చాలామంది చంద్రయాన్-3 ఫలితాన్ని కేవలం సేఫ్ ల్యాండింగ్, రోవర్ ప్రయోగాల మేరకే పరిమితం చేశారు… కానీ అంతకు మించి…!! తొలిసారి ఓ దేశయంత్రం చంద్రుడి దక్షిణ ధృవం మీద కాలు (?) మోపడం ఓ విశేషం కాగా… చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ బహుశా చైనా తరువాత మనమేనేమో.,.. అరెరె, అమెరికా, రష్యాలు కూడా ఎప్పుడో దశాబ్దాల క్రితమే అక్కడ మనిషినే దింపి, తిరిగి తీసుకువచ్చాయి అంటారా..? అదే చెప్పబోయేది…
ప్రస్తుతం సూర్యుడు 15 రోజులపాటు కనిపించడు… రోవర్ దిగిన ప్రాంతంలో… అంటే సూర్యశక్తిని స్వీకరించే పరిస్థితి ఉండదు… సో, రోవర్‌లోని పరిశోధన పరికరాలు పనిచేయవు… సో, మనుషులు రాత్రి కాగానే పడుకుని, తెల్లారి సూర్యుడితోపాటు లేచినట్టుగానే… ప్రస్తుతానికి రోవర్‌ను నిద్రపొమ్మని చెప్పారు మన సైంటిస్టులు… కానీ అతి శీతల వాతావరణం కారణంగా అవి మరో పక్షం రోజుల తరువాత సేఫ్‌గా నిద్రలేస్తాయా లేదానేది వేచి చూడాలి…
ఈరోజు ఆంధ్రజ్యోతి పెట్టిన ‘గుడ్ నైట్ చంద్రయాన్’ అనే శీర్షిక చాలా ఆప్ట్… అవును, మనం మళ్లీ దాన్ని ‘గుడ్ మార్నింగ్’ అని నిద్రలేపాల్సి ఉంది… ప్రస్తుతం స్విచాఫ్ మోడ్‌లోకి… అంటే డార్మెంట్ స్టేజిలోకి మాత్రమే పంపించేశాం… అంటే శాశ్వతంగా కనుమూయలేదు, జస్ట్, అనుకూల స్థితి వచ్చే వరకూ కన్ను స్విచ్చులు మూసుకుంది…) సూర్యుడి కాంతి తిరిగి స్టార్ట్ కాగానే… నిద్రలేవడానికి వీలుగా సూర్యకాంతిని స్వీకరించే రోవర్ సౌరఫలకం దిశను కూడా అనుకూలంగా మార్చిపెట్టారు…
Ads
ఒకవేళ సేఫ్‌గా నిద్రలేస్తే రోవర్ మళ్లీ పనిచేస్తుంది… ఇలా ప్రతి పదిహేను రోజులకొకసారి నిద్రలేపి, తన పరిశోధనల్ని కొనసాగేలా చేయాలనేది ఇస్రో ప్లాన్… సంకల్పం మంచిదే… ఫలితం పాజిటివ్‌గా ఆశిద్దాం… నిజానికి దీన్ని మించిన ఓ విశేష ప్రయోగం మరొకటి చేశారు… ల్యాండర్‌లో ఉన్న కాస్త ఇంధనం మండించి దాన్ని కొంతదూరం (అత్యంత స్వల్ప దూరమే) తీసుకెళ్లి మళ్లీ సేఫ్ ల్యాండింగ్ చేశారు… అంటే ల్యాండర్‌ను మన ఇష్టం వచ్చినట్టు టేకాఫ్, ల్యాండింగ్ చేసే గ్రిప్ సంపాదించినట్టే…
అఫ్‌కోర్స్, ప్రస్తుతం అది చాలా స్వల్ప దూరమే కావచ్చు, కానీ భవిష్యత్తు పెద్ద లక్ష్యాలతో పోలిస్తే ఒక తొలి అడుగు… రాబోయే రోజుల్లో మానవసహిత చంద్రయానాల్ని ఎలాగూ సంకల్పించాం కాబట్టి… అక్కడ దిగడం, అక్కడి నుంచి తిరిగి రావడం అనే లక్ష్యాలకు తగినట్టుగా ల్యాండర్ కదలికల్ని నియంత్రించే దిశలో ఇది తొలి అడుగు… అనుకున్నట్టుగానే మనుషుల్ని పంపించి, తిరిగి సేఫ్‌గా తీసుకొస్తామా అనేది కాలం చెబుతుంది… కానీ…
ఇప్పుడు అసలైన ప్రశ్న… అప్పట్లో అమెరికా, రష్యాలు నిజంగానే… అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ కాని రోజుల్లోనే… చంద్రుడి మీదకు మనుషుల్ని పంపించేసి, మళ్లీ తిరిగి ‘విమాన ప్రయాణం’ తరహాలో తీసుకురావడం నిజమేనా..? అవన్నీ ఫేక్, ప్రపంచం కళ్లకు గంతలు కట్టి, అబద్ధాల్ని ప్రచారం చేసుకున్నాయనే కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి కదా… మన ల్యాండర్‌ను 40 సెంటీమీటర్ల ఎత్తుకు తిరిగి ఎగిరించడమే ఇంత కష్టతరం అవుతున్నప్పుడు… ఆ రెండు పాత అగ్రదేశాలు ఏకంగా స్పేస్ క్రాఫ్ట్‌ను సేఫ్‌గా తిరిగి తీసుకొచ్చాయనేది ఈరోజుకూ సందేహాస్పదమే… కాదు, నమ్మలేనిదే..!!
Share this Article