Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆలీకి ఆది నుంచీ అలవాటే… పిచ్చి కూతలు, ఇప్పుడు తిక్క యాడ్స్…

May 13, 2026 by M S R

.

చిన్నప్పటి నుంచీ ఆ సినిమా వెకిలి వాతావరణంలో పెరగడం వల్ల కావచ్చు… చదువూసంధా లేకపోవడం వల్ల కావచ్చు… లేక తన గుణమే అది కావచ్చు… ఆలీ అనే కమెడియన్‌ నోరు విప్పితే చాలు, రోత… చాలా సందర్భాల్లో చూశాం… ఇప్పుడూ కుకూ జాతిరత్నాలు వంటి షోలో కావచ్చు… పిచ్చి కూతలు వస్తూనే ఉంటాయి… ద్వంద్వార్థాలు… హైపర్ ఆదికి దీటైన కేరక్టర్…

ఇప్పుడు ఓ పిచ్చి యాడ్ చేశాడు… ఏమిటయ్యా అంటే ఘర్ సోప్స్ ప్రమోషన్ యాడ్ చేశాడు… అందులో ఓ సబ్బుకు లక్ష్మి పూజ చేస్తున్నట్టు చూపించారు… బ్యాక్ గ్రౌండ్‌లో పవిత్రమైన లక్ష్మిదేవి మంత్రాలు వినిపిస్తుంటాయి… దీనిపై హిందూ సంఘాల తీవ్ర అభ్యంతరం… కేవలం ఒక వస్తువును విక్రయించడం కోసం మతపరమైన విశ్వాసాలను, మంత్రాలను అపహాస్యం చేయడం ఏమిట్రా అంటూ ఎక్కీదిగారు…

Ads

నెటిజనం నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఆ కంపెనీ స్పందించలేదు, కానీ ఆలీ మాత్రం ఓ వీడియో విడుదల చేశాడు… ప్రతి ఒక్కడికీ అలవాటే కదా, ‘‘ఎవరైనా బాధపడితే క్షమించండి’’ అని… బాధపెట్టడం, బాధపడితే క్షమించమని అడగడం ఓ క్షుద్ర వివరణ…

ఆ యాడ్ చేసినప్పుడు తెలియదా..? ఓ మత భావనల్ని కించపరుస్తున్నట్టు…? లేక తెలిసీ ఏమీ కాదులే అనే పోకడా..? పైగా అప్పుడెప్పుడో తను చేసిన దేవుడి చేసిన మనుషులు సినిమాలోని ఏదో కామెడీ సీన్‌ను పోలిన సీన్ అట, ఒప్పేసుకున్నాడట… పైగా అది కేవలం వినోదం కోసమే సుమా అంటున్నాడు… అంటే, వినోదం కోసం ఏం చేసినా పర్లేదా..?

పైగా మంత్రాల వినియోగం విషయంలో టెక్నీషియన్ల వల్ల పొరపాటు జరిగిందట… అసలు నువ్వు ఆ యాడ్ చేయడం తప్పు కాదా..? వేరే వాళ్ల మీదకు సాకు నెట్టడం దేనికి..?  ఆ వివాదాస్పద వీడియోను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఇప్పటికే తొలగించామని అంటున్నాడు… తప్పు చేయడం, సోషల్ ప్లాట్‌ఫారాల నుంచి తీసేస్తే అదేదో నివారణ జరిగిపోయినట్టు బిల్డప్…

ఇంతకీ ఆ కంపెనీ ఎవరిదో తెలుసా..? Ghar Soaps (ఘర్ సోప్స్) బ్రాండ్ యజమానులు సన్నీ జైన్ (Sunny Jain), సయామ్ జైన్ (Sayyam Jain)… ఇది 2019లో ఒక ‘హోమ్ మేడ్’ బ్రాండ్‌గా మొదలైంది… వీళ్లు ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ సీజన్ 2లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు… ఆ సమయంలో ప్రముఖ ఇన్వెస్టర్ అమన్ గుప్తా (boAt వ్యవస్థాపకుడు) ఇందులో పెట్టుబడి పెట్టాడు…

ప్రధానంగా సహజసిద్ధమైన (Natural), ఆయుర్వేద పద్ధతులతో కూడిన సబ్బులు, ఫేస్ వాష్‌లు, స్కిన్ కేర్ ఉత్పత్తులు అంటూ విక్రయిస్తుంటారు…. ముఖ్యంగా వీరి ‘శ్యాండల్ వుడ్ & శాఫ్రన్’ (Sandalwood & Saffron) సబ్బు కాస్త పాపులర్… మరి ఏమిటి రోగం..? ఇలా ఆలీతో ఈ పిచ్చి యాడ్ దేనికి..? ఆ ముంబై కంపెనీ, ఈ ప్రొడక్ట్ కంపెనీ కూడా బాధ్యులే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!
  • విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దుట ! – మంత్రిగా ఉంటే పర్లేదుట !!
  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!
  • హైడ్రా ! తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమా ?!
  • ఇదంతా తెలంగాణ అస్థిత్వ సమస్యా? బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా!?
  • బొద్దింకల పార్టీ ! మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ !!
  • అసలు సమస్య ‘నీట్’ను దాటి… మన వైద్య వ్యవస్థలోనే ‘రోగాలు’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions