Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫటాఫట్ ఆడిషన్స్… చకచకా ఫిల్టర్… ఐదారుగురు మెరికలు దొరికారు…

March 12, 2023 by M S R

1) శృతి నండూరి… అమెరికా నుంచి వచ్చింది… వైద్యాన్ని, సంగీతాన్ని కలిపి ప్రయోగాలు చేయాలనే అభిలాష ఉంది… ఫస్టే గోల్డెన్ మైక్ ఇచ్చేశారు… ఆమె టోన్ ఆమెకు బలం… ఈమె నండూరి ఎంకి మునిమనవరాలు… 2) విశాఖపట్నం నుంచి వచ్చిన సౌజన్య గతంలో అర్జున్‌రెడ్డి సినిమాలో పాడింది… పెళ్లి, సంతానంతో బ్రేక్… ఇప్పుడు మళ్లీ వచ్చింది… ఆమె సీనియారిటీ ఆమెకు ధైర్యం, టోన్ బాగుంది…

3) యుతి హర్షవర్ధన… ఈ బెంగుళూరు అమ్మాయి గతంలో జీసరిగమపలో కూడా పార్టిసిపేట్ చేసింది… ప్రదీప్ చెత్త ర్యాగింగుకు గురైన బాధితురాలు… ఇప్పుడు ఆమె ఇండియన్ ఐడల్ తెలుగు షో టాప్ 12లో ఒకరు… మంచి టోన్… పాట అందుకుంటే మధుర ప్రవాహమే… 4) విశాఖపట్నం నుంచే వచ్చిన అయ్యన్ ప్రణతి వయస్సు ఇంకా 14 ఏళ్లే… కానీ టోన్ మరీ చిన్నపిల్లలా ఏమీ లేదు… మెరిట్ చూడాలిక…

5) లాస్య ప్రియ… సిద్దిపేట నుంచి వచ్చింది… పోటీ అనగానే ఏదో మెలొడీ సాంగ్ తీసుకోవాలని అనుకోకుండా అలెగ్రా అంటూ ఓ మాస్ పాట పాడి మెప్పించింది… టాప్ 5 వరకూ వెళ్తుందేమో బహుశా… 6) హైదరాబాద్ బేస్డ్ కార్తికేయ టోన్ బాగుంది, పాడిన తీరు కూడా బాగుంది… మగ కంటెస్టెంట్లలో మంచి పోటీ ఇవ్వగల మెరిట్ కనిపిస్తోంది… రాను రాను చూడాలిక…

7) సాకేత్… గత సీజన్ సమయంలోనే అవకాశం ఇస్తామనీ ఇవ్వలేకపోయినందున, ఆ ఫీలింగుతో ఈసారి ఏకంగా, నేరుగా గోల్డెన్ మైక్ ఇచ్చారనే ఫీలింగ్ మొదట్లో కలిగినా… పాడుతుంటే తను అనర్హుడు ఏమీ కాదనీ, బలమైన పోటీదారుననీ అర్థమైంది… 8) హైదరాబాద్ బేస్డ్ జయరాం పాడిన తీరు బాగుంది… పాట ఎంపిక బాగుంది… జస్ట్, అలా అలా పాడేయడంతో జడ్జిలకు ఇంప్రెస్ చేశాడు… మంచి పోటీదారే…

9) సాయి వైష్ణవి… ఈసారి పోటీలో ఓ ఇంట్రస్టింగ్ కేరక్టర్… హాలీవుడ్ సినిమాలకు తెలుగు డబ్బింగు చేస్తుంటుంది… రేడియో జాకీ ప్లస్ సింగర్… బ్లాక్‌గా, లావుగా ఉంది… సో వాట్, భౌతికమైన రూపంలో ఉండే అందమే కాదు, మనస్సు అందంగా ఉండాలి అనడమే కాదు, బాగా పాడింది… ఈమె అందరు కంటెస్టెంట్లకూ మంచి పోటీ ఇవ్వగలదు… 10) పలాస నుంచి వచ్చిన చక్రపాణి బీఎస్ఎఫ్ జవాను… పాట బాగానే పాడాడు… సెలవులు అయిపోతే తన కమాండర్ నుంచి అదనపు సెలవులు తీసుకున్నాడు… రెండుమూడు వారాల వరకూ ఉంటాడేమో పోటీలో…

11) మానస… అనుకోకుండా సౌతిండియన్ షాపింగ్ మాల్ దగ్గర ఆడిషన్‌లో కార్తీక్ లాటరీలో పిక్ చేసిన సింగర్… కానీ మాస్ సాంగ్స్‌తో మంచి పోటీ ఇచ్చేట్టు కనిపిస్తోంది… కానీ మెలొడీ, శాస్త్రీయ సంగీత గేయాల్ని ఎలా ఆలపిస్తుందో చూడాల్సిందే… 12) హైదరాబాద్ బేస్డ్ ఆదిత్య కూడా గొప్ప ఇంప్రెసివ్ మెరిట్ అనిపించకపోయినా ఉన్నంతలో ఇతరులతో పోలిస్తే బాగానే పాడాడు… టాప్ 5 కష్టమేమో గానీ, కొన్ని వారాలు నడిపించగలడు…

ఈ డజను మంది తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొనబోయేవాళ్లు… పర్లేదు, ఎంపికలు బాగున్నయ్… మొదట్లో మొహమాటం కేసులకు టికెట్లు ఇస్తూ పోయారు… నచ్చింది ఏమిటంటే… 30 మంది నుంచి ఫటాఫట్ 20 మందిని ఎగురగొట్టేసి, 10 మందిని ఎంపిక చేసిన తీరు… టుయ్యాం టుయ్యాం అంటూ బీజీఎం, కన్నీళ్లు, ఊరడింపుల వంటి కథలేమీ లేకుండా చకచకా ఫిల్టర్ చేసేశారు… కావచ్చు, కొందరు మెరిటోరియస్ కూడా ఎగిరిపోవచ్చు… కానీ కావల్సింది 12 మందే కాబట్టి ఏరివేత తప్పదు…

చాలా మ్యూజికల్ కంపిటీషన్ షోలు సాగుతుంటాయి కదా, ఇండియన్ ఐడల్ షో మీద ఈ కథనం ఎందుకు అంటారా..? నిజంగానే ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… సెకండ్ సీజన్ స్టార్టింగ్ అదే ఊపుతో స్టార్టయింది… గీతామాధురి చాయిస్ ఎలా ఉన్నా సరే, థమన్, కార్తీక్ కరెక్ట్‌గా సింగర్ మెరిట్‌ను అనలైజ్ చేయగలరు… ఈటీవీలో పాడుతా తీయగా ఎప్పుడో తన ప్రాధాన్యం, ఆకర్షణ కోల్పోయింది… జీతెలుగులో వచ్చే సరిగమపలో సంగీతం తక్కువ… ఇతరత్రా వేషాలు ఎక్కువ… చిరాకు కలుగుతోంది… అదీ సంగతి… ముఖ్యంగా బెస్టాఫ్ లక్ శృతి, యుతి, సౌజన్య అండ్ సాయి వైష్ణవి… మరీ ముఖ్యంగా సాయి వైష్ణవి…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions