.
తోపు బిజినెస్ మాగ్నెట్‌లకు సవాల్… మన ‘ఇల్లాళ్ల’ తెలివితేటల దెబ్బకు ఫిదా! … సాధారణంగా “బంగారం” అనగానే మన తెలుగు ఇళ్లల్లో బామ్మలు, తల్లులు గుర్తొస్తారు. “బంగారం అమ్మకూడదు.. అది లక్ష్మీ దేవి.. కష్టాల్లో కూడా దాన్ని తాకకూడదు” అని తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు… కానీ, కాలం మారింది.. ఇప్పుడు మన ఇల్లాళ్ల ఆలోచనా ధోరణి కూడా మారింది.. సెంటిమెంట్ పక్కన పెట్టి, ‘బిజినెస్ సెన్స్’తో వారు చేస్తున్న ‘దండయాత్ర’ ఇప్పుడు దేశ ఆర్థిక మార్కెట్‌నే ఆశ్చర్యపరిచేలా ఉంది…
సందర్భం: దిగుమతులపై పన్ను.. ఆకాశాన్ని తాకిన ధరలు … కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని (Import Duty) 15 శాతానికి పెంచడం ఒక పెద్ద మలుపు… సాధారణంగా ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు విదేశాల నుంచి వచ్చే బంగారానికి కత్తెర పడుతుంది, తద్వారా దేశీయంగా రేట్లు అమాంతం పెరుగుతాయి… ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ₹1.4 లక్షల స్థాయికి చేరడంతో, అంతా ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందుతుంటే, మన గృహిణులు మాత్రం ఈ పరిస్థితిని ఒక ‘అవకాశం’గా మార్చుకున్నారు…
Ads
‘ఎక్స్ఛేంజ్ వద్దు.. క్యాష్ ముద్దు!’ … గతంలో పాత నగలు ఇచ్చి, కొత్తవి తీసుకోవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ… కానీ ఇప్పుడు మన మహిళలు ఆ పద్ధతికి ‘టాటా’ చెప్పేశారు… పాత నగలను కొత్త నగల కోసం మార్పిడి చేయడం అంటే తిరిగి వ్యాపారులకే లాభం చేకూర్చడమే అని వారు గ్రహించారు… ధరలు గరిష్టంగా ఉన్న ఈ సమయంలో, “పాత బంగారం ఇచ్చి నగదు తీసుకోవడమే తెలివైన పని” అని నిర్ణయించుకున్నారు… కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని వారు మార్కెట్లోకి వదిలారు…
గణాంకాలతో విశ్లేషణ: ఒక ‘గోల్డెన్’ సర్దుబాటు… మన ఇల్లాళ్లు చేసిన ఈ పని ఎంతటి ప్రభావం చూపిందో ఈ గణాంకాలు చెబుతున్నాయి…
- నెలవారీ దిగుమతులు సగటున 70 నుంచి 100 టన్నులు ఉండేవి, 15 శాతం పన్ను తరువాత అది 25 నుంచి 30 టన్నులకు పడిపోయాయి…
ప్రస్తుత ధర ₹1.4 లక్షలు (10 గ్రాములకు) చొప్పున లెక్కగడితే, 50 టన్నుల (50,00,000 గ్రాముల) బంగారం విలువ దాదాపు ₹70,000 కోట్లు… అంటే, మన ఇల్లాళ్లు పాత నగలను అమ్మడం ద్వారా దేశం నుంచి విదేశాలకు వెళ్లాల్సిన ₹70,000 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆపగలిగారు… దిగుమతి తగ్గుదల వల్ల ఏర్పడిన 50- 70 టన్నుల లోటును, మన ఇల్లాళ్లు తమ వద్ద ఉన్న పాత బంగారంతో భర్తీ చేసి, దేశీయ సప్లై చైన్‌ను సమర్థవంతంగా కాపాడారు…
ధరలు పడిపోతాయా? – ఒక క్లారిటీ … చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే, ఇంత బంగారం దేశీయంగా వస్తే ధరలు తగ్గుతాయా? అని…. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బంగారం ధరలను శాసించేది లండన్ బులియన్ మార్కెట్ (LBMA)… అమెరికా డాలర్ విలువ, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా ధరలు నిర్ణయమవుతాయి…
మన దేశంలో ఎంత బంగారం మార్కెట్లోకి వచ్చినా, అంతర్జాతీయ ధరలు మారనంత వరకు ఇక్కడ రేట్లు తగ్గవు. ఈ విషయాన్ని మన మహిళలు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు కాబట్టే, పీక్ ప్రైస్ (Peak Price) వద్దే అమ్మకాలను పూర్తి చేశారు.
ఆర్థిక నిపుణుల కంటే మిన్న… ఎకనామిక్స్ పాఠాలు చదివిన నిపుణులు ఒకవైపు ఉంటే, ఇంట్లో కూర్చుని మార్కెట్ పల్స్ పట్టుకున్న మన గృహిణులు ఒకవైపు! కేవలం సెంటిమెంట్‌గా దాచుకున్న బంగారాన్ని, దేశం అవసరమైనప్పుడు ఒక పవర్‌ఫుల్ ఆస్తిగా మార్చి, తమ ‘బిజినెస్ మైండ్’ను మరోసారి నిరూపించారు.
శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను గౌరవిస్తూనే, సమయానుకూలంగా దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించిన మన భారతీయ గృహిణుల ‘గోల్డెన్ మేనేజ్మెంట్’ నిజంగానే అద్భుతం… విదేశీ ధనం ఆదా చేయడంలో వీరు చూపిన ఈ చొరవ, ముచ్చటగా చెప్పుకోవాల్సిన విషయం…!
Share this Article