.
విజయాన్ని టీమ్ అందరికీ వర్తింపజేయి… అందరూ మరింతగా పనిచేస్తారు… ఆనందిస్తారు… అర్హులు కూడా… ఎందుకంటే సినిమా ఓ టీమ్ వర్క్ కాబట్టి…
అపజయం అయితే లీడర్ తన మీద వేసుకోవాలి… టీమ్‌ను తప్పుపట్టొద్దు… అలా చేస్తు మరింత డిప్రెస్ అవుతుంది టీమ్… నాడు మన రాెకెట్ మ్యాన్ కలాంకు వాళ్ల బాస్ ధావన్ నేర్పిన పాఠం ఇదే…
Ads
మరీ అంత గొప్పతనాన్ని ఆపాదించడం లేదు కానీ… పుష్ప దర్శకుడు సుకుమార్ నిన్నటి సక్సెస్ మీట్‌లో పాటించింది మాత్రం అక్షరాలా ధావన్ సూత్రమే… అది తనకు తెలుసని నేను అనుకోను, కానీ ఆచరణ మాత్రం అదే…
తన సినిమాల్లో హీరోల విలనీ షేడ్స్, వెగటు రొమన్స్, ఇతర బీభత్సాల మీద నాకూ బోలెడు అభ్యంతరాలున్నాయి… కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తను అభినందనీయుడు… పైకి బన్నీ బ్రాండ్ మాత్రమే ఈ హిట్‌కు కారణమనే ప్రచారం… కానీ అది పాక్షికమే… వెనుక టీమ్ కృషి ప్రధాన కారణం…
రీషూట్లు, సుదీర్ఘజాప్యం, ఎడిటర్ల మార్పు, బీజీఎం వివాదాలతోసహా హీరో, దర్శకుడి విభేదాల దాకా ఎన్నెన్నో వార్తలు… సరే, సినిమా నాణ్యత ఎలా ఉన్నా కమర్షియల్‌గా సూపర్ హిట్… బ్లాస్ట్… సుకుమార్ వినమ్రంగా తన టీమ్‌కు ఈ విజయాన్ని అంకితం చేసిన తీరు నచ్చింది…
శ్రీమాన్ (?)… అసలు సగం దర్శకుడు తనే అంటూ ఓపెన్‌గా కితాబు ఇచ్చాడు సుకుమార్, నిజానికి శ్రీమాన్, సుకుమార్ అని కంబైన్డ్ దర్శకత్వం టైటిల్ వేయాలి అన్నాడు… ఖచ్చితంగా మెచ్చుకోవాలి దీన్ని… స్టేజ్ మీద తన టీమ్ మొత్తాన్ని నిలబెట్టి, ఒక్కొక్కరు ఏ పనిచేశారో, ఎంతగా పనిచేశారో ప్రస్తావిస్తూ, ప్రశంసిస్తూ అందరిలోనూ ఓ జోష్ నింపాడు… సినిమాలో వాడిన డిక్షన్ కోసం ఎవరు పనిచేశారు, చివరకు లొకేషన్ డైరెక్టర్ గురించి కూడా చెప్పాడు…
తన వెనుక నిలబడిన వాళ్లు ఒక్కొక్కరూ సొంతంగా దర్శకత్వం వహిాంచగల ఒక్కొక్క సుకుమార్ అని అభినందించాడు… దేవి నాగవల్లి తెలుసు కదా, టీవీ9లో ప్రజెంటర్ గతంలో… సినిమా మీద పిచ్చితో జర్నలిజాన్ని వదిలేసి (రుధిరం దేవి) ఇక పూర్తిగా కథల మీద రీసెర్చ్ వర్క్ చేసుకుంటోందన్నాడు..,
తన దగ్గర బోలెడు కథలున్నాయనీ, త్వరలో తానే ఓ కథకు దర్శకత్వం వహిస్తానేమో, ఆమె కూడా త్వరలో దర్శకత్వం చేయబోతోందనీ చెప్పాడు… అవును, జర్నలిజాన్ని వదిలేశాను అన్నట్టుగా ఆమె తలూపింది ఆమె…
గుర్తుంది కదా… విష్వక్సేన్‌ను గెటవుట్ ఫ్రం మై స్టూడియో అంటూ వేలు చూపించిన ఎపిసోడ్… బిగ్‌బాస్ నుంచి మధ్యలోనే నిష్క్రమించి, మళ్లీ ఎక్కడ తన పరువు పోతుందేమో అన్నట్టుగా ఎక్కడా మళ్లీ బిగ్‌బాస్ పేరు ఎత్తలేదు…
మామూలుగా సక్సెస్ మీట్ అనగానే హీరోను ఆకాశానికెత్తేసి… మహా అయితే కంపోజర్, కొరియోగ్రాఫర్, లిరిసిస్ట్‌ల పేర్లు అలా అలా మొక్కుబడిగా ప్రస్తావిస్తారేమో… కానీ ఇలాంటి సక్సెస్ మీట్ రీసెంట్ డేస్‌లో చూడటం ఇదే మొదటిసారి…!!
Share this Article