అమ్మకానికే ఎక్కువగా ఉండేవి . మన రాష్ట్రం నుండి కూడా ఆ రోజుల్లో ఇక్కడ సీట్లు రాని వాళ్ళు ఆ రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు .

Ads

ఒరిజనల్ వెర్షన్ తమిళం కాబట్టి అక్కడ ఉన్న మెడికల్ విద్యను థీంగా తీసుకున్నాడు దర్శకుడు శంకర్ . అక్కడ సూపర్ హిట్టయింది . డబ్బుల వర్షం , అవార్డుల వర్షం కురిసాయి . దానితో తెలుగులోకి కూడా డబ్ చేసారు . అప్పటికి మన రాష్ట్రంలో మెడికల్ , ఇంజనీరింగ్ విద్య ఇప్పటిలాగా విపణిలో వస్తువు కాకపోయినా పాటలు , డాన్సులు , ఏక్షన్ సీన్ల వలన అదరగొట్టేసింది .

ఎ ఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాటలు సూపర్ హిట్టయ్యాయి . చికుబుకు చికుబుకు రైలే అదిరెను దీని స్టైలే పాట నిజంగానే అదిరింది . గౌతమి , ప్రభుదేవాలు ఇరగతీసారు . అప్పట్లో సెన్సేషన్ . ప్రభుదేవా డాన్సులంటే యూత్‌లో ఓ క్రేజ్ ఏర్పడింది . అర్జున్ , మధుబాల , అర్జున్ , శుభశ్రీల మీద డ్యూయెట్లను శంకర్ అద్భుతంగా చిత్రీకరించారు .

ముదినేపల్లి మడి చేలో ముద్దు గుమ్మ నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా , నా ఇంటి ముందున్న పూదోట నడిగేవో నా ఒంటి పైన జారే నా పైట నడిగేవో అర్జున్ , మదుబాల మీద ఉంటాయి . మావేలే మావేలే పరువాలు మావేలే అర్జున్ , శుభశ్రీ మీద ఉంటుంది . శుభశ్రీ , చరణ్ రాజ్ పెళ్ళిలో పాట కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో బాగుంటుంది . అన్ని పాటల చిత్రీకరణ చాలా బాగుంటుంది .



  • ప్రముఖ నటి మాలాశ్రీకి శుభశ్రీ సొంత చెల్లెలు. అసలు పేరు భారతి. అయితే, కొద్ది సంవత్సరాల పాటు వరుస చిత్రాల్లో నటించిన తర్వాత ఆమె క్రమంగా సినిమాలకు పూర్తిగా దూరమైంది, 1998లో నీరజ్ భువానియాను వివాహం చేసుకుని, సినిమారంగానికి స్వస్తి చెప్పింది. తరువాత తెర మీదకు, మీడియా ముందుకు అస్సలు రాలేదు.



ఈ సినిమాలో అర్జున్ ఏక్షన్ సూపర్బ్ . ఇతర ప్రధాన పాత్రల్లో చరణ్ రాజ్ , నంబియార్ , మనోరమ , వినీత్ , సెంథిల్ , గౌండమణి , రాజన్  తదితరులు నటించారు . శుభశ్రీ అల్లరి నటన , మధుబాల ఉక్రోషపు ప్రేమ చాలా బాగుంటాయి .

అవినీతిపరులను కొల్లగొట్టి కుల మతాలకు అతీతంగా ప్రజా విశ్వవిద్యాలయం నిర్మాణం థీం ప్రేక్షకులకు బాగా ఎక్కింది . అలా కొట్టగొట్టబడిన డబ్బుకు లెక్క చూపటానికే అయిదు రూపాయలు , పది రూపాయలు చందాలుగా వసూలు చేసినట్లు చూపే సీన్ రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో కూడా ఉంటుంది .

కుంజుమౌన్ నిర్మాత . సెంథిల్ , గౌండమణి , రాజన్ లకు మన బాబూమోహన్ , కోట శ్రీనివాసరావు , నూతన్ ప్రసాదులు డబ్బింగ్ చెప్పారు . సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళూ మన ముందు కనిపిస్తుంటారు . డబ్బింగ్ బాగా చెప్పారు కూడా . క్లైమాక్స్ అదిరిపోతుంది .

ఇంతకుముందు చూసినా మరలా చూడతగ్గ సినిమాయే . యూట్యూబులో ఉంది . An excellent action-oriented , musical hit movie .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోదీ వెనుక నీడలా ఓ నాగా మహిళ – ఎవరీమె..? నేపథ్యం ఏమిటి..?
  • సరిగమలు! ఓ విశ్వనాథ్ తీయాల్సిన సినిమా ఓ రాఘవేంద్రరావు తీస్తే..?
  • సూపర్‌స్టార్ రజినీకాంత్ అహం పూర్తిగా బద్ధలైన ఆ సందర్భం..!!
  • రేవంత్ రెడ్డిని ‘అండర్ ఎస్టిమేట్’ చేశారు – అడ్డంగా బుక్కయ్యారు !!
  • వావ్ గుజ్జూస్- ఏదైనా మాయ చేయగలరు… 8542 వోట్లు- ఖర్చు 290 కోట్లు !!
  • హోర్ముజ్ మాత్రమే కాదు – జిబ్రాల్టర్ జలసంధీ జియోపాలిటిక్స్ కేంద్రమే!!
  • మన గుండెలు రాళ్లు… నవ్వినా, ఏడ్చినా వాటికి పెద్ద ఫరక్ పడదు…
  • Just డేటా సెంటర్ కాదు… తెలంగాణ భవిష్యత్తుకు ‘కంప్యూట్ పవర్’!
  • సారూ, ఒక్కరిని… ప్లీజ్ ఇలాంటి ఒక్క గురువును చూపించండయ్యా…
  • ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు- వైవిధ్యం తక్కువ ! తెలిసిన మొహాలూ తక్కువ !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions