మొదట సరయు… ఓ ఎక్స్ట్రీమ్… వెళ్లిపోయింది… తరువాత ఉమాదేవి… ఆమె మరో ఎక్స్ట్రీమ్… వెళ్లిపోయింది… కానీ లహరి విషయంలోనే ప్రేక్షకులు కాస్త త్వరపడ్డట్టు అనిపించింది, ఏమో, బిగ్‌బాస్ వాడి వికారం కావచ్చు అది… ఎందుకంటే..? ముందే కుదిరిన అగ్రిమెంట్ల ప్రకారమే ఎవరెన్ని వారాలు ఉండాలో నిర్ణయం అయిపోతుంది కాబట్టి, లహరికి అంతే బాకీ ఉన్నట్టుంది కాబట్టి…! సరే, నటరాజ్ మాస్టర్ వెళ్లిపోవడానికి అర్హుడే… అదొక వైల్డ్ కేరక్టర్ అనిపించింది… ప్రేక్షకుల నిర్ణయం సబబే అనిపించింది… మళ్లీ వెంటనే హమీదాను బయటికి పంపించారు… హౌజులో ఉన్న ఒకే ఒక అందమైన కేరక్టర్‌ను, అదీ లవ్ ట్రాకులో నటనను పండిస్తున్న కేరక్టర్‌ను బయటికి పంపించడం ప్రేక్షకుల తప్పే… ఏమో, అదీ బిగ్‌బాస్ వాడి అగ్రిమెంట్ల ఫెయిల్యూర్ కూడా కావచ్చు…! అరె, ఏంటిరా వీడు… అందరూ లేడీస్‌నే బయటికి పంపిస్తున్నాడు, అనుకుంటున్నారా..? మరో లేడీని బయటికి పంపించేశాడు… ఆమె పేరు శ్వేత…
తప్పదు… ఆమె ఇన్నాళ్లు అక్కడ ఉండటమే ఓ అచీవ్మెంట్… ఓ వైల్డ్ కేరక్టర్… మాట, దూకుడు అన్నీ ఎక్స్ట్రీమే… మరి ఇలాంటి వాళ్లంతా వెళ్లిపోతే ఇక హౌజులో థ్రిల్లేముంది..? మజా ఏముంది..? అంటారా..? వయస్సు మళ్లిన ప్రియ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక తదితరులున్నారు కదా..! అసలు ఫస్ట్ నుంచీ బిగ్‌బాస్ పోకడకు ఈసారి ఓ దశ లేదు, ఓ దిశ లేదు… శ్వేత మొన్న ఏదో టాస్కులో తప్పు చేసింది, యాంకర్ రవి తప్పుడు సలహాను విని, సోఫా పిల్లోలను చీల్చి, అందులో కాటన్ తెచ్చి, బొమ్మల్లో కూరింది… నాగార్జున ఏదో క్లాస్ పీకినట్టున్నాడు… బట్, అప్పటికే ఆమె ఎగ్జిట్ ఖరారైపోయినట్టుంది… ఇక అందర్నీ ఇలాగే పంపిస్తే అందులో మిగిలేది షణ్ముఖ్ మీద వాలిపోయే సిరి, ఏం చేస్తుందో తనకే తెలియని కాజల్, ఏజ్‌బార్ ఓవరాక్షన్ ప్రియ… ప్రియాంక, యానీ మాస్టర్… వీళ్లేనా..? ప్లస్ దిక్కుమాలిన మేక గడ్డాలు పెంచుతూ మేల్ కంటెస్టెంట్లు…
Ads
మేల్ గడ్డాలు అంటే గుర్తొచ్చింది… ఈసారి లోబోను, ప్రియను నిలబెట్టి నాగార్జున ఏదో క్లాస్ పీకుతున్నట్టు కనిపిస్తోంది ప్రోమోల్లో… ఓపెన్ ది గేట్ అని గద్దిస్తున్నాడు… ఎవరో ఒకరిని పంపించేద్దాం, ఎవరిని అని అందరినీ అడిగాడు… చివరకు లోబోను బయటికి పంపించాడు… మరి వోటింగులు గట్రా ఏమీ లేకుండా ఎలా పంపిస్తాడు..? అరె, ఎవరికి తెలియదు బిగ్‌బాస్ షో వికారాలు..? సీక్రెట్ రూంకు పంపించాడు… అది కొన్నాళ్ల డ్రామా… నిజానికి లోబో మొదట్లో కాస్త ఎంటర్టెయిన్ చేశాడు గానీ తరువాత బోరింగ్ పర్సనాలిటీ అయిపోయాడు… తనకన్నా కాస్త సన్నీయే నయం… సరే, ఇవన్నీ వోకే గానీ… ఒరే బిగ్‌బాస్ నాన్నా… హౌజులో కాస్త ఆడ, మగ నిష్పత్తి కూడా ఓసారి చెక్ చేసుకోరా తండ్రీ…!! కొంపదీసి ఇద్దరు ముగ్గురు లేడీ సర్ప్రయిజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండవు కదా…!!
Share this Article