.
అయోధ్యకు భక్తజనం పోటెత్తారు… తాజ్‌మహల్ సందర్శకులకన్నా ఈ సంఖ్య దాటిపోయింది… వారణాసి మునుపెన్నడూ లేని రీతిలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది… కొత్తగా ఉజ్జయిని కూడా టెంపుల్ టూరిజం అడ్డా అయిపోతోంది…
…. ఇవన్నీ కొద్దిరోజులుగా కనిపిస్తున్న వార్తలు… కొత్త సంవత్సరం వేళ తమకు ఇష్టమైన పుణ్యక్షేత్రానికి వెళ్లడం ఇండియాలో అలవాటే… ఈసారి ఇంకా పెరిగింది… ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ టూరిజం స్పాట్స్‌లో కిలోమీటర్ల కొద్దీ వాహనాల ట్రాఫిక్ జామ్ కూడా చదివాం, విన్నాం…
Ads
కానీ ఎప్పుడూ క్రిస్టమస్, డిసెంబరు 31 టూరిస్టులతో కిటకిటలాడిపోయే గోవాలో మాత్రం పర్యాటకుల సందడి విపరీతంగా తగ్గింది… చాలా బీచులు ఖాళీ… హోటళ్లు ఖాళీ… మద్యం అమ్మకాలు పడిపోయాయి… గోవా టూరిజానికి ఏమైంది..? ఈ చర్చ రెండుమూడు రోజులుగా ప్రసారసాధానల్లో సాగుతోంది…
ఇదుగో ఈ ట్వీట్‌తో మొదలైంది…
ఎహె, ఇదంతా రాంగ్ క్యాంపెయిన్, గోవా రద్దీగానే ఉంది అని కొందరు నెటిజన్లు కౌంటర్ చేస్తున్నా… గోవా మీడియా కూడా ఈసారి బిజినెస్ బాగా పడిపోయినట్టు అంగీకరిస్తోంది… స్వదేశీ పర్యాటకులే కాదు, విదేశీ టూరిస్టులు కూడా గణనీయంగా పడిపోయారు… గోవా మీడియా ఇంకా రకరకాల కారణాలను కూడా చెబుతోంది…
‘‘ఇయర్ ఎండ్ గిరాకీని సొమ్ము చేసుకోవడానికి హోటళ్లు రేట్లను పెంచేస్తున్నాయి… విమాన సర్వీసులు కూడా చార్జీలను పెంచేస్తున్నాయి… ఫుడ్ కాస్ట్‌లీ అయిపోతోంది… అన్నింటికీ మించి గోవాకు పర్యాటకులు రాకుండా చేస్తోంది శ్రీలంక, వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలు…
అవి ప్రొఫెషనల్ అప్రోచ్ కనబరుస్తున్నాయి… వీసా ఎట్ అరైవల్, ఈ-వీసాలతోపాటు హోటల్ రేట్లు, టాక్సీల రేట్లపై నియంత్రణ ఉంటోంది… రీజనబుల్ ప్రైస్ ఫర్ ఫుడ్… శ్రీలంక గిరాకీ కొంత తగ్గినా… వియత్నాం పుంజుకుంది… థాయ్‌లాండ్ ఎప్పుడూ మన పర్యాటకులకు ఇష్టప్రదేశమే… కొన్నాళ్లు టర్కీ, మాల్దీవులు జోరు చూపించినా ఇప్పుడు ఎవరూ పెద్దగా వెళ్లడం లేదు…
గోవాలో ఊబర్, ఓలా వంటి ట్యాక్సీ సర్వీసుల్ని అక్కడి ట్యాక్సీల అసోసియేషన్ నడవనివ్వడం లేదు… అక్కడ ప్రైవేటు ట్యాక్సీ ఓనర్లు అడ్డగోలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు… దోపిడీ… గతంలోలాగా మద్యం అమ్మకాలు, రాత్రిళ్లు స్వేచ్ఛా విహారాలు లేవు… ఎందుకోగానీ క్రూయిజ్ కేసీనోలకు కూడా గిరాకీ తగ్గిపోయింది… గోవా టూరిస్టుల్లో వీళ్ల సంఖ్యే ప్రధానంగా ఉండేది గతంలో…’’ ఇలాంటి విశ్లేషణలు కనిపిస్తున్నాయి…
మోడీ స్వయంగా ప్రచారం చేసిన (మాల్దీవులకు గుణపాఠం చెప్పడానికైనా సరే) లక్షద్వీప్ టూరిజం డెవలప్‌మెంట్‌కు తరువాత ఒరిగిందేమీ లేదు… నేచర్ రిసార్ట్స్, విలేజ్ టూరిజం, వాటర్ ఫాల్స్ టూరిజం, బీచ్ టూరిజం అంశాల్లో అద్భుతమైన అవకాశాలున్నా సరే, మన ప్రభుత్వాలకు సరైన దిశ, వ్యూహాలు లేవు… ఏరియాల వారీ, రాష్ట్రాల వారీ స్ట్రాటజీలు కాదు, దేశానికి ఓ సమగ్ర దృక్పథం, పాలసీ అవసరం… ఇవీ మీడియాలో కనిపిస్తున్న సూచనలు…!
Share this Article