Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెట్రో పానిక్ – చమురు పరుగులు…! మూసీపై మాత్రం ఏడుపులు..!!

March 27, 2026 by M S R

హైదరాబాద్‌ ప్రస్తుతం ఒక వింత వైరుధ్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది… ఒకవైపు… రేపు పెట్రోల్ దొరకదేమో అన్న ‘క్షణిక భయం’తో కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్న జనం… మరోవైపు… నగరాన్ని వంద ఏళ్ల పాటు కాపాడే ‘మూసీ పునరుజ్జీవనం’ వంటి బృహత్తర ప్రాజెక్టుపై అనవసరపు రాద్ధాంతం…

దానికీ దీనికీ లింక్ ఏమిటీ అంటారా..? జనం గానీ, జన ప్రయోజనం పట్టాల్సిన రాజకీయం గానీ ‘‘కేవలం తాత్కాలిక ఫాయిదా’’ చూసుకోవడమే తప్ప ‘‘దీర్ఘకాలిక నిజ ప్రయోజనం’’పై ఎందుకు బలమైన మద్దతు ఇవ్వడం లేదనేది ప్రశ్న..!

ఎస్, ఒకటి గడప ముందే పెట్రో ప్యానిక్, ఫుల్ ట్యాంక్ ప్రయాస, అగచాట్లు… అసలే యుద్ధం, పులి మీద పుట్రలా ఆయిల్ కంపెనీలు ‘క్యాష్ అండ్ క్యారీ’ సిస్టం పెట్టేయడంతో పెట్రోల్ బంకుల మీద పిడుగులా పడి… నో స్టాక్ బోర్డులు… నిండుకున్న ట్యాంకులు…

Ads

ఒక చిన్న సమస్య వస్తేనే, ఇంత పరుగులు తీస్తున్నాం కదా… మరి రేప్పొద్దున వరదలు ముంచెత్తితే…? ఇదీ ఓ ప్రధాన ప్రశ్న… గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ఇంకేవో ప్రకృతి సంబంధ కారణాలు కావచ్చు… క్యుములోనింబస్ కుండపోతలు, హఠాత్ వరదలు ప్రపంచంలో అనేకచోట్ల కామన్ అయిపోతున్నాయి… మరి రేపు  మూసీకి వరదలొస్తే..? ఎటు పరుగులు తీద్దాం…

ఎహె, మూసీకి వరదలేమిటి అంటారా..? ఆ వరదల చరిత్ర ఉంది కాబట్టే, మూసీ పరీవాహకం కల్లోలం అయింది కాబట్టే అప్పట్లో నిజాం నవాబులు నదీమార్గంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టించారు… ఇప్పుడేమో ఇది మురికికాలువ అయిపోయింది… మరి వరదల నియంత్రణకు దీన్ని స్ట్రీమ్‌లైన్ చేయొద్దా..? విపత్తు నివారణ అవసరం లేదా..?

ఆ భావన నుంచి పుట్టిందే మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన… వాట్ ఎవర్, పేరులో ఏముంది గానీ…. ఒక్కసారి ఊహించండి, మూసీకి అనుకోని వరదలు వచ్చిపడితే… ప్రస్తుత పెట్రో ప్యానిక్ సీన్ వేయి రెట్లుగా పెరిగి కనిపిస్తుంది… అందుకే ఈ క్యూలు చూస్తే అది గుర్తొచ్చింది… కానీ జనప్రయోజనం పట్టని రాజకీయం ఏం చేస్తోంది..? ఇంకాస్త లోతుగా వివరాల్లోకి వెళ్దాం…

ఈసా



1. పానిక్ మెంటాలిటీ: ఈ వారం గడిస్తే చాలు! నగరంలోని పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలు మన ‘సామూహిక విజ్ఞత’ను ప్రశ్నిస్తున్నాయి… జనం తమ విలువైన కాలాన్ని రోడ్ల మీద పడిగాపులు కాయడానికి వెచ్చిస్తున్నారు… సెల్ఫ్-సెంట్రిక్ ధోరణి… “పక్కవాడికి పెట్రోల్ దొరికినా, లేకపోయినా పర్లేదు, నా ట్యాంక్ ఫుల్ ఉండాలి” అనే ఆలోచన సామాజిక బాధ్యతను తుడిచిపెట్టేస్తోంది…

  • అవగాహనా రాహిత్యం…: పెట్రోల్ బంకుల మూత, కొరత తాత్కాలికమే అని తెలిసినా, ఈ వారం గడిస్తే చాలు అనే ఆందోళనలో పెద్ద సమస్యలైన ధరల పెరుగుదల, ఇంధన ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేదు… ఈ ‘Panic Buying’ వల్ల నిజంగా అవసరం ఉన్న వారికి (అంబులెన్స్‌లు, అత్యవసర సేవలు) ఇబ్బందులు ఎదురవుతున్నాయి…

  • మరి వారం తరువాత..? ఇది కదా ప్రభుత్వమైనా, ప్రజలైనా ఆలోచించాల్సింది… సమస్య- ప్రమాదం ఊహించి నివారణకు పూనుకోవడం… అందుకే ఈ క్యూల ఫోటోలు చూస్తుంటే మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడే అపసవ్య ధోరణి గుర్తొచ్చింది ఎందుకో… తాత్కాలిక ప్రయాస వర్సెస్ దీర్ఘకాలిక ప్రయోజనం…

పెట్రో పానిక్

2. చరిత్ర పాఠం…: నిజాం నాడు… రేవంత్ నేడు! హైదరాబాద్ చరిత్రను తిరగేస్తే, ఇక్కడి పాలకులు ఎప్పుడూ ‘దూరదృష్టి’ (Visionary Approach) తోనే వ్యవహరించారు…

  • చారిత్రక సాక్ష్యం…: 1908లో మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తినప్పుడు, అప్పటి నిజాం నవాబులు కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలతో ఆగిపోలేదు… చేతులు దులుపుకోలేదు, ఉపయుక్త దూరదృష్టితో  మహోన్నత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాయంతో గండిపేట (ఉస్మాన్ సాగర్), హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారు… ఆనాడు వారు పెట్టిన పెట్టుబడి, పడ్డ కష్టం… నేడు వంద ఏళ్ల తర్వాత కూడా మనకు తాగునీటిని, రక్షణను ఇస్తున్నాయి… ఇదీ విజన్ అంటే…

  • నేటి సవాలు..: ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో మూసీని ‘మురికి కాలువ’ స్థాయి నుంచి ఒక ‘జీవనది’ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడు… అదొక కాంప్లికేటెడ్ వెరీ బిగ్ టాస్క్… కానీ, నాడు పాలకులకు ఉన్నది బలమైన మద్దతు…, నేడు రాజకీయం అడ్డంకులు క్రియేట్ చేస్తూ విజ్ఞత విడిచి అపహాస్యం చేస్తోంది…

మూసీ

3. నదులే నాగరికత: ప్రపంచం ఎటు వెళ్తోంది? ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన నగరాన్ని చూసినా, అది నదీ తీరాన్నే విలసిల్లింది… నదులను కాపాడుకున్న దేశాలే ఆర్థికంగా, పర్యాటకంగా ఎదిగాయి… క్వాలిటేటివ్ లైఫ్, కలర్‌ఫుల్ లైఫ్… లైవ్‌లీ, లవ్‌లీ లైఫ్… కొన్ని ఎగ్జాంపుల్స్…

  • లండన్ (బ్రిటన్)… థేమ్స్ (Thames)… ఒకప్పుడు మురికిగా ఉన్న ఈ నదిని శుద్ధి చేసి, నేడు ప్రపంచ స్థాయి ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మార్చారు…

    పారిస్ (ఫ్రాన్స్)… సీన్ (Seine)… ఈ నదీ తీరాన ‘నైట్ లైఫ్’, ‘క్రూయిజ్ టూరిజం’ పారిస్ కు బిలియన్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది…

    సియోల్ (దక్షిణ కొరియా)… హాన్ (Han) … తీవ్ర కాలుష్యానికి గురైన హాన్ నదిని ప్రభుత్వం పట్టుదలతో పునరుజ్జీవింపజేసి, నగరానికి ప్రాణవాయువులా మార్చింది…

    న్యూయార్క్ (USA)… హడ్సన్ (Hudson)… నది చుట్టూ ఉన్న గ్రీన్ పార్కులు, ట్రాక్‌లు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను (Live Life) పెంచాయి…

హైదరాబాద్‌లో మూసీకి కూడా అటువంటి పర్యాటక సామర్థ్యం ఉంది… గాంధీ సరోవర్ లాంటి ప్రాజెక్టులు వస్తే, అది కేవలం పర్యాటకానికే కాదు, నగర పర్యావరణానికి, భవిష్యత్ తరాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది…

మూసీ

4. అభివృద్ధికి అడ్డు రాజకీయాలు మూసీ పునరుజ్జీవనానికి వస్తున్న ప్రధాన అడ్డంకి నిధుల లేమి కాదు… ‘పేదల ఇళ్లు’… కానీ ఇక్కడ కొన్ని నిష్ఠుర సత్యాలు ఉన్నాయి…

  • అక్రమ నివాసాలు…: మూసీ పరీవాహక ప్రాంతంలో, అనేకం నదీగర్భంలో ఉన్నవి చాలా వరకు అక్రమ నిర్మాణాలే…. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేలకు పైగా ఇళ్లను గుర్తించి, నోటీసులు లేకుండానే కూల్చేసే చట్టాన్ని తీసుకొచ్చింది… మరి ఇప్పుడు అదే పార్టీ ‘పేదవాడి ఇల్లు’ అంటూ సెంటిమెంట్ పండించడం ద్వంద్వ వైఖరి కాదా?… టెంపరరీ పొలిటికల్ ఫాయిదాకై ప్రయాస కాదా..?

  • పునరావాస హామీ…: ప్రస్తుత ప్రభుత్వం బాధితులందరికీ మోడల్ కాలనీలు కట్టిస్తామని, మెరుగైన వసతులు కల్పిస్తామని చెబుతోంది… మురికి వాడల్లో, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో బతికే కంటే, గౌరవప్రదమైన కాలనీల్లో ఉండటం పేదలకు మేలు కాదా…?

  • ప్రగతి నిరోధకం…: ఒక మంచి పని ప్రారంభించినప్పుడు దానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్షాలు, ప్రజల్లో భయాందోళనలు నింపి అడ్డుకోవడం అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టడమే అవుతుంది…

మూసీ

5. మన ముందున్న మార్గం ఏది? మనం పెట్రోల్ క్యూలో నిలబడి “ఈ రోజు గడిస్తే చాలు” అనుకునే స్వల్పకాలిక ఆలోచనలతో బతుకుదామా? లేక మన నగరం కూడా లండన్, పారిస్ తరహాలో గ్లోబల్ సిటీగా మారి, మన పిల్లలకు స్వచ్ఛమైన మూసీని కానుకగా ఇచ్చేలా పాలకులకు సహకరిద్దామా?

అభివృద్ధి అనేది అందరి బాధ్యత… రాజకీయాల కోసం ప్రగతిని బలితీసుకోవడం ఆగాలి, ఆపాలి… ఈసా, మూసీ నదీ సంగమం తరువాత ఇక ఓ కొత్త హైదరాబాద్ కనిపిస్తుంది… గోదావరి నీరు కూడా మూసీని చేరి, పారుతూ, త్రివేణీ సంగమమై, అప్పుడే హైదరాబాద్ నిజమైన విశ్వనగరంగా అవతరిస్తుంది…

మూసీ


"మురికి కాలువలో మునిగి తేలుదాం కానీ, స్వచ్ఛమైన నదిని మాత్రం రానివ్వం అనడం ఏ నాగరికత? అక్రమ కట్టడాల చాటున రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నగరాన్ని బలిపెట్టడం ఎంతవరకు ధర్మం?" నల్గొండ చిరకాలశాపంతో ఇలా పీడింపబడాల్సిందేనా?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…
  • కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…
  • 77 వయస్సులో… 55 ఏళ్ల నాటి… ఓ ప్రేమ- పెళ్లి మురిపెం కథ…
  • సీఎం రేవంత్ రెడ్డి ఇది తప్పకుండా చదవాలని కోరుకుంటూ..!!
  • సమకాలీనులు వేరు- సమస్కంధులు వేరు… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!
  • మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…
  • కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions