.
ఒక వార్త… ఈనాడులో కనిపించింది,.. స్థూలంగా చదివితే బాగుంది… అది ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు ప్రమాదబీమా కల్పిస్తూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం, ఈమేరకు యునైటెడ్ ఇండియా, ప్రాగ్మాటిక్ ఇన్సెరెన్స్ కంపెనీలతో ఒప్పందం వార్త…
గుడ్… కార్యకర్తల్ని కాపాడుకోవడంలో దేశంలోని మరే ఇతర పార్టీకన్నా తెలుగుదేశం చాలా మెరుగు… నో డౌట్… ప్రతి ఏటా పార్టీయే 42 కోట్ల ప్రీమియం కంపెనీలకు చెల్లిస్తుంది… ఎవరైనా కార్యకర్త ప్రమాదంలో మరణిస్తే, 5 లక్షల పరిహారం అందుతుంది…
Ads
ప్రీమియంలో కార్యకర్తలు చెల్లించాల్సింది ఏమీ లేదు… కాకపోతే ఇది ప్రమాదమరణాలకు మాత్రమే… అందుకే ప్రీమియం కేవలం 42 కోట్లు మాత్రమే… అన్ని మరణాలకూ దీన్ని వర్తింపజేస్తే ఈ ప్రీమియం సరిపోదు… ఐదే రఫ్‌గా ఓ లెక్క చూద్దాం… అకడమిక్ డిస్కషన్…
ఏపీ రాష్ట్రంలో జనాభా Technical Group by the National Commission ప్రకారం 5.34 కోట్లు… నాబార్డు లెక్కల ప్రకారం సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 3.7 … అంటే కుటుంబాల సంఖ్య 1.44 కోట్లు… సో, ఈలెక్కన రఫ్‌గా కుటుంబ యజమానుల సంఖ్య కూడా అంతే కదా… వీరిలో ధనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, రకరకాల బీమా స్కీముల్లో ఉన్నవాళ్లను తీసేస్తే… ఏ లెక్కల్లోనూ కోటి మందికి మించరు…
రెండు తెలుగు రాష్ట్రాల్లో గాకుండా ఇతరత్రా ఎక్కడా కార్యకర్తలు లేరు… తెలంగాణలో కూడా నామమాత్రమే ఇప్పుడు… సరే, ఈ 5 లక్షల పరిహారం కార్యకర్తల్లో విశ్వాసానికి, మరింత కమిట్మెంట్‌కు ఉపయోగపడుతుంది… కానీ..?
తెల్ల కార్డులు అనే ప్రాతిపదిక గాకుండా… అసంఘటిత కార్మికులు, పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు… కులం, మతం ఏదైనా సరే… జస్ట్, 10, 20 రూపాయల తమ వాటా ప్రీమియంతో ఎవరు దరఖాస్తు చేసుకున్నా సరే ఇలాంటి 5 లక్షల బీమా పథకం పరిధిలోకి వచ్చే స్కీమ్ ప్రభుత్వమే రూపొందిస్తే..?
ఇప్పుడు తెలుగుదేశం కుదుర్చుకున్న ఒప్పందం తీరూతెన్నూ బట్టి తక్కువ ప్రీమియంతోనే రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు (పార్టీరహితంగా, అర్హులైన ప్రజలందరికీ) ఇదే తరహాలో 10 లక్షల పరిహారం వచ్చేలా వర్తింపజేయడం చాలా చౌక కదా… మరి ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు లోకేష్ గారూ..?
అలా చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు కూడా కవరవుతారు అందులో… అర్హులైన కుటుంబపెద్దలు గనుక ప్రమాదాల్లో మరణిస్తే ఈ పరిహారం ఆ కుటుంబాలకు పెద్ద భరోసా కదా… ఫ్రీ బస్సు, ఫ్రీ సిలిండర్లు, ఫ్రీ కరెంటు, ఫ్రీ పంచుడు స్కీములతో పోలిస్తే ఇదెంత మేలు..?!
Share this Article