.
గీతాసింగ్… ఈ పేరు బహుశా ఇప్పుడు చాలమందికి గుర్తుండి ఉండదు… కితకితలు అని అప్పట్లో ఓ సినిమా వచ్చింది… అల్లరి నరేష్ హీరో… అదొక నవ్వుల నావ… హిట్టయింది కూడా…
అందులో కథానాయిక ఓ లావుపాటి కేరక్టర్.., ఆమే గీతాసింగ్… ఊరు నిజామాబాద్… బిగ్‌టీవీలో కిస్సిక్ అనే చాట్ షో వస్తుంది కదా… అందులో తాజాగా గీతా సింగ్ కనిపించింది… చూస్తుంటే ఓ ఆశ్చర్యం… చాన్నాళ్లయింది ఆమె తెర మీద కనిపించక… ఇప్పుడు హఠాత్తుగా బుల్లితెర మీద కనిపించి ఆశ్చర్యపరచడం కాదు, ఆమె వాగ్ధోరణితోనే ఆశ్చర్యం… ఎందుకంటే..?
Ads
ఆమె కాజువల్‌గా, జోవియల్‌గా ఏదేదో చెబుతోంది పెళ్లి గురించి, తన ప్రస్తుత జీవితం గురించి… తన మీద తనే పంచులు వేసుకుంటోంది… కానీ, ఆ వాక్యాల నడుమ విషాదం, కళ్లల్లో చెమ్మ.., అన్ని నిజాలే… రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు… దత్తత తీసుకున్న కొడుకు ప్రమాదంలో మరణం… (పెళ్లి కాలేదు)…
ఇండస్ట్రీలో ఎవరో చిట్టీలతో మోసం చేయడం… పైసా పైసా కూడబట్టుకునే లక్షల హాంఫట్… కానీ ఆమె ప్రతి మాటలో ఏ హిపోక్రసీ లేదు… నిజాలు చెప్పుకుంటూ పోయింది… పనిలోపనిగా మంచు విష్ణు ఔదార్యం గురించీ చెప్పుకొచ్చింది…
మా అబ్బాయికి పైసా తీసుకోకుండా చదువు చెప్పించాడు విష్ణు… (మంచు ఫ్యామిలీకి ఇలాంటి ప్రశంసలు అరుదు కదా… గ్రేట్…)
‘‘నా పనులు నేను చేసుకుంటారు, బోళ్లు తోముకుంటాను, వంట చేసుకుంటాను, ఇల్లు కడుక్కుంటాను… రేప్పొద్దున దేవుడు ఇలాగే కోపగించినా సరే, ఏదో దొరికింది తినేసి బతికేస్తా… నా బిడ్డను తీసుకుపోయాడని దేవుడి మీద కోపం ఉండేది కొన్నాళ్లు, చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను… అందుకే అసలు తెర మీదకే రాలేదు… నేను బతుకుతానా లేదాని బంధువులు అనుకున్నారు…’’
కితకితలు సినిమాలో ఓసారి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకుతుంది, నీళ్లన్నీ బయటికి తన్నుకొస్తాయి, అందరూ సునామీ సునామీ అని హడలిపోతారు, ఈ సీన్ ప్రస్తావనకు వచ్చినప్పుడు… ‘‘నిజమే, నేను దూకాను, నాకేమో ఈత రాదు, నిజంగానే నీళ్లన్నీ బయటికి వచ్చేశాయి తెలుసా..?’’
‘‘పెన్షన్ వయస్సుకొచ్చాను, ఇంకా ఇప్పుడు నాకు పెళ్లేమిటి..?’’ వావ్, బాగుంది గీతాసింగ్… ఏమాత్రం హిపోక్రసీ లేదు… స్ట్రెయిట్…
‘‘మేమున్నామని గుర్తుంచుకొండి సార్’’ అని దర్శకులను అడుగుతోంది… బహుశా అది అప్పీల్ చేసుకోవడం కోసమే ఈ షోకు వచ్చినట్టుంది… కమిట్మెంట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు… ‘‘నా ఆకారం చూసి ఎవడైనా కమిట్మెంట్ అడుగుతాడా అసలు..?’’ అనీ తన మీద పంచ్ వేసుకుంది… ఏమాత్రం సెల్ఫ్ పిటీ లేదు…
Share this Article