బెంగాల్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ మీద కఠిన చర్యలకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం నోటీసుల్ని జారీ చేసింది… అది సరైన అడుగేనా..? అని చాలామంది మిత్రుల ప్రశ్న… సరైనదే కాదు, తప్పనిసరైనది కూడా..! ప్రభుత్వాలు వస్తుంటయ్, పోతుంటయ్… మమత వంటి ముఖ్యమంత్రులు, మోడీ వంటి ప్రధాన మంత్రులు కూడా వస్తుంటారు, పోతుంటారు… కానీ సిస్టం ఓ క్రమపద్ధతిలో నడుస్తూ ఉండాలి… కీలకమైన కేంద్ర సర్వీసు అధికారులు దానికి తోడ్పడాలి… రాజకీయాల ప్రభావం, ఒత్తిళ్లు వాళ్ల మీద ఉంటయ్, కానీ అంతిమంగా తమ సర్వీస్ రూల్స్, తమకు నిర్దేశించిన బాధ్యతలకే కట్టుబడాలి… దాన్ని ఈ ఆలాపన్ బంధోపాధ్యాయ్ తెలివిగా ఉల్లంఘించాడు… అదేమిటో తరువాత చెప్పుకుందాం కానీ… ప్రధాని స్వయంగా పర్యవేక్షించే డీఓపీటీ (The Department of Personnel and Training) ఈ కేంద్ర సర్వీసు అధికారుల వ్యవహారాల్ని చూస్తుంటుంది… వీళ్ల సర్వీసుపై కేంద్రానిదే అల్టిమేట్ అధికారం… ఏకంగా ప్రధాని జరిపే రివ్యూ మీటింగును, అదీ జనానికి కేంద్రసాయం తప్పనిసరి అవసరమైన నేపథ్యంలో జరిగే మీటింగును తన బాధ్యతలను తుంగలో తొక్కి మరీ బహిష్కరించడం తప్పిదమే…
ఈయనపై చర్య తీసుకోకుండా వదిలేస్తే మోడీ ప్రధాని కుర్చీలో కొనసాగడానికి అనర్హుడు… ఎందుకంటే..? రేప్పొద్దున ఇక ఎవరూ ప్రధాని మాటను ఖాతరు చేయకపోయే ప్రమాదముంది… సిస్టంకు నష్టం కలిగిస్తుంది అది… ఆలాపన్ ప్రదర్శించిన తెలివిని చెప్పుకుందాం… మమత, మోడీ ఫైట్ నేపథ్యంలో తన ఆలోచన ఏమిటంటే..? ‘‘మమత కోరిక మేరకు నాకు మరో 3 నెలల సర్వీస్ కొనసాగింపు ఇచ్చాడు మోడీ… అంటే 3 నెలల తరువాత ఈ ప్రధాన కార్యదర్శి పోస్టు దిగిపోయాక అనేకానేక మంది రిటైర్డ్ ఉద్యోగుల్లో ఒకడిగా మిగిలిపోతాను… సో, మమత చెప్పినట్టు వింటే హేపీ, ఎలాగూ ఆమె మరో అయిదేళ్లు సీఎం పోస్టులో ఉంటుంది…’’ అనుకున్నాడు, ఇక్కడే కేంద్ర ప్రభుత్వ అధికారాల్ని తక్కువ అంచనా వేశాడు… ‘‘ఏ రాష్ట్ర కేడర్ అధికారులపై ఏ చర్య తీసుకోవాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించాలి కదా… ఎలాగూ నాపై చర్య తీసుకోవడానికి, డెప్యుటేషన్ వంటి కక్షసాధింపుకి మమత ఒప్పుకోదు, సో, మోడీ చేసేదేమీ లేదు… సర్వీస్ రూల్స్ మీద చర్యలు ఎటూ తెగవు, నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్తే సరి’’ అనుకున్నట్టున్నాడు… అక్కడే తప్పులో కాలేశాడు… కేంద్రం చాకచక్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని ప్రయోగించింది… ఆ చట్టం అత్యంత పవర్ఫుల్… కరోనా వంటి పాండెమిక్ నేపథ్యంలో ఆ చట్టాన్ని కోర్టులు కూడా ఇగ్నోర్ చేయలేవు… ఇప్పుడు ఆలాపన్కే కాదు, మమతకూ షాక్… ఎటొచ్చీ, మోడీ తన నిర్ణయానికి కట్టుబడి, కాస్త లాజికల్ ఎండ్ వరకూ తీసుకుపోతే… అదొక్కటే సందేహం కూడా… తను యోగీ వంటి ఫరమ్ ప్లేయర్ కాదు కాబట్టి…
Ads
Section 51 in the Disaster Management Act, 2005
చూశారు కదా… ఇదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్… మోడీ సరిగ్గా కొరడా పట్టుకుంటే ఈ అధికారికి కనీసం ఏడాది జైలు తప్పదు… మమత చాలా తెలివిగా ఈ అధికారిని ఢిల్లీకి పంపించకుండా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిజైన్ చేయించి, మూడేళ్లపాటు పనిచేసేలా ప్రభుత్వ సలహాదారు పదవిలో కూర్చోబెట్టింది… మోడీ, ఇప్పుడేం చేస్తావోయ్ అన్నట్టుగా తలెగరేసింది… ఇప్పుడు తీరా ఈ చట్టాన్ని ప్రయోగించడంతో దీన్ని ఎలా ఎదుర్కోవాలో మమత టీంకు అర్థం కావడం లేదు… దేశవ్యాప్తంగా కేంద్ర సర్వీసు అధికారుల్లో కాస్త క్రమశిక్షణ, భయం, కట్టుబాటు ఉండాలంటే మోడీ ఈ ఆలాపన్ విషయంలో స్థిరంగా వ్యవహరించాలి… ఇక్కడ మోడీ, మమత అనే వ్యక్తులు కాదు ముఖ్యం… ఒక ప్రధాని, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… ఎందుకు సీరియస్గా ఉండాలీ అంటే… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ రాష్ట్ర అధికార యంత్రాంగానికి బాస్… తనే ఈ దేశ ప్రధానిని ఫోఫోవోయ్ అన్నట్టుగా తేలికగా తీసిపడేస్తే, ఇక అంతకుమించిన అవమానం, అరాచకం ఇంకేముంటయ్..?!
Share this Article