.
Kondal Reddy ….. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇంత సంతోషకరమైన వార్త వింటానని అనుకోలేదు…. ఇటువంటి వార్త కోసం ఏళ్లుగా ఎదురు చూశాము, ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు ఇది,
ఇక ప్రభుత్వం నుంచి ఏ సహకారము అందదేమో అని దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తూ, మీ కుటుంబ సభ్యులవి నిజమైన రైతు ఆత్మహత్యలు కాదు అని ఒకటికి బదులు నాలుగు సార్లు అధికారులు అంటుంటే… మీ కుటుంబ సభ్యుల ఫైల్ రిజెక్ట్ కాబడినది ఇక చేసేది మీరు లేదు అని అధికారులు ముఖం మీద చెప్తూ ఉంటే…,
Ads
దిక్కు తోచక , ఒక పక్క జీవితమంతా తోడు ఉంటాడు అనుకున్న కుటుంబ సభ్యున్ని అర్ధాంతరంగా కోల్పోయి , చంటి పిల్లలను పోషిస్తూ, భర్తను కోల్పోయినా కానీ అప్పుల వాళ్ళ వేధింపులు ఆగకపోగా వారికి సమాధానం చెప్పుకుంటూ… మొక్కవోని ధైర్యంతో రైతు ఆత్మహత్య కుటుంబాల అలుపెరుగని న్యాయపోరాటం వల్ల ఈరోజు 141 రైతు ఆత్మహత్య కుటుంబాలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను రిలీజ్ చేసింది…
సమిష్టి ఉద్యమాలు, న్యాయపోరాటాలు ఎప్పుడు వృధా పోవు….. ఎన్నో రోజుల నుండి ఎదురు చూసిన రోజు రానే వచ్చింది , రైతు ఆత్మహత్య కుటుంబాల పరిహారం విషయంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం….
తహశీల్దార్ , RDO, కలెక్టర్… ఇలా ప్రతి అధికారులను, MLA , MP , మంత్రులు ఇలా రాజకీయ నాయకుల అందరి చుట్టూ తిరిగి, తిరిగి విసుగు చెంది మొక్కవోని ధైర్యంతో హై కోర్ట్ మెట్లు ఎక్కి, సంవత్సరాలు పాటు నిరీక్షించి…,
ఆ తర్వాత హై కోర్ట్ ధిక్కరణ కేసు వేసి పది, పదకొండు సంవత్సరాల తర్వాత మీ కుటుంబ సభ్యులది వ్యవసాయ సంక్షోభంలోనే జరిగిన నిజమైన రైతు ఆత్మహత్యలుగా గుర్తింపబడి అదే ప్రభుత్వంచే పరిహారం పొందబోతున్న కుటుంబ సభ్యులందరి ఓపికకు వేలాది వందనాలు….
ఈ న్యాయ పోరాటంలో సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున వందనాలు…. ఈ పోరాటం వ్యవసాయ వ్యవసాయ సంక్షోభంలో ఆత్మహత్య జరిగిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, రైతు ఆత్మహత్యలు ఆగేవరకు జరుగుతూనే ఉంటుంది…
సుదీర్ఘకాలం పాటు ఈ కేసును రైతు ఆత్మహత్య కుటుంబాల పక్షాన వాదించిన ప్రముఖ మహిళ న్యాయవాది వసుధ నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు….
ఇదీ మిత్రుడు కొండల్ రెడ్డి పోస్టు… గుడ్ ఫైట్… హైకోర్టు తీర్పు ప్రకారం చేసినా సరే, ప్రభుత్వానిది ఎట్‌లాస్ట్ గుడ్ డెసిషన్… ఒకవైపు ‘రేవంత్ పాలనలో రాలుతున్న మట్టిపూలు’ అని ప్రతిపక్ష బీఆర్ఎస్ మైక్ నమస్తే తెలంగాణ పత్రికలో రోజువారీ స్కోర్ వేస్తోంది… ఇదే ఆత్మహత్యలపై బీఆర్ఎస్ శ్రద్ధ చూపింది లేదు, పరిహార ప్రయత్నమూ లేదు…
కాంగ్రెస్ రైతు కుటుంబాల్లో చిరునవ్వులు పూయించే మానవతా నిర్ణయం తీసుకుని కూడా చెప్పుకోలేని బేకార్ సిట్యుయేషన్… పిటీ రేవంత్… ఈ కోణంలో…!! రైతు రుణమాఫీ తీరుపై పల్లెల్లో వ్యతిరేకత ఉంది, రైతుభరోసా దిశ దశ లేకుండా పోతోంది… ఈ స్థితిలో చేసిన మంచి పని చెప్పుకోవడం అవసరం అనిపించలేదా ఫాఫం..!!
Share this Article