Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వ్యూహాత్మక బగ్రామ్ ఎయిర్‌ బేస్‌కై చైనా, అమెరికా పాలిటిక్స్… కానీ..?

November 14, 2025 by M S R

.

Pardha Saradhi Potluri …..  భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ముందస్తు ప్రణాళిక!
బాగ్రామ్ ఎయిర్ బేస్ @ క్రాస్ రోడ్స్!

బగ్రామ్ ఎయిర్ బేస్ మీద మొదటి నుండి చైనా కన్ను ఉంది. 2021 లో తాలిబాన్లు అధికారం చేపట్టాక బగ్రామ్ ఎయిర్ బేస్ ని తాము నిర్వహిస్తామని చైనా ప్రతిపాదించినా తాలిబాన్లు తిరస్కరించారు.
ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామని, దాని కోసం అప్పు కూడా తామే ఇస్తామని బదులుగా బగ్రామ్ ఎయిర్ బేస్ నిర్వహణ తమకి అప్పగించమని చైనా అడిగినా తాలిబాన్లు ఒప్పుకోలేదు. తాలిబాన్లు ఆఫ్రికా దేశాలు ఎలా చైనా అప్పుల ఊబిలో కోరుకుపోయి విలవిలాలాడుతున్నాయో తెలుసుకున్నారు!

Ads

బగ్రామ్ ఎయిర్ బేస్ ని తమకి అప్పగించమని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికన్లు తమ భూభాగం మీద అడుగుపెట్టనివ్వకూడదని ధ్రుఢ నిశ్చయంతో ఉన్న తాలిబాన్లు ఎయిర్ బేస్ ని భారత్ కి అప్పచెప్పెందుకే నిర్ణయించుకొని అమిర్ ఖాన్ ముత్తాకిని భారత్ కి పంపించారు!

అజిత్ దోవల్ – అమిర్ ఖాన్ ముత్తాకి!
1999 డిసెంబర్ లో ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన IC 814 విమానం ఖాట్మండు నుండి న్యూ ఢిల్లీ వస్తుండగా పాకిస్తాన్ కి చెందిన హార్కత్ – ఉల్- ముజాహిదిన్ తీవ్రవాదులు హైజాక్ చేసి మొదట అమృత్ సర్, లాహోర్, దుబాయ్ లకి తరలించి చివరికి కాందహార్ విమానాశ్రయంలో దించారు.
అప్పట్లో తాలిబాన్-1 ప్రభుత్వం అధికారంలో ఉంది.

భారత్ తరుపున చర్చల కోసం అజిత్ దోవల్ కందహర్ వెళ్లారు. విమాన ప్రయాణికులని విడిపించడానికి తాలిబాన్ల తో చర్చలు జరిపినప్పుడు తాలిబాన్ బృందంలో అమిర్ ఖాన్ ముత్తాకి కూడా ఉన్నాడు.
ఇప్పుడు అజిత్ దోవల్ తో అదే అమిర్ ఖాన్ ముత్తాకి సమావేశం అయ్యి ఆఫ్ఘనిస్తాన్ భద్రత కోసం సహాయం ఆర్ధించాడు.

ఆఫ్ఘనిస్తాన్ కి అంతర్జాతీయ గుర్తింపు లేదు!
తాలిబాన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది రష్యా మాత్రమే! గత జులై నెలలో రష్యా అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించి తమ రాయబార కార్యాలయాన్ని తెరిచింది.
ఇక తుర్క్ మెనిస్తాన్, ఇరాన్, ఖతార్, మియాన్మార్ దేశాలు అధికారికంగా గుర్తించలేదు కానీ దౌత్య సంబంధాలని కొనసాగిస్తున్నాయి. చైనా కూడా అధికారికంగా గుర్తించలేదు కానీ ఇరు దేశాలలో తమ తమ రాయబార కార్యాలయాలని తెరచాయి!

గత నెలలో అమిర్ ఖాన్ ముత్తాకి అభ్యర్ధన మేరకు భారత్ తన రాయబార కార్యాలయాన్ని మళ్ళీ ప్రారంభించింది!
మోడీ విదేశాంగ విధానం విఫలం అయ్యింది అనే ఆరోపణలకి అమిర్ ఖాన్ ముత్తావి అభ్యర్ధన చెప్పుతో కొట్టినట్లయింది.
కాబూల్ లో రాయబార కార్యాలయాన్ని తెరవడానికి భారత్ తొందరపడలేదు! స్వయంగా అభ్యర్థించే వరకూ వేచి చూసి ఆ తరువాతే తెరిచారు.

pak

ఆఫ్ఘనిస్తాన్ దగ్గర సోవియట్ కాలం నాటి యాంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ మాత్రమే ఉన్నాయి.
బగ్రామ్ ఎయిర్ బేస్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన కార్గో విమానాలాని చూపించి ఎయిర్ బేస్ ని భారత్ కి అప్పచెప్పినట్లుగా అనుమానిస్తున్నారు కానీ తాలిబాన్ అభ్యర్ధన మేరకు భారత ఇంజినీర్లు బగ్రామ్ లో లాండయి ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నారు.

సోవియట్ కాలం నాటి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ని సర్వీసింగ్ చేసి ఆర్డర్ లో పెట్టి, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇస్తున్నారు.
2021 లో అమెరికా వదిలి వెళ్లిన ఆధునాతన ఆయుధాలని ఎలా వాడాలో శిక్షణ ఇస్తున్నారు.
2021 లో రష్యా నుండి Tor – M2 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. అఫ్కోర్స్! Tor M2 అనేది బేసిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే!

ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవసరం ఏర్పడింది పాకిస్తాన్ వైమానిక దాడుల వల్ల. బహుశా మన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం తాలిబాన్లు అడిగే అవకాశం కొట్టిపారవేయలేము. కానీ చెల్లింపులు ఎలా చేస్తారనేదే సమస్య.

భారత్ S-400 ని ఆఫ్ఘనిస్తాన్ లో మొహరించింది అనే వార్త అబద్ధం! మనకే మరో మూడు రేజిమెంట్లు అవసరం ఉంది, అలాంటప్పుడు బగ్రామ్ లో ఎందుకు మొహరిస్తారు?
పాకిస్తాన్ jf-17, J10-C లకి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సరిపోతుంది!
బగ్రామ్ ఎయిర్ బేస్ ప్రస్తుతం భారత్ అదీనంలోనే ఉంది కానీ భద్రత విషయం తాలిబాన్లదే!

ట్రంప్ ఆగ్రహం?
Yes! ట్రంప్ మింగలేక కక్కలేక సతమతమవుతున్నాడు!
బగ్రామ్ ఎయిర్ బేస్ అమెరికన్లు నిర్మించినది అంటున్నాడు. నిజానికి 1960 వ దశకంలో అప్పటి సోవియట్ యూనియన్ బగ్రామ్ ఎయిర్ బేస్ ని నిర్మించింది. సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయేవరకు అంటే 1990 వరకూ బగ్రామ్ ఎయిర్ బేస్ సోవియట్ యూనియన్ పర్యవేక్షణలోనే ఉండేది. సోవియట్ సైన్యం 1990 లో ఖాళీచేశాక ఎయిర్ బేస్ తో పనిలేకుండా పోయింది.

2001 లో నాటో దళాలు బిన్ లాడెన్ కోసం ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించే నాటికి బగ్రామ్ ఎయిర్ బేస్ బేసిక్ ఫెసిలిటిలతో ఆపరేషన్ లో ఉంది. తమ అవసరాల కోసం అమెరికా అప్గ్రేడ్ చేసింది.
2021 లో అమెరికా కాబూల్ వదిలి వెళ్లే సమయంలో ఎక్కడ ఉన్నవి అక్కడే వదిలేసి పోయారు. అప్పుడు బగ్రామ్ తో వాళ్లకి అవసరం లేదు.

bagram

ఇప్పుడు ఎందుకు అవసరం ఏర్పడింది?
బగ్రామ్ ఎయిర్ బేస్ ని అప్ గ్రేడ్ చేయడంలో అమెరికా శ్రద్ధ చూపింది. రెండు రన్ వే లని అప్గ్రెడ్ చేసింది. ఒక రన్ వే 3 km మేరకు కాంక్రీట్ తో వేసింది. మరొక రన్ వే 3.6 km మేర కాంక్రీట్ తో వేసింది. ఈ రెండు రన్ వే లు కూడా భారీ మిలిటరీ రవాణా విమానాలు టేక్ ఆఫ్ , లాండ్ అవడానికి వీలుగా ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ భౌగొళిక స్వరూపం చూస్తే ఎత్తయిన కొండలతో విమాన రాకపోకలకి అనువుగా ఉండదు. బగ్రామ్ ని ఎయిర్ బేస్ గా అప్పటి సోవియట్ ఇంజినీర్లు ఎంచుకోవడానికి కారణం ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేకుండా వ్యూహత్మాకంగా సరైన ప్రదేశంలో ఉండడమే.

అమెరికా, చైనా లకి బగ్రామ్ ఎయిర్ బేస్ కావాలి…
వ్యూహాత్మకంగా మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియాలకి చేరువలో ఉండడమే బగ్రామ్ ప్రత్యేకత.
ఒకవేళ అమెరికా చేతిలో బగ్రామ్ ఉంటే చైనా లోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న చైనా ఎయిర్ బేస్ లలో కదలికలని గుర్తించి దాడి చేయడానికి వీలుగా ఉంటుంది.ఇరాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ వైపు నుండి దాడి చేయవచ్చు. పెంటగాన్ వ్యూహకర్తలు ట్రంప్ మీద ఒత్తిడి తేవడానికి కారణం ఇదే!

ఒకవేళ చైనా చేతిలో ఉంటే ఇటు భారత్ తో పాటు అటు ఇరాన్ లకి దగ్గరగా ఉంటుంది. అమెరికా కనుక ఇరాన్ మీద దాడి చేస్తే బాగ్రామ్ నుండి చైనా విమానాలు సహాయంగా వెళ్ళవచ్చు.
2020 లో నాటో దళాలని ఉపసంహరించుకోవాలని తీసుకున్న ట్రంప్ నిర్ణయాన్ని ముందుచూపు లేనిదిగా భావించాల్సి ఉంటుంది.

బగ్రామ్ ఎయిర్ బేస్ వరకే నాటో దళాలు పరిమితం అవుతాయి, మిగతా ప్రదేశాల నుండి నాటో ని ఉపసంహరించుకోవాలి అనే ప్రతిపాదన వచ్చినా ట్రంప్ సలహాదారులు ఏకపక్షంగా వెనక్కి వచ్చేయాలని సూచించి తప్పు చేశారు.

గుర్తుందా?
గత జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల తరువాత అంటే ఫిబ్రవరి లో ట్రంప్ బగ్రామ్ ని మళ్ళీ తమ అధీనంలోకి తీకుంటాము అని ప్రకటించిన సంగతి?
అంటే అప్పటికే చైనాతో పాటు మిగతా బ్రిక్స్ దేశాల మీద టారిఫ్ లు వేసే ప్రణాళిక ట్రంప్ టేబుల్ మీద ఉందన్నమాట.

usa

అమెరికన్ థింక్ ట్యాంక్!
ప్రపంచ దేశాల మీద అమెరికా ఆధిపత్యం కొనసాగాలంటే ఏ దేశం వచ్చే 20 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధిని సాధిస్తుంది, ఆ దేశం బలాలు ఏమిటీ, బలహీనతలు ఏమిటీ అనే అంశాలని పరిశీలించడానికి ఒక బృందం ఉంటుంది. వీళ్ళ పని తమకు అప్పగించిన దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులు, ఎవరు ఏ అంశం మీద ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు భవిష్యత్తులో తమకి ఉపయోగపడతారు లాంటి అంశాలని నిత్యం పరిశీలిస్తూ ఉంటారు.

ఈ బృందాలన్నీ తిరిగి మరో కేంద్ర బృందానికి నెల వారీగా నివేదికలు ఇస్తూ ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలో జరుగుతూ ఉంటుంది.
యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థి నాయకులు, మీడియా పాత్రికేయులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, లాయర్లు, గల్లీ స్థాయి రాజకీయ నాయకులు, పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు, ఇలా అన్ని వర్గాల వారు థింక్ ట్యాంక్ రాడార్ పరిధిలో ఉంటారు.

అవసరం వచ్చినప్పుడు డాలర్లు ఆశ చూపి ఆయా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా వాడుకుంటారు.
అమెరికన్ థింక్ ట్యాంక్ మోడీ విషయంలో చేయని ప్రయత్నం లేదు కానీ సఫలం కాలేకపోయింది.
కాంతా, కనకాలు కదా ఈ భూమి మీద ఆధిపత్యం చేలాయించేది! ఈ రెండు బలహీనతలు మోడీకి లేవు.
తాలిబాన్లు మోడీని విశ్వశించడానికి కూడా కారణం ఇదే!
అమెరికన్ థింక్ ట్యాంక్ అంచనాలు తప్పడానికి కూడా కారణం ఇదే!

ఇలా అయితే ఏం చేయాలి? ఈ ప్రశ్న వేసుకొని దానికి ప్రత్యామ్నయ మార్గాలు ఏమిటో ముందే ఆలోచించి పెట్టుకొని వాటిని అమలు చేస్తుంది థింక్ టాంక్.

అమెరికన్ థింక్ ట్యాంక్ కి ఊహించని దెబ్బ!

తాలిబన్ల వల్ల బగ్రామ్ ఎయిర్ బేస్ ఇప్పుడు భారత్ చేతిలోకి వెళుతుందని అమెరికా, చైనాలు అసలు ఊహించలేదు. ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ వైమానిక దాడి అనే పనికిమాలిన చర్య ఇప్పుడు బగ్రామ్ భారత్ చేతిలోకి రావడానికి కారణమయ్యింది.
అమెరికాకి తెలియకుండా ఆసిమ్ మునీర్ కాబూల్ మీద దాడి చేయలేడు. అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే పాకిస్తాన్ దాడి చేసింది.

cheif

అమెరికాతో అంట కాగితే ఏమవుతుంది?
ఇరాక్ అవుతుంది! పాకిస్తాన్ కూడా మరో ఇరాక్ అవుతుంది కాకపొతే ముక్కలు చెక్కలు అవుతుంది అంతే!
తన స్వప్రయోజనాల కోసం అమెరికా పాకిస్తాన్ ని వాడుకుంటున్నది అని తెలిసీ ఆసిమ్ మునీర్ మరో
జెలేన్స్కీ లాగా అయ్యాడు. మునీర్ తన కుటుంబంని అమెరికాలో ఉంచి పాకిస్తాన్ నాశనానికి పాల్పడుతున్నాడు!

మునీర్ కి తెలుసు ఏ మాత్రం తేడా వచ్చినా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఒక వైపు, పాకిస్తాన్ లోనే ఉంటున్న తాలిబాన్ మద్దతుదారులు తనని తన కుటుంబాన్ని సజీవంగా తగులబెడతారని! అందుకే తన భార్య పిల్లలని న్యూయార్క్ లో ఉంచి తాను పాకిస్తాన్ లో ఉంటున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్ తన సరిహద్దులు మూసివేసిన తరువాత….

పాకిస్థాన్ లో పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయి..
ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే టమాటో సరఫరా ఆగిపోవడంతో ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటాయి.
టొమోటో ఆఫ్ఘనిస్తాన్ నుండి సరఫరా అవుతున్నప్పుడు కిలో 200/- గా ఉండేది. ఇప్పుడు కిలో టొమోటో 400/- అయ్యింది. అదే మేలు రకం టొమాటో అయితే కిలో 500 నుండి 600 వరకూ ధర పలుకుతున్నది.
జస్ట్ ఒక పెద్ద టమాటో 50 రూపాయలు!
ఉల్లిపాయలు కిలో 200/-

పాకిస్థాన్ ప్రజలు ఎలా తయారయ్యారంటే కూరగాయలకి కూడా మతం రంగు పులుముతున్నారు. ఉదా: ఇరాన్ నుండి వచ్చే టమాటోని షియా టమాటో అంటారు.
భారత్ నుండి దుబాయ్ వెళ్లి అక్కడి నుండి తిరిగి పాకిస్తాన్ కి వచ్చే టమాటోని హిందూ టమాటో అని పిలుస్తున్నారు…… (తరువాయి భాగం కూడా ఉంది...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శివ అంటే నాగార్జున, వర్మ మాత్రమేనా..? ఇంకెవరికీ క్రెడిట్ లేదా..?!
  • డాక్టర్ ఐపీఎస్… ఉగ్రవాదుల ఓ భారీ కుట్రను ఛేదించిన తెలుగు పోలీస్…
  • వ్యూహాత్మక బగ్రామ్ ఎయిర్‌ బేస్‌కై చైనా, అమెరికా పాలిటిక్స్… కానీ..?
  • శివకు రీ-రిలీజ్ ఉన్నట్టే… వర్మకూ ఓ రీ-రిలీజ్ ఉంటే బావుండు…
  • దక్షిణాఫ్రికా నుండి గోవా తీరానికి… ఒక క్రికెట్ లెజెండ్ కొత్త కథ..!
  • ఏడీ..? ఆ కీరవాణి ఏమయ్యాడు..? టాలీవుడ్ సంస్కారం ఏమైంది..?!
  • పశ్చాత్తాప ప్రకటనలు… నేరాంగీకారాలు… జగన్ విధేయుల్లో భయం..!!
  • దాసి..! దోపిడీ కేంద్రాలు దొరల గడీలు… లైంగిక దోపిడీలకు కూడా…!
  • అమరజ్యోతి సంపూర్ణంగా వెలిగిస్తేనే… తెలంగాణ అమరులకు నివాళి…
  • నిష్కపటి, నిష్పక్షపాతి, నిర్మొహమాటి… నాకు తెలిసిన అందెశ్రీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions