Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాట్ట… ఇదీ అదే శాస్త్రం…

November 15, 2024 by M S R

.

ఏమో… గుడారం- ఒంటె కథకూ దీనికీ అన్వయం కుదురుతుందో లేదో తెలియదు గానీ… ఓ ఇంట్రస్టింగ్ నినాదం ఇప్పుడు కెనడాలో విస్మయకరంగా వినిపించింది… ఖలిస్థానీ శక్తులకు స్థావరంగా కెనడా మారేందుకు సహకరించే ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఈ నినాదం విని మొహం పగిలిపోయి ఉంటుంది…

రెండు నిమిషాల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది… అది ఖలిస్థానీ జెండాలు పట్టుకుని ఓ నగరకీర్తనలో పాల్గొన్న ఓ బృందం చేసిన వ్యాఖ్యలు… ‘‘ఇది కెనడా, ఇది మా దేశం, మీరు వాపస్ వెళ్లిపొండి’’ ఇవీ నినాదాలు… ఎవరిని వెళ్లిపొమ్మంటున్నారు..?

Ads

కెనెడియన్లను… స్థానికులను… వాళ్లు ఆక్రమణదారులట, మళ్లీ మీ ఇంగ్లండ్‌కు, మీ యూరప్ దేశాలకు మీరు వెళ్లిపొండి అంటున్నాయి ఖలిస్థానీ శక్తులు… తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటువాదులకు వత్తాసు పలికితే ఫలితాలు ఎలా ఉంటాయో ట్రూడో పార్టీకి, ప్రభుత్వానికి తెలిసొస్తున్నట్టుంది…

ఇప్పుడు హిందువులు రక్షణ కోరడమే కాదు, కెనడా నివాస ప్రాంతాల్లో కెనెడియన్లే రక్షణ కోరుకోవాలా..? ఇండియన్ ఇంటలిజెన్స్ వర్గాలు మాత్రం ‘‘సహజమే కదా… పెద్ద అసాధారణం ఏముంది..? కెనడాకు సంబంధించిన అన్ని అంశాలనూ వాళ్లు వాళ్ల స్వాధీనంలోకి తీసుకుంటున్నారు’’ అని స్పందిస్తున్నాయి…

ఇటీవల ఓ హిందూ ఆలయం మీద ఖలిస్థానీ శక్తులు దాడి చేసి, అక్కడున్న భక్తులపైనా దమనకాండ ప్రయోగించాయి కదా… ఏదో అంతర్జాతీయ సమాజం విమర్శలకు జడిసి, ఆ దాడిని ఖండించాడు గానీ ట్రూడో వైపు నుంచి మరో విధమైన యాక్షన్ కనిపించలేదు… మా దేశంలో ఖలిస్థానీవాదులు ఉన్నారు, నిజమే, కానీ సిక్కులందరికీ వాళ్లు ప్రాతినిధ్యం వహించరు కదా అన్నాడు…

Twitter Video : Click Here

గత సంవత్సరం వేర్పాటువాది, ఉగ్రవాది నిజ్జర్ హత్య తరువాత కెనడా తీవ్రంగా స్పందించింది… భారతదేశమే ఈ హత్య చేయించిందని ఆరోపించింది… తరువాత క్రమేపీ ఇండియా- కెనడాల నడుమ దౌత్య సంబంధాలు క్షీణించాయి…

కెనడా వర్గాలు నేరుగా ఆ హత్యలో అమిత్ షా ప్రమేయాన్ని ప్రస్తావిస్తున్నాయి… తరువాత ఇరు దేశాలూ దౌత్యాధికారులను బహిష్కరించుకున్నాయి… ఇన్నాళ్లూ ఖలిస్థానీ శక్తులు ఇండియాను నిందిస్తూ, హిందువులను నిందిస్తూ ట్రూడో ప్రభుత్వాన్ని చెప్పినట్టు ఆడేలా చేసుకున్నాయి…

ఇప్పుడిక వాళ్లు ఈ దేశం మాదే, మీరే మీ ఒరిజినల్ దేశాలకు వెళ్లిపోవాలని అని డిమాండ్ చేస్తున్నారు… 2021 జనగణన మేరకు ఆ దేశంలో ఆయా మతస్తుల శాతాలు ఇవీ… (మొత్తం జనాభా 4 కోట్లు)…


Christian: 63.2%
No religion or secular: 26.3%
Muslim: 3.7%
Hindu: 1.7%
Sikh: 1.2%
Buddhist: 1.4%
Other religion: 1.2%
Jewish: 1.0%


అక్కడ సిక్కులకన్నా హిందువులు, బౌద్ధుల జనాభా ఎక్కువ… కేవలం 1.2 శాతం ఉన్న సిక్కులు ఇది మా దేశం, తెల్లవాళ్లంతా గో బ్యాక్ అని నినదించడం అంటే పైపైకి నవ్వుపుట్టించే వ్యాఖ్యల్లా వినిపించినా… ఇవే క్రమేపీ ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తాయి… ట్రూడోకు ఆ జ్ఞానం లేదు… సగటు ఇండియన్ పొలిటిషియన్‌లాగే తాత్కాలిక అవసరాలే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions