Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘బాడీ కౌంట్’ నిజంగా పెరుగుతోందా..? ఉన్నదే బహిరంగం అవుతోందా..?

June 29, 2026 by M S R

.

ముందుగా ఓ డిస్‌క్లయిమర్… ప్రపంచంలో రకరకాల సర్వేలు జరుగుతుంటాయి, కొన్ని శాస్త్రీయం, మరికొన్ని ఫ్లూక్… కానీ ఏదో ఓ పిచ్చి సర్వేను పట్టుకుని మన సోషల్ యాక్టివిస్టులు చెలరేగిపోతుంటారు… మన ఖర్మకొద్దీ మెయిన్ స్ట్రీమ్ గాళ్లూ అలాగే తయారయ్యారు… వివరంగా చెప్పుకుందాం ఓ తాజా హాట్ సర్వే గురించి…

రీసెంటుగా ఓ టీవీ సెలబ్రిటీ (?) నా బాడీ కౌంట్ అయిదు అని చెప్పింది… అంటే తను ఎంతమందితో లైంగిక సంబంధం కలిగి ఉందో చెప్పడం, ఆమే కదా, నెలకు ఇంత అని ఫీజు పెట్టి నా ఒంపుసొంపులు చూడు నా రాజా అని ఇన్‌స్టా స్కీమ్ పెట్టింది… సరే, ఆమె బహిరంగంగా చెప్పుకుంది, చెప్పనివాళ్ల బాడీ కౌంట్ ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే…

Ads

అయితే, నా బాడీ కౌంట్ ఇదీ అని తెలుగు మహిళ బహిరంగంగా చెప్పుకునేంత స్వేచ్ఛ మన సమాజంలో పెరగడం అనూహ్యం… అవున్లెండి, లైంగిక అక్రమ సంబంధాలకు, ప్రియులను మరిగి భర్తాపిల్లల్ని కడతేరుస్తున్న రోజులివి… కట్టుబాట్లు, సంప్రదాయాలు, అసలు లైంగిక అంశాల మీద బాహాటంగా మాట్లాడటమే తప్పు అనుకునే సమాజంలో ఈ ‘స్వేచ్ఛ’ ఇంత త్వరగా వస్తుందని ఎవరూ అనుకోలేదు…

ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… ఇండియాలో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాల్లో దిక్కుమాలిన చెత్తా అధ్యయన నివేదికలు వదులుతుంటారు కొందరు, వాటిని ఇక్కడ మీడియా కళ్లకద్దుకుని గుడ్డిగా పబ్లిష్ చేసి, శునకానందం పొందుతూ ఉంటుంది… సేమ్, అలాంటిదే ఓ సర్వే… ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సర్వే చేసి ‘గ్లోబల్ పాపులేషన్ రివ్యూ’ సంస్థ ‘యావరేజ్ నంబర్ ఆఫ్ సెక్సువల్ పార్ట్నర్స్ బై కంట్రీ’ పేరిట 2026 నివేదికను వదిలింది….

డేటింగ్ యాప్స్ సబ్‌స్క్రిప్షన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే, ఆ ఏరియా ఇక ఓ రెడ్ లైట్ ఏరియా అన్నట్టు వార్తలు రాస్తారు కదా మనవాళ్లు… మొన్నెవడో రాశాడు… ఆలయాలకు ప్రసిద్ధి చెందిన మధుర ఈ డేటింగ్ యాప్ లెక్కల్లో టాప్, అంటే వివాహేతర సంబంధాల్లో టాప్ అన్నట్టుగా తేల్చిపారేశాడు… గుళ్లు ఉండటానికీ వివాహేతర సంబంధాలకూ… ఆధ్యాత్మిక కేంద్రాలకూ అదేదో డేటింగ్ యాప్ లెక్కలకూ లింకేమిట్రా..?

వోకే, టూరిస్ట్ సెంటర్లలో వ్యభిచార కేంద్రాలు పెద్ద అసహజం కాదు, గుడుల కేంద్రాల్లో లేవనీ కాదు… కానీ ముద్రలు వేయడంలో అశాస్త్రీయత ప్రశ్నార్థకం… చెత్తా సర్వేలను నెత్తిన మోయడం సమస్య… సరే, అక్రమ బంధాల (ఆ మాట అనకూడదేమో, మన అపెక్స్ కోర్టు ఒప్పుకోదేమో) సర్వే మాటకొద్దాం…

టర్కీలో సగటున ఒక వ్యక్తికి 14.5 మంది భాగస్వాములు ఉన్నారట! ఆస్ట్రేలియా 13.3, న్యూజిలాండ్ 13.2తో టర్కీకి గట్టి పోటీ ఇస్తున్నాయట. అమెరికన్లు 10.7 సగటుతో 12వ స్థానంలో ఉన్నారు. (అందులోనూ లూసియానా రాష్ట్రంలో 15.7 ఉంటే, సంప్రదాయాలు ఎక్కువ ఉండే యూటా రాష్ట్రంలో మాత్రం 2.6 మాత్రమేనట..  బ్రిటన్ 9.8 తో 21వ స్థానం…

ఇక మన ఇండియా రేంజ్ ఏంటంటే… సర్వే చేసిన దేశాలన్నింటిలోకి భారత్ చివరి స్థానంలో నిలిచింది! (నాన్సెన్స్ మోడీ పాలనలో ఏమిటిలా దిగజారిపోయాం, ఇందులో కూడా స్వేచ్ఛ లేకుండా మోడీ నిర్బంధ కట్టడులు అమలు చేస్తున్నాడని ఇంకెవడూ విమర్శించనట్టుంది)… భారతీయులు తమ జీవితకాలంలో సగటున కేవలం ముగ్గురు (అంటే కచ్చితంగా చెప్పాలంటే 2.6/3) లైంగిక భాగస్వాములను మాత్రమే కలిగి ఉంటున్నారట…

పెళ్లికి ముందు బంధాలకు నో చెప్పడం, కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలు, కట్టుబాట్లను గౌరవించడం వల్లే భారత్‌లో ఈ బాడీ కౌంట్ ఇంత తక్కువగా ఉందని ఎవరెవరో ఏదో రాసేస్తున్నారు… మన పక్కన ఉన్న హాంగ్‌కాంగ్ (3.7), వియత్నాం (3.2), చైనా (3.1) కూడా 4 కంటే తక్కువతోనే సరిపెట్టుకున్నాయి.



నిజానికి పాపులేషన్‌కూ అక్రమ బంధాలకు, లేదా బాడీ కౌంట్లకు సంబంధమే లేదు… దేనికదే… సైంటిఫిక్‌గా సాగే సర్వేల్లో ఎక్కువ శాంపిల్స్, సరైన మిక్స్, విశ్వసనీయ సమాచార సేకరణ, డేటా క్రోడీకరణ వంటి చాలా అంశాలుంటాయి… ఎవరో కొంత మందిని ఏదో అడిగి, తమ అభిప్రాయాలు కూడా కలిపేసి, ఏవో దురుద్దేశాలతో రిలీజ్ చేయబడే సర్వేలు బోలెడు ప్రపంచంలో… అసలు సర్వేల్లో అడిగే ప్రశ్నల కూర్పులోనే శాస్త్రీయత, నిష్పక్షపాతం అవసరం… పైగా వంద కోట్ల జనాభా ఉన్న దేశంలో వంద మందిని అడిగి, ఇదే జాతి అభిప్రాయం అని తేల్చేయడం పక్కా అశాస్త్రీయం!!

కానీ “ఫ్లూక్” సర్వేలు (Unscientific/Biased Surveys) ఏదో ఒక ప్రయోజనం కోసమో లేదా సరైన అవగాహన లేకనో చేస్తారు. వీటిలో లోపాలు కన్వీనియన్స్ శాంప్లింగ్, బయాస్డ్ ప్రశ్నలు, తక్కువ శాంపిల్ సైజు, ఎజెండా సర్వేలు, అంటే పెయిడ్ సర్వేలు… ఫ్లూక్ సర్వేలు ‘అభిప్రాయం’ (Opinion) మీద లేదా ‘ప్రచార ఆర్భాటం’ (Marketing/Propaganda) మీద ఆధారపడి ఉంటాయి.

ఈ పాపులేషన్ సర్వే నివేదిక ఏమంటుందో తెలుసా?  ప్రపంచంలో ఒక వ్యక్తి జీవితకాలంలో సగటున 9 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటున్నారట… ఈ సర్వేలను ‘ఫ్లూక్’ లేదా ‘అశాస్త్రీయం’ అని ఎందుకు అనొచ్చు?

ఈ సర్వేల డొల్లతనం ఎందుకంటే..? పాశ్చాత్య దేశాల్లో లైంగిక స్వేచ్ఛ అధికం… లిబరల్ సొసైటీలు… స్వేచ్ఛగా తమ బాడీ కౌంట్ చెబుతారు. కానీ ఆసియా దేశాల్లో చెప్పరు, చెప్పినా అది నిజం కాదు కూడా… సో, ఇలాంటి సర్వేలు ఆయా దేశాల మొత్తం జనాభా లైంగిక ఆరోగ్యానికి లేదా ప్రవర్తనకు కొలమానాలు కావు… మరీ టర్కీ అగ్రస్థానంలో ఉండటం అస్సలు నమ్మదగిందిగా లేదు…

ఇటువంటి రిపోర్టులు బయటకు వచ్చినప్పుడు, అవి సమాజంలో ఒక చర్చను లేవదీయడానికి, క్లిక్-బైట్ కోసం లేదా ఒక విధమైన సంచలనం సృష్టించడానికి పనికొస్తాయి. “టర్కీ అగ్రస్థానంలో ఉంది” అని వినగానే అందరూ ఆశ్చర్యపోతారు, దానివల్ల ఆ సర్వేకు విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది.

అఫ్‌కోర్స్, ఈ బాడీ కౌంట్ భారత దేశంలో పెరుగుతుందని మనం రోజూ చూసే, వినే అనేక ఉదాహరణలతో అర్థమవుతూనే ఉంది… అదొక మారుతున్న ‘సోషల్ ట్రెండ్’… లేట్ పెళ్లిళ్లు, విడాకులు, ఒంటరి వ్యక్తులు, కో-లివింగ్ హాస్టళ్లు, నగర వాతావరణ ప్రభావం, పేరెంట్స్‌కు దూరంగా బతుకులు, స్వేచ్ఛపై అనురక్తి, నైతికత నిర్వచనాలు మారిపోవడం, సినిమాలు- సాహిత్యం ప్రభావం వంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు…

పోనీలెండి సర్, అక్రమ బంధాలు ఎప్పుడూ ఉన్నాయి, అప్పుడు రహస్యం, ఇప్పుడు బయటపడి చెప్పుకుంటున్నారు, ఈ సర్వే అదే చెప్పింది అంటారా..? నో కామెంట్!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘బాడీ కౌంట్’ నిజంగా పెరుగుతోందా..? ఉన్నదే బహిరంగం అవుతోందా..?
  • Aeromart 2026 – గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో మరో గ్లోబల్ ఈవెంట్!
  • నితిన్ నబీన్‌జీ … కేసీయార్‌పై ఈగ వాలనివ్వనిది మీరే మహాశయా…
  • బాస్ పేరిట వాట్సప్ మెసేజలు- కోట్లు గల్లంతు – బహుపరాక్
  • చివరి సినిమాలో… ఒక్క పాటలోనే తన నాలుగు అభిమాన పాత్రల్లో…
  • Campa … మార్కెటింగ్‌లో అంబానీ తెలివే తెలివి! వేగంగా నంబర్.3 ప్లేస్!!
  • ఇడుపు కాయితం! రచ్చ లేపుతున్న టైటిల్ కొత్తదేమీ కాదు – పాతదే!
  • భయంతో ఆడుకున్న ఈ నియంతను ఆ ‘భయమే’ బలిగొంది!!
  • ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’… తడి తడిమే వేటూరి ఆర్తగీతిక !
  • అనామక ఐర్లాండ్ క్రికెట్ జట్టు మన తోపులకు నేర్పిన పాఠాలేమిటంటే.?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions