మళ్లీ అక్కడికే వస్తున్నాం… గ్రాఫిక్స్ లేక ఇక ఇండియన్ సినిమా ఏదీ రాదా..? మరో అదనపు ప్రశ్న ఉండనే ఉంది… అసలు గ్రాఫిక్స్ పేరిట చూపించబడుతున్న వందల కోట్లు ఏమవుతున్నయ్..? ఎందుకంటే..? తెలుగులో తోడేలు సినిమా రిలీజైంది… ఇది వరుణ్ ధావన్ తీసిన భేడియా సినిమా… డబ్ చేశారు, తెలుగులో వదిలారు… తప్పేమీ లేదు, ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా…
నిజం చెప్పాలంటే ఇన్నేళ్లూ ఏదో సాదాసీదా పాత్రలతో టైంపాస్ కెరీర్ రన్ చేసిన వరుణ్ ధావన్ ఈ సినిమా కోసం కష్టపడ్డాడు… తొలిసారిగా నటన ఎంత కష్టమైన పనో అర్థమైంది తనకు… ప్రత్యేకించి మనిషి తోడేలుగా మారే క్రమంలో ఒక్కో అవయవం మారే విధానం, తరువాత మళ్లీ మనిషిగా మారడం, హావభావాలు… అన్నీ దర్శకుడు బాగా చిత్రీకరించాడు… కండరాలను చీల్చుకుంటూ తోడేలు బయటకు రావడంతో.. శరీరభాగాలు ఒక్కొక్కటిగా మారడం.. అతీత శక్తులు… వాసన పసిగట్టటం.. చిన్న చిన్న శబ్ధాలు కూడా వినబడటం… కాళ్లు, చేతులతో నడవడం.. శాకాహారి నరమాంసం తింటూ వాళ్ల రక్తం తాగి.. తెల్లారేసరికి మళ్లీ మనిషిలా మారి నొప్పితో బాధపడే సన్నివేశాల్లో వరుణ్ ధావన్ జీవించేశాడు.
ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు… అందులోనే నటీనటులు, దర్శకుడు, ఇతర ముఖ్యుల రెమ్యునరేషన్లు, చిత్రీకరణ ఖర్చు ప్లస్ గ్రాఫిక్స్ ఖర్చు… అంటే గ్రాఫిక్స్‌కు మహా అంటే 20, 30 కోట్లు కూడా ఖర్చు కాలేదు… పైగా దర్శకుడు తనకు కావల్సిన రీతిలో క్రియేటివ్‌గా వర్క్ చేయించుకున్నాడు… మనం చెపుకున్నాం కదా… హనుమాన్ సినిమా కూడా అంతేనని… ఎవరైనా సరే హాలీవుడ్ నిపుణులతో చేయించుకుంటున్న పనే కదా… మరి తక్కువ ఖర్చుతో వీళ్లు ఎలా చేయించుకుంటున్నారు… కొందరు వందల కోట్లు అంటూ మనకు చెవుల్లో పూలు ఎలా పెడుతున్నారు..?
Ads
ఈ సినిమాకు వస్తే పెద్ద స్క్రీన్, త్రీడీలో చూడగలిగితే ఆ ఎక్స్‌పీరియెన్స్ డిఫరెంటుగా ఉంటుంది ఈ కామెడీ హారర్ మూవీ… ఆ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్, ఆ బీజీఎం మనల్ని కాసేపు అలరిస్తాయి… కథదేముంది..? అరుణాచల్‌ప్రదేశ్‌లోని దట్టమైన అడవులుంటే జిరో ఏరియాలో ఓ రోడ్డు వేయాలి… అదీ టాస్క్… ఇద్దరు స్నేహితులతో కథానాయకుడు వెళ్తాడు… ఓ స్పెషల్ రోజు ఓ తోడేలు కాటుకు గురవుతాడు… హీరోయిన్ కమ్ వెటర్నరీ డాక్టర్ కృతిసనన్ ఏదో వైద్యం చేస్తుంది… అదేమో వికటిస్తుంది…
రోడ్డును స్థానికులు వ్యతిరేకిస్తుంటారు… ఇదీ నేపథ్యం… పగలంతా మామూలు మనిషి, రాత్రయితే తోడేలు… దీన్ని పర్యావరణ పరిరక్షణ, దట్టమైన అరుణాచల్ ప్రదేశ్ అడవుల సౌందర్యం అనే కోణంలో మాత్రమే చూడలేం… అసలు వాళ్లను మనం ఇండియన్లుగానే గుర్తించడం లేదు… అలాంటివి కొద్దిగా కనెక్టవుతాయి… కానీ ఓవరాల్‌గా కథలో కథనంలో కొత్తదనం ఏమీ ఉండదు… మనిషి- తోడేలు అనే ఫిక్షన్ మాత్రమే కొత్తది…
పెద్దగా ఎమోషన్స్ ఉండవు… కాకపోతే ఈ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ప్లస్ బాగా పండిన కామెడీతో దర్శకుడు ఎక్కడా బోర్ కొట్టకుండా కథను క్లైమాక్స్ దాకా తీసుకెళ్తాడు… వరుణ్ ధావన్‌కు నిజంగానే గుర్తుండిపోయే సినిమా… తెలుగులో రిలీజ్ చేయాలన్న అల్లు అరవింద్ నిర్ణయం కూడా అభినందనీయమే… అవునూ, మనిషి తోడేలుగా మారడం గాకుండా ఓ సింహంగా మారేలా కథ ఉంటే ఎలా ఉండేది సినిమా… ఇంకా అదిరిపోయేది..!
Share this Article