నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం మిక్కిలి ముదావహం… ఇంకేదో పాటకు రావడం వేరు, కానీ నాటునాటు పాటకే రావడం మరీ మీదిమిక్కిలి ముదావహం… కొంతమందికి నచ్చకపోవచ్చుగాక, కానీ ఎందుకు ఆ పాటకు అంత విశిష్టత తెలియకపోవడం వల్ల వచ్చిన దురవగాహన తప్ప మరేమీ కాదు… ఆ పాట విలువ తెలియాలి… తెలిస్తే కళ్లు చెమరుస్తాయి… గోల్డెన్ గ్లోబ్ ఆ పాటకు తప్ప మరే పాటకూ రావడానికి వీల్లేదని అప్పుడు అర్థం చేసుకోగలరు… ట్విట్టర్‌లో పవన్ సంతోష్ రాసిన థ్రెడ్ మాత్రం బాగుంది మిత్రమా… కీపిటప్…
….. (Pavan Santhosh) @santhoo9
సినిమా పాటల గురించి, వాటి గొప్పదనం మనకు ఏళ్ళ తరబడి ఉన్న ఆలోచనలను ఈ పాటకు పురస్కారం రావడం సవాలు చేస్తుంది. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి కొత్త చూపు అవసరం. మొదట – ఈ పాట ప్రత్యేకత ఏమిటో చెప్పుకుందాం. తర్వాత – ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ఎంతవరకూ సబబు అన్నదీ చూద్దాం.
Ads
“నాటు నాటు” పాట ఒక స్థాయిలో చూస్తే “శివ శంకరీ” (జగదేకవీరుని కథ – 1961), “తకిట తథిమి” (సాగర సంగమం – 1983) వంటి వాటికి సరి సమానమైనది. ముఖ్యంగా ఈ పోలిక దర్శకుల ఇమేజినేషన్, ఎగ్జిక్యూషన్, అవి ప్రేక్షకుల్లో కలిగించే స్పందన అన్న అంశాల్లో ఒప్పుతుంది.
దర్శకుల రూపకల్పన చేసిన పద్ధతి చూస్తే – ఈ పాటలు స్పష్టంగా 3-యాక్ట్ స్ట్రక్చర్లో ఉంటాయి. సినిమా స్క్రీన్‌ప్లే విషయంలో ప్రాచుర్యంలో ఉన్న 3-యాక్ట్ స్ట్రక్చర్‌లో పాటలు రాయడం వల్ల వీటికొక ప్రత్యేకత ఏర్పడింది. దర్శకులు కావాలనుకున్న ఎఫెక్ట్ రావడానికి వీలు పెరిగింది. మీకు తెలిసి ఉండొచ్చు. కానీ 3 యాక్ట్ స్ట్రక్చర్ క్లుప్తంగా – 3 యాక్ట్ స్ట్రక్చర్ సినిమాని 3 యాక్ట్స్‌గా విభజిస్తుంది. 1వ యాక్ట్ – Set up. ప్రోటాగనిస్ట్‌కి ఒక సమస్య ఏర్పడడం, ఒక లక్ష్యం ఏర్పడడం ఇందులోనే. పాత్రల నుంచి కథా ప్రపంచం వరకూ పరిచయం. మన సినిమాల్లో మొదటి 30-35 ని.ల దాకా.
ఇక 3వ యాక్ట్‌లో సరదా డోసు పెరుగుతుంది. britisherని ఓడించడం అన్నది సాధించడమే కాదు అది చిన్నదై లక్ష్యం మారిపోతుంది. హీరోలిద్దరిలో ఎవరు గెలుస్తారన్న పోటీగా తయారవుతుంది. చివరకు జెన్నీ మనసును భీమ్ గెలవాలని రామ్ తనంత తాను ఓడిపోవడంగా ముగుస్తుంది. తెరపైనా, ఎదుట అందరి మనసులు గెలుస్తారు.
హీరో పూర్తిగా తాగేసి హోరుమన్న వానలో బావి మీద నాట్యం చేస్తూంటాడు. పనివాడు ఎంత చెప్పినా వినడు. ఆమె ఎదురైతే బొట్టులేదన్నది తెలుస్తుంది. అలాగని ఊరుకోలేదు. అతను నాట్యం చేస్తూండడం సాగుతూ పరిస్థితి క్షణక్షణంలో ముదురుతూ ఉంటుంది. ఆమె ఏం చేసిందన్నది రిజల్యూషన్.
కె. విశ్వనాథ్ ప్రధానంగా స్క్రీన్‌ప్లే రచనా బలాన్ని నమ్ముకుని, ఆపైన సంగీతం-సాహిత్యం-నటన-నాట్యం అన్న స్తంభాలపై దాన్ని నిలబెట్టారు. ఇందులో వేటూరి, ఇళయరాజా, కమల్, జయప్రద ఒకరితో ఒకరు పోటీడ్డారు.
“నాటు నాటు” పాట విషయంలో దర్శకుడు ssrajamouli కి తాను పాట ద్వారా చెప్పే కథ రక్తి కట్టించడానికి ఒక బ్రహ్మాండమైన డ్యాన్స్ కావాలి, ఆ డ్యాన్స్‌ని సమర్థించగలిగే ఉత్సాహకరమైన పాట కావాలి. ప్రేమ్‌రక్షిత్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ, దానికి అంతే పర్ఫెక్ట్‌గా @tarak9999 &
చివరగా ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం రావడం సబబా? బేసబబా? అన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్పను. ఆ పని మీకే వదిలేస్తున్నాను. బైదవే – మీరేం సమాధానం చెప్పుకున్నా అది మీ ఇష్టం. నా అభిప్రాయమైతే నూటికి నూరుపాళ్ళూ ఈ పాట అర్హమైనదే అని. #NaatuNaatuForOscars #RRRGoesGlobal
Share this Article