ఒక వార్త భలే నచ్చేసింది… అదేమిటయ్యా అంటే… మన హీరోయిన్… అవును, మన తెలుగు హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఉంది కదా… ఓ ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్‌కు నో చెప్పిందట… వావ్… నాలుగు డబ్బులు వస్తాయంటే ఏ పనికైనా రెడీ అనే మన హీరోయిన్లు, డబ్బులొచ్చే ఓ పనికి బ్లంట్గా నో చెప్పేయడమా..? ఇంట్రస్టింగు… అందుకే ఈ వార్త నిజమో అబద్ధమో గానీ… నిజమైతే బాగుండును అనిపించేలా నచ్చింది…
అవును… డబ్బులకు ఏమాత్రం కక్కుర్తి లేకుండా, ఇలాంటి బ్రాండ్ ప్రమోషన్లకు దూరంగా ఉండేవారిలో ప్రముఖంగా కనిపించేది సాయిపల్లవి… సరే, ఆమె కథ వేరు… ఆమె దారి వేరు… కానీ లావణ్య చాలా యాడ్స్ చేస్తుంది కదా, మరి ఒకసారి కాలికి గజ్జె కట్టాక ఏదో ఒక ఆట ఆడాల్సిందే కదా… ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్‌ను ఎందుకు వద్దనుకుంది..? అదీ ఆసక్తికరం… ఇవన్నీ సరే, అసలు ఆల్కహాల్ బ్రాండ్ల యాడ్స్‌కు మీడియాలో పర్మిషనే లేదు కదా… మరి ఆమెను అప్రోచ్ అయినవారెవరు..? ఏ యాడ్స్..?
Ads
నిజమే… టీవీల్లో, పత్రికల్లో ఆల్కహాల్ యాడ్స్ ఉండకూడదు… అదే కంపెనీ పేరుతో సోడా లేక మినరల్ వాటర్ పేరిట యాడ్స్ చేస్తారు… అంటే బ్రాండ్ ప్రమోషన్… ఒక హీరో చకచకా సోడా తాగి, ఆహా అంటూ ఆ సీసాను పట్టుకుని చూపిస్తాడు… పరోక్షంగా మన బుర్రలోకి ఆ ఆల్కహాల్ బ్రాండ్ నేమ్ కిక్కులా ఎక్కిపోతుందన్నమాట… మరి లావణ్యకు వచ్చిన ఆఫర్ ఏమిటి..?
ఈ సెలబ్రిటీలు అందరికీ ఇన్స్టాగ్రాం ఖాతాలుంటయ్ కదా… అదే, సేమ్ ఫేస్బుక్, ట్విట్టర్‌లాగే ఇన్స్టాగ్రాం కూడా ఓ సోషల్ ప్లాట్‌ఫాం… ఫోటోలు, వీడియోలకు చాలా ఫేమస్… ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతిష్ట మసకబారిపోయి, ప్రధానంగా యూత్ ఈ ఇన్స్టాగ్రాం వెంట పరుగులు తీస్తున్నారు… ఒక్కొక్క సెలబ్రిటీకి మిలియన్ల కొద్దీ ఫాలోయర్లు ఉంటారు… ఈ సెలబ్రిటీలు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుని, ఈ కంపెనీల యాడ్స్ తమ టైమ్‌లైన్‌లో షేర్ చేస్తారు… అంటే టీవీలు, పత్రికల్లో వచ్చే యాడ్స్‌తో సమానం అవి… టారిఫ్‌లో ప్లస్ రీచ్‌లో ప్లస్ ప్రమోషన్లో…
కొందరు ఇలా యాడ్స్ షేర్ చేయడానికి కోట్లు తీసుకుంటారు… ఆశ్చర్యపోవద్దు… ఇన్స్టాగ్రాం యాడ్స్ అనేది పెద్ద దందా… ఇది రాబోయే కాలంలో టీవీ, ప్రింట్ మీడియా యాడ్ రెవిన్యూను కూడా భారీగా కొల్లగొట్టబోతోంది…
సరే, విషయానికివస్తే… ఈమె మంచి లావణ్యవతి… ప్లస్ డిమాండ్ ఉన్న హీరోయిన్… పెద్దగా వివాదాల్లో ఉండదు… తన పనేదో తనది… పైగా సోషల్ మీడియా కంట్రవర్సీల్లో కూడా ఎప్పుడూ నోరు విప్పదు… అసభ్యమైన షేరింగ్స్ కూడా ఉండవు… ఈమె ఇన్స్టాగ్రాం ఖాతాకు 20 లక్షల మంది ఫాలోయర్లున్నారు… మామూలుగా కృతి కర్బంద, పూజా హెగ్డే, పాయల్ రాజ్‌పుత్, తేజస్వి మదివాడ వంటి తారలు ఇన్స్టాగ్రాం యాడ్స్ దందాలో ఉన్నవాళ్లే… అందుకని ఓ ఆల్కహాలికుడు లావణ్య త్రిపాఠీని సంప్రదించాడు… అడిగినంత డబ్బు ఇస్తానన్నాడు…
కానీ ఆమె నో అన్నది… ఎందుకు..? దీనికి కారణం ఆమె బయటికి వెల్లడించడం లేదు గానీ… వ్యసనాలకు సంబంధించిన యాడ్స్ సొమ్ము తనకు అక్కర్లేదు అనేది ఆమె ఫరమ్గా తీసుకున్న నిర్ణయం అట… అదే నిజమైతే మాత్రం ఆమెను మెచ్చుకోవాలి… గుడ్… ‘డబ్బు కోసం ఏమైనా’ అనే నేటి ట్రెండులో కూడా ‘కొన్ని విలువలు, కాస్త నైతికత, ఒకింత పద్ధతి’ అనే స్వీయనియమానికి కట్టుబడి ఉండటం విశేషమే కదా మరి…!!
Share this Article