నిజానికి ఉమైర్ సంధూ అనే వ్యక్తి చేసే రివ్యూల పట్ల నాకేమీ సదభిప్రాయం లేదు… తను సూపర్, బంపర్ అన్న సినిమాల్లో చాలావరకూ ఫ్లాపులు… తను యావరేజీ అన్నాడంటే మంచి హిట్… పైగా ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అంటాడు… ఇప్పుడు గాడ్‌ఫాదర్ సినిమా బాగా లేదు, ఈ మాస్ రోల్స్ మానేసి, సాలిడ్ స్క్రిప్టు చూసుకోవయ్యా బాబూ… ఇలాంటి కథల కోసం నీ టాలెంట్ వేస్ట్ చేయడం దేనికి..? నువ్వు మెగాస్టార్‌వి, కొంతకాలం నీకు రెస్ట్ అవసరం బాసూ…. అని ఓ రెండు ట్వీట్లు వదిలాడు…
తను యావరేజీ అన్నాడు కాబట్టి హిట్ కంపల్సరీ అని సెంటిమెంట్ కోణంలో ఫ్యాన్స్ సంతోషం… కానీ ఉమైర్ ఓ మాటన్నాడు… ఇలాంటి స్క్రిప్టులతో నీ టాలెంట్‌ను వేస్ట్ చేసుకోవద్దు అని… అది కూడా నిజం కాదు… ఇదే కథ Lucifer సూపర్ హిట్ కదా మలయాళంలో…! పైగా రెగ్యులర్ హీరోయిన్, రొమాన్స్, లవ్ ట్రాకులు గట్రా లేని పొలిటికల్, డిఫరెంట్ స్టోరీ… రెగ్యులర్ చిరు బ్రాండ్ కు భిన్నమే… అయితే…
ఆమధ్య ఆచార్య ఫ్లాప్ అయితే దర్శకుడు కొరటాల శివ మీదకు నెపాన్ని నెట్టేశారు… నిజానికి స్టార్ల సినిమాలకు సంబంధించి దర్శకులకు స్వేచ్ఛ ఎక్కడిది..? ఒక్క రాజమౌళి మినహా… హీరోయిన్, ఇతర పాత్రలు, మాటలు, పాటలు, గాయకులు, నటులు, డాన్స్ మాస్టర్లు, ఎడిటర్లు, సినిమాటోగ్రాఫర్లు, సంగీతం… వాట్ నాట్..? తమ బిల్డప్పులు, తమ ఇమేజీల కోణంలో తామే అన్నీ నిర్ణయాలు తీసుకుంటారు… మరిక దర్శకుడి తప్పేముంది..?
Ads
ఎస్, కోట్ల బిజినెస్ ప్లస్ ఇమేజీ ఇష్యూ కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు… కానీ అది ఎక్కడి వరకూ అనేది పెద్ద సంక్లిష్టమైన ప్రశ్న… ఇప్పుడు గాడ్‌ఫాదర్ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు… ఫాఫం, అసలే రీమేకులు తీసుకునే సాదాసీదా దర్శకుడు… తెలుగు నుంచి తమిళంలోకి… కానీ చాన్నాళ్ల తరువాత మలయాళం నుంచి తెలుగుకు చేస్తున్నాడు… మెగాస్టారీకరణ, చిరంజీవికరణ కోసం బోలెడు మార్పులు… మరి చిరంజీవి అంటే చాలా బిల్డప్పులు తప్పవు కదా… మరి మోహన్ రాజా దేనికి రెడీగా ఉండాలి ఇప్పుడు..? పర్లేదు, నిందపడాల్సిన పనిలేదు… ఆచార్యకన్నా బెటర్… ఆ పాదఘట్టంతో పోలిస్తే నయమే…
Umair Sandhu….. @UmairSandu
First Review #Godfather from Censor Board ! A Strictly Average flick for B & C Class Masses. An Old wine in a New Bottle ! #Chiranjeevi You need REST Plz
అసలు ఇక్కడ ఓ ప్రశ్న… చిరంజీవి రేంజుకు సల్మాన్ ఖాన్ సపోర్ట్ అవసరమా..? పోనీ, హిందీ మార్కెట్‌కు ఉపయోగపడతాడు అనుకుందాం… అతిథి పాత్రకు ఎక్కువ, ఓ చిన్నపాత్రకు తక్కువ తన ఉనికి… దాంతో వచ్చేదేముంది..? దానికోసం హిందీ ప్రేక్షకులు ఎగబడరు కదా… పైగా సల్మాన్ ఎంట్రీ తరువాతే సినిమా గాడి తప్పి, రెగ్యులర్ మాస్ మూవీ బాటలో పడింది… చివరి అరగంట సినిమాను దెబ్బ తీస్తే, దానికి కారకుడు సల్మాన్…
థమన్ పాటలు సోసో, మరీ మొన్న రిలీజ్ చేసిన బిల్డప్ సాంగ్ చాలా నిరాశను కలిగించింది… కాస్త నజభజజజర ట్యూన్ నయం… జోష్ ఉంది… కానీ బీజీఎం విషయంలో థమన్ నిర్లక్ష్యం ఉంది… ఏదో దడదడ కొట్టేస్తున్నాడు గానీ… స్పిరిట్ లోపిస్తోంది… గాడ్‌ఫాదర్ వేరు, అఖండ వేరు థమనూ…
ఏ పరిస్థితుల్లోనూ ఎవరూ ఈ సినిమాను ఒరిజినల్‌తో పోల్చుకోవద్దు… ఓ తెలుగు సినిమా అనుకుని చూడాలి… లేకపోతే జీర్ణం కాదు… ఇది నిజమే… కానీ చాలామంది ఓటీటీలో ఆ సినిమాను ఆల్‌రెడీ చూశారు… అందులో బిల్డప్పులకన్నా కథాకథనాల మీద కాన్సంట్రేషన్ ఉంటుంది… ఈ రీమేక్‌లో బోలెడు మార్పులు… కేవలం చిరంజీవి కోణంలో… అదేదో సాంగులో సల్మాన్, చిరు స్టెప్పులు… ఏవో గన్నులు పట్టుకుని దడదడ కాల్చేస్తున్నారు… చిరులో వయోభారం కూడా కనిపిస్తోంది…
నిన్న దర్శకుడో ఎవరో ఎక్కడో అన్నారు కదా… చిరంజీవి తరువాత సత్యదేవ్, నయనతార తమ పరిధుల్లో తాము బాగానే చేశారు… కాదు, ఒకరకంగా వాళ్ళే బాగా చేసారు… ఒరిజినల్‌తో పోలిస్తే పది సర్‌ప్రయిజులు అని దర్శకుడు ఎక్కడో చెప్పినట్టున్నాడు… బిల్డప్పులు ఎక్కువ కావడం ఒక్కటే కాదు… అప్పటిదాకా ఓ భిన్నమైన పొలిటికల్ థ్రిల్లర్‌లా సాగిన సినిమాను చివరి అరగంట మరీ రొటీన్, మాస్ సినిమా బాటలోకి తీసుకొచ్చారు… వీక్ క్లైమాక్స్… ఏతావాతా… మరీ పాదఘట్టం కాదు… పర్లేదు… అయితే చిరంజీవి సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉంటాయి కదా… అక్కడొస్తుంది సమస్య..!! (యూఎస్ ప్రీమియర్ ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్)
Share this Article