Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దాశరథి ఆల్ టైమ్ సూపర్ హిట్ … తనివి తీరలేదే, మనసు నిండలేదే…

May 26, 2024 by M S R

Subramanyam Dogiparthi……    శుభ , హలం ఇద్దరికీ ఇదే మొదటి సినిమా . శుభ ఉదాత్త పాత్రలకు పెట్టింది పేరయితే , వాంప్ పాత్రలకు డాన్సర్ పాత్రలకూ హలం చిరునామా . ముత్యాలముగ్గు సినిమాలో హలం డైలాగ్ వీర హిట్టయింది . వేసిన చోట వేయవుగా డ్యూటీ వంటి డైలాగ్ అది . By the way , 1972 లో ఇదే రోజు అంటే మే 26 న రిలీజయింది ఈ గూడుపుఠాణి సినిమా .

మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకు డైలాగులు వ్రాసింది టెంపోరావు . ఆ రోజుల్లో డిటెక్టివ్ నవలల రచయితగా పాపులర్ . డిటెక్టివ్ నవలల్ని చిన్నప్పుడు తెగ చదివేవాడిని . మా నాన్నగారు ఓరోజు వాయించేసాక మానేసా . లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు . కృష్ణ నటన కూడా బాగుంటుంది . అందంగా కూడా కనిపిస్తారు .

అప్పట్లో కృష్ణ ఎక్కువగా ఇలాంటి థ్రిల్లర్స్ అటెంప్ట్ చేసేవారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌ను ఆస్తి కోసం హతమార్చడానికి జరిగే ప్రయత్నాల నుంచి హీరో కాపాడుతుంటాడు… ఎవరు ప్రయత్నిస్తున్నదీ సినిమా చివరలో తెలుస్తుంది .

Ads

ఈ సినిమా కమర్షియల్ గా ఎంత సక్సెస్ అయిందో నాకు గుర్తు లేదు . యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వంలోని పాటలు బాగా హిట్టయ్యాయి . ముఖ్యంగా తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధం పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . దాశరథి రాశారు . మిగిలిన పాటలు కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా స్వాగతం , నీతో ఏదో పని ఉంది అది నీకే బోధ పడుతుంది , పగలూ రేయి పండగా జలసా సరదా వేడుక కూడా చాలా బాగుంటాయి . పాటలన్నీ యస్ పి బాల సుబ్రహ్మణ్యం , సుశీలలే పాడారు . అప్పటికే బహుశా ఘంటసాల వారు పాడటం తగ్గించేసినట్లు ఉన్నారు .

నాగయ్య , మిక్కిలినేని , ప్రభాకరరెడ్డి , రాజబాబు , జగ్గారావు , ఛాయాదేవి ప్రభృతులు నటించారు . కాలేజి రోజుల్లోనే చూసా . యూట్యూబులో ఉంది . కృష్ణ అభిమానులకు బాగా నచ్చుతుంది . హలం మొదటి సినిమా చూడకపోతే ఎలా ! వాచ్ లిస్టులో పెట్టుకుని ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయండి . ఈలోపు పాటల వీడియోలు చూసేయండి . కూస్తంత కళాపోషణ ఉండాలిగా ! #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ వసూళ్లు తప్ప విలువల్లేవు – నేనిక నటించను – ఇక చాలు ’’
  • ఎదుటివారి ప్రశంస మనకు మత్తు – అందుకే ఆడంబర ప్రదర్శనలు
  • అగడు పడ్డట్టు తెగ మింగారు! ఎవడి పాలైందిరో నా తెలంగాణ !!
  • సౌదీ మరింత చిక్కుల్లోకి! రెండు జెట్ ఫైటర్లను కూల్చిన హుతీలు!!
  • 20 వేల ఎకరాలు ఏం సరిపోతాయి ? ఇంకా ఇంకా కావాలి !!
  • పెళ్లానికి తెలీకుండా లవర్‌తో జాలీ విదేశీ ట్రిప్‌ ప్లాన్… కానీ..?
  • ‘పంచనామా’ కాదు… పాత యాంకర్ ఉదయభాను ఇజ్జత్ పంచనామా!
  • రాముడికన్నా లక్ష్మణుడు కాస్త పొడుగు ఉండకూడదా ఏం?!
  • దానం అనర్హత కేసులో సుప్రీంకోర్టుకు టీబీజేపీ!
  • హార్వర్డ్ హైదరాబాద్‌కు..! ఇక విదేశీ విద్యకూ భాగ్యనగరం!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions