.
గతం వేరు… ఈటీవీ తక్కువ ఖర్చుతోనే పలు రియాలిటీ షోలను నడిపించేది, మంచి రేటింగ్స్ కూడా వచ్చేవి… తరువాత క్రమేపీ భ్రష్టుపట్టిపోయాయి… ఉదాహరణకు సుమ అడ్డా… కేవలం సినిమాలు, సీరియళ్ల ప్రమోషన్లకు పరిమితమై… మొనాటనస్ సుమ టాకింగు, యాక్టింగుతో రేటింగుల్లో రోజురోజుకూ పాతాళం బాట…
బూతులకు ప్రసిద్ధి చెందిన అశ్లీల జబర్దస్త్ సరేసరి… ఏవేవో మార్పులు అన్నారు గానీ… పెద్దగా ఉద్దరించబడిందేమీ లేదు… చివరకు పాడుతా తీయగా కూడా నానాటికీ తీసికట్టులా మారిపోయింది రేటింగుల్లో… కాకపోతే ఈరోజుకూ కాస్త చూడబుల్ ఈటీవీ రియాలిటీ షో అదే…
Ads
మొదట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ షో కాస్త భిన్నంగా ఉండేది… తరువాత దాన్నీ చెడగొట్టారు… ఎప్పుడో ఓ మెరుపు వంటి స్కిట్ కనిపిస్తుంది… అలాంటిదే ఈరోజు అన్నాచెల్లెళ్ల బంధం మీద నూకరాజు, వర్ష చేసిన స్కిట్… రక్షాబంధన్ సందర్భంగా చేశారు…
నిజానికి నూకరాజు కామెడీ బాగానే చేస్తాడు… కానీ తనలో అన్ని ఉద్వేగాలూ పోషించగల నటుడు ఉన్నాడని ఈ స్కిట్ ద్వారా నిరూపించుకున్నాడు… ప్రత్యేకించి వర్ష… ఈ టీవీ సీరియల్ నటి ఈటీవీ ప్రోగ్రాముల్లోకి వచ్చాక రకరకాలుగా ఆమెను ఓ వెగటు కేరక్టర్‌గా బదనాం చేస్తూ వస్తున్నారు… (ఈమధ్య బిగ్‌టీవీలో కిస్సిక్ టాక్స్ బాగానే హోస్ట్ చేస్తోంది ఈమె…)
రష్మి, సుధీర్‌లాగే… వర్ష, ఇమాన్యుయేల్ నడుమ లవ్ ట్రాక్ పాపులర్ చేయాలనుకున్నారు గానీ, కాలేదు… రష్మి- సుధీర్ జంట పాపులారిటీ వేరు… తరువాత ఇమాన్యుయేల్ కూడా సుధీర్‌లాగే ఈటీవీని వదిలేసి పోయాడు గానీ వర్ష అక్కడే ఉంది…
పర్టిక్యులర్‌గా ఈరోజు స్కిట్‌లో బాగా నటించింది… ఈ షోలు గాకుండా ఆమె టీవీ సీరియళ్లలోనే అవకాశాలు వెతుక్కుంటే మరింత రాణిస్తుంది… ఒక దశలో నూకరాజు, వర్ష నటన కంటతడి పెట్టిస్తుంది… గెస్టుగా వచ్చిన రాజీవ్ కనకాల తన సోదరిని గుర్తుతెచ్చుకుని అక్కడే ఏడ్చేశాడు… తన సోదరి వచ్చి రాఖీ కడుతున్నట్టు ఎఐ వీడియో క్రియేట్ చేసి చూపడం కూడా బాగుంది…
నూకరాజు, వర్ష స్కిట్ చూస్తూ అక్కడున్న ప్రతివాళ్లూ ఎమోషనల్ అయ్యారు… గెస్టుగా వచ్చిన వర్ష బొల్లమ్మ కళ్ల నుంచి కూడా నీళ్లు… మరికొందరు కూడా… ఎవరో గానీ దర్శకుడు సక్సెస్‌ఫుల్… ఇలాంటివి కదా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడూ ప్రజెంట్ చేయాల్సింది… పొరపాటున హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఉంటే చాలు… ఆ షో ఎటెటో పోతుంది…!! (ఈటీవీ విన్‌లోనో లేదా ఎలాగూ యూట్యూబులో పెడతారు కదా, అందులోనో చూడొచ్చు)…
Share this Article