.
Subramanyam Dogiparthi…. చిరంజీవి- కోదండరామిరెడ్డి జోడీలో వచ్చిన మరో హిట్ సినిమా 1984 ఫిబ్రవరిలో విడుదలయిన ఈ గూండా సినిమా …
11 సెంటర్లలో వంద రోజులు ఆడింది . వంద రోజుల పండుగ మద్రాసు అడయార్ గేట్ హోటల్లో జరిగింది . ఈ సినిమా రొటీన్ పగ , కక్షసాధింపు వంటి కధాంశంతో కాకుండా సామాజిక నక్సలైట్లను శిక్షించే కధాంశం .
ఈ కధను గిరిజ శ్రీభగవాన్ అనే కలం పేరు కలిగిన తాడంకి వెంకట లక్ష్మి నరసింహారావు వ్రాసారు . ఈయన ఎక్కువగా డిటెక్టివ్ నవలలు వ్రాస్తారు . ఈ సినిమా కొరకు ఈ కధనుచిక్కగా నేసారు . సుమారు యాభై డిటెక్టివ్ నవలల్ని వ్రాసారు .
Ads
ఈయన నవలల్లో డిటెక్టివ్ పేరు డిటెక్టివ్ నర్సన్ . ఒక్కో రచయితకు ఒక్కో డిటెక్టివ్ ఉండేవారు . ఇప్పుడు ఇంకా డిటెక్టివ్ నవలలు తెలుగులో వస్తన్నాయా !? చిన్నప్పుడు చదివి మా నాన్నగారి చేత బాగానే చివాట్లు తిన్నాను… పేర్లు గుర్తు రావడం లేదు.. దీని తర్వాత మాత్రం చిరు నటించిన రుస్తుం, చాన్నాళ్ల తర్వాత మహేష్ బాబు నటించిన ఎస్ నేనంటే నేనే చిత్రాలకూ కథలు సంధించారు…
ఈ కధకు స్క్రిప్ట్ ప్లే , దర్శకత్వాన్ని కోదండరామిరెడ్డి నిర్వహించారు . నిజానికి ఈ సినిమాకు గూండా కరెక్ట్ టైటిల్ కాదేమో ! సినిమా ప్రారంభంలో గూండాలకు గూండా అయినా తర్వాత బాధ్యత కల కొడుకుగా , ప్రేమికుడిగా , పౌరుడిగా హీరో పాత్ర ఉంటుంది .
బహుశా ఆకర్షణీయంగా, క్యాచీగా ఉంటుందని ఈ టైటిల్ని ఎంచుకొని ఉంటారు . సక్సెస్ అయింది కూడా . 1984 లో వచ్చిన పది చిరంజీవి సినిమాల్లో ఒకటి ఇది . సినిమా అంతా చిరంజీవే . ఫైట్లు , డాన్సులు ప్రేక్షకులను ముంచెత్తుతాయి …
సినిమాలో అయిదు పాటలు ఉంటే అన్నీ చిరంజీవి మీదనే . నాలుగు రాధతో డ్యూయెట్లు , ఒకటి సిల్క్ స్మితతో . అన్నీ అదరగొట్టేస్తారు . నృత్య దర్శకుడు సలీంను , పాటల్ని వ్రాసిన వేటూరి వారిని , సంగీతాన్ని అందించిన చక్రవర్తిని , పాడిన బాలసుబ్రమణ్యాన్ని , సుశీలమ్మను , శైలజను అభినందించాలి . సినిమా విజయానికి చిరంజీవితో పాటు వీరందరూ కారణమే .
మొదటగా చెప్పాల్సింది చిరంజీవి , సిల్క్ స్మితల డాన్సే . గుండెలు తీసిన బంటూ అంటూ సాగుతుంది మసాలా సాంగ్ . చిరంజీవిని పెంచిన గూండా కూతురిగా నటిస్తుంది స్మిత ఈ సినిమాలో . మిగిలిన నాలుగూ రాధతోనే . అందగత్తె ఆటకేమొ వందనాలు , కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ , నా గీతం నీ సంగీతం నా నాట్యం నీకుల్లాసం , నీ చిలిపి కళ్ళ మీద పాటలు నాలుగూ డ్యూయెట్లే .
రాధతో చిరంజీవికి చాలా హిట్లున్నాయి, స్టెప్పుల్లో మంచి కెమిస్ట్రీ వీళ్లది… ఈ సినిమా నుంచే ఈ కాంబో స్టార్ట్ అనుకుంటా…
ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , అన్నపూర్ణ , వరలక్ష్మి , రామదాసు , తమిళ నటుడు రాజీవ్ , హేమసుందర్ , రావు గోపాలరావు-అల్లు రామలింగయ్య జంట , సుత్తి జంట , ప్రభృతులు నటించారు . One more action & emotion-filled , family-centric , musical entertainer .
చిరంజీవి అభిమానులకు బాగా నచ్చే సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని వారికి చూడబుల్ సినిమాయే . అభిమానులు ఎన్ని సార్లయినా చూస్తారు కదా !! చూసేయండి… #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగింది చిరంజీవి క్లైమాక్సులో రైలు కింద వేలాడుతూ, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లి బాంబుల్ని తీసేయడం, రైలు మీద ఫైట్లు… అప్పటికే ముసలి హీరోల సుతారం ఫైట్లను (అంటే తమలపాకు ఫైట్లు) చూసీ చూసీ చిరంజీవి బాపతు సాహసాల్ని చూసి యూత్ అట్రాక్టయ్యారు… చిరంజీవిని అలా ఇండస్ట్రీలో బలంగా నిలబెట్టినవి ఇదుగో ఈ స్టెప్పులు, ఫైట్లే… అందుకే ఈరోజుకూ వాటినే ఆశ్రయిస్తాడు, అది వేరే సంగతి…… ముచ్చట
Share this Article