మొన్నామధ్య కేసీయార్ కొండగట్టు పోయాడు… వంద కోట్లు ఇచ్చేస్తున్నా అన్నాడు… అవసరమైతే ఎన్ని వందల కోట్లయినా పెట్టేద్దాం అన్నాడు… సూపర్ టెంపుల్‌గా డెవలప్ చేద్దాం అన్నాడు…. కొన్ని డబ్బులు కూడా రిలీజ్ అయిపోయినట్టున్నయ్… ఒక్కసారి సీన్ కట్ చేసి, ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం…
భద్రాచలం గుడికి (భద్రాద్రి అంటున్నారుట ఇప్పుడు, ఈ స్థలాల పేర్ల మార్పిడి ఏమిటో అర్థం కాదు, యాదగిరిని యాదాద్రి అనీ, భద్రాచలాన్ని భద్రాద్రి అనీ… ఇదో పైత్యం… ఇంకా నయం కొండగట్టుకు కొండాద్రి అనీ, వేములవాడకు వేమాద్రి అని పేర్లు మార్చలేదు…) ఏడేళ్ల క్రితం కేసీయార్ 100 కోట్లు ఇస్తానన్నాడు… 2015, 2016 సంవత్సరాల్లో వెళ్లాడు, తరువాత డుమ్మా… బడ్జెట్‌లో కూడా కేటాయించి నిధులు రిలీజ్ చేయలేదు… గత ఏడాది ముంపు బాధితుల పరామర్శకు వెళ్లి, గుడికి పోకుండానే వాపస్ పోయాడు… ఎందుకు రాముడంటే తనకు అంత కోపం..?
ఆమధ్య అయోధ్య గుడికి చందాలు వసూలు చేస్తుంటే బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) నాయకులు అవాకులూ చవాకులూ పేలారు… భద్రాచలంపై తెగ ప్రేమ కురిపించారు… జనం పట్టించుకోలేదు, విరివిగా విరాళాలు ఇచ్చారు… మళ్లీ ఇప్పటిదాకా ఒక్కడైనా భద్రాచలం మీద మాట్లాడితే ఒట్టు…
Ads
అన్నింటికన్నా ఘోరం నిజం నవాబులు కూడా రాములవారి పెళ్లికి ముత్యాల తలంబ్రాలు పంపించేవారు… ఇప్పుడూ పంపిస్తున్నారు, కాకపోతే ఆ తలంబ్రాల ఖర్చు మాత్రం దేవస్థానానిదే… ఆహా, అద్భుత వితరణ… అబ్బురపరిచే భక్తి… ఆశ్చర్యం కలిగించే సంప్రదాయం… ఇంతా చేస్తే నవమినాడు ముత్యాల తలంబ్రాలకు, పట్టువస్త్రాలకు అయ్యే ఖర్చు 15 వేలు మాత్రమే… అవి కూడా ఇవ్వదు ఈ సర్కారు… పైగా గుడి మీద పెత్తనం సరేసరి…
చివరకు ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు కూడా చందాలు కోరుతున్నది దేవస్థానం… ఇదే ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది… ఏయే పనులకు ఎంత ఖర్చు అవుతుందో కూడా చెబుతూ కరపత్రాలు ముద్రించారు… తక్కువలో తక్కువ కోటి రూపాయలు కావాలి… ఈమాత్రం కూడా ప్రభుత్వం ఇచ్చే స్థితి లేదా..? పైగా కేసీయార్‌కు వైష్ణవాలయాలు అంటే ప్రీతి అంటారు… మరి రాముడు విష్ణు అవతారమే కదా… యాదాద్రికి అంత ఖర్చు పెట్టిన సర్కారుకు పాపం భద్రాచలం రాముడిపై ఈ శీతకన్ను ఏమిటి..?
ఏమో, పరిస్థితి ఇలాగే కొనసాగితే… ఇక పెళ్లికి ప్రభుత్వం సమర్పించాల్సిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు కూడా భక్తుల నుంచి విరాళాలు అడుగుతారేమో.. పోనీ, మీ పెత్తనం నుంచి ఆ గుడిని విముక్తం చేయండి సార్… ఎవరైనా ధర్మాత్ములను ధర్మకర్తలుగా పెట్టండి… వాళ్ల తిప్పలు వాళ్లే పడతారు..!!
Share this Article