.
2024 ఆగస్ట్ 4… ఇంగ్లాండ్ లో పలు మానసిక సమస్యలతో బాధపడుతూ, రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంగ్లీష్ క్రికెటర్ గ్రేమ్ తోర్ఫ్… తను సంస్మరణలో భాగంగా నిన్నటి మ్యాచుల్ తోర్ఫ్ ని గుర్తు చేసుకుంటూ… క్రికెట్ ఆడేటప్పుడు హెడ్ బ్యాండ్ ధరించడం తోర్ఫ్ స్టైల్ ) ఇంగ్లాండ్,, ఇండియన్ ప్లేయర్స్ హెడ్ బ్యాండ్‌తో గ్రౌండ్‌లో అడుగు పెట్టడం ఒక మంచి గెస్చర్…
ఒక్కసారి ఉహించుకోండి,.. కాసుల కక్కుర్తితో, డబ్బే పరమావధిగా భావించే బీసీసీఐ నుంచి ఇటవంటివి ఇంపాజిబుల్… ఎందరో గొప్ప గొప్ప క్రికెటర్లకు కనీసం గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వలేని బోర్డు మనది…
Ads
ఇంగ్లాండ్ ఆటగాళ్లంటే వాళ్ళ దేశ క్రికెటర్ కాబట్టి మ్యాచ్ ఆసాంతం హెడ్ బ్యాండ్ ధరించి ఆడారు, కానీ మన వాళ్ళు ఒక్క సిరాజ్ భాయ్ తప్పించి ఇంకెవరు మ్యాచులో హెడ్ బ్యాండ్ పెట్టుకోలేదు, అలాగని అది తప్పుపట్టాల్సిన విషయమూ కాదు..,
కానీ ఒక మనిషిగా పరిపూర్ణ హృదయంతో… తోర్ప్ మరణించిన విధానం తెలిసిన తర్వాత సిరాజ్ భాయ్ మాత్రం హెడ్ బ్యాండ్‌తో బౌలింగ్ చెయ్యడం, అది హైదరాబాది నీళ్లలోనే ఉందనిపించే సద్లక్షణం…
కరెంట్ ఇండియన్ ప్లేయర్స్ లో మోస్ట్ అండర్ రేటెడ్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది మన మియా భాయ్ సిరాజే… గత ఆస్ట్రేలియా సిరీస్ లో 153 ఓవర్లు, ఈ సిరీస్ లో 157 ఓవర్లు బౌలింగ్… అది కూడా ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వెయ్యడం సాధారణ విషయం కాదు…
ఒక్కసారి బుమ్రాతో వర్క్ లోడ్ కంపేర్ చేస్తే సిరాజ్ వర్క్ లోడ్ చాలా ఎక్కువ, కానీ ఎప్పుడూ మనోడు NCA (నేషనల్ క్రికెట్ అకాడమీ ) కి వెళ్లిన దాఖలాలు లేవు, స్పెషల్ ట్రీట్మెంట్లూ లేవు.., చిన్న చిన్న క్రికెటర్లకి కూడా పర్సనల్ PR టీంలు ఉన్న ఈ రోజుల్లో ఎంటువంటి పబ్లిసిటీ లేకుండా గంటల కొద్దీ, ఓవర్ల కొద్దీ, పరుగెత్తి బౌలింగ్ చెయ్యడం ఒక్కటే తెలుసు సిరాజ్ భాయ్ కి…
టీం ఇండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఏ క్రికెటర్ ని అడిగినా చెప్పుతాడు సిరాజ్ అంటే ఏమిటో… అందుకే కోహ్లీకి కానీ, రోహిత్‌కు కానీ మియా భాయ్ అంటే చాలా ఇష్టం… తనకి తెలిసిన పని మనస్సు పెట్టి వికెట్లకి గురి చూసి బంతులెయ్యడమే..,
అన్నట్టు ఇంకో విషయం… నిన్నటి మ్యాచ్ చేజారిపోయే టైములో మనోడి ధాటికి ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు వికెట్ల ముందు అడ్డంగా దొరికి పోవడానికి కారణం… ఆ బంతులు దేనికవే అద్భుతాలు … మరీ ముఖ్యంగా సచిన్ రికార్డుని బద్దలు కొడతాడు అనుకునే జో రూట్‌కి వేసిన ఇన్ స్వింగర్… ఇది చాలా రోజులు క్రికెట్ ప్రేమికుల మైండ్ లో నుంచి వెళ్ళదు…
అంతే కాదు, నిన్న పోస్ట్ లంచ్ స్పెల్ అయితే సిరీస్ కే హైలైట్… అంతే కాదు, ఇప్పటికే సిరాజ్ ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా… అంటే ఇంగ్లీష్ గడ్డపై ఇంగ్లీష్ బౌలర్ల కంటే ఎక్కువ వికెట్లు తీసింది మన సిరాజ్ భాయ్… ప్చ్.. కానీ ఏం లాభం..? అందుకే మోస్ట్ అండర్ రేటెడ్ క్రికెటర్ ఇన్ ఇండియన్ టీం అనేది….
సిరాజ్ భాయ్ దునియా నిన్ను ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్ గా గుర్తు పెట్టుకుంటుందో లేదో తెలియదు కానీ, ప్రతి ఇండియన్ మరి ముఖ్యంగా ప్రతి హైదరాబాదీ నిన్నో దిల్దార్ క్రికెటర్ గా, దిల్ ఉన్న క్రికెటర్‌గా మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుంటుంది… ( గోపు విజయకుమార్ రెడ్డి
)
Share this Article