ప్రజాశక్తిలో ఓ సింగిల్ కాలమ్ బాక్స్ కనిపించింది… సీపీఎం సాగించిన పోరాటం, ప్రయత్నంతోనే కరెంటోళ్లు ఇన్నాళ్లూ వసూలు చేసిన వేల కోట్లను మళ్లీ వాపస్ ఇస్తున్నారు అనేది వార్త… ఇది తమ పోరాట ఫలితమే అని ఓన్ చేసుకుంటున్నారు… తప్పేమీ లేదు, అర్హులే… నిజం, వాళ్లే ఆ ట్రూఅప్ చార్జీల వెంట పడ్డారు… అందుకే ఈ ఆందోళనతో ఏమొస్తుంది, ఈ పోరాటంతో ఏమొస్తుంది అనే నిస్పృహ అక్కర్లేదు… ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు, వ్యవస్థల మీద పట్టు వదలని పోరాటాలు సాగిస్తే, ఒకటో అరో సక్సెసవుతయ్… కావాలి, లేకపోతే ఇక సమాజంలో చైతన్యమే మిగలదు… నిజానికి మన మీడియాకు సెన్సేషన్, జనాన్ని భయానికి గురిచేసే వార్తలే కావాలి… అదొక ఉన్మాద పాత్రికేయం… రాజకీయ నాయకుల అజ్ఞానపు సొల్లు మాటలకి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా, పాజిటివ్ వార్తల్ని ఇవ్వదు… మరీ టీవీలు అయితే బీభత్సం, భయానకం…
అసలు ప్రభుత్వం తను వసూలు చేసిన వేల కోట్ల ఛార్జీలను మళ్లీ జనానికి వాపస్ ఇవ్వడం అనేది మంచి వార్త… ఇలాంటివి అత్యంత అరుదు… చాన్స్ దొరికితే రకరకాల దొంగమార్గాల్లో చావుదెబ్బలు తీసే కరెంటోళ్లు డబ్బులు వాపస్ ఇస్తున్నారు… ఆహా… చదువుతుంటేనే అదొక అపురూపం… నిజానికి ట్రూ అప్ చార్జీలు అనేవే అబ్సర్డ్, అప్పట్లో విద్యుత్తు చట్టంలో ఈ క్లాజును ఎవరూ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు… గతంలో మాకు అనుకోని ఖర్చులు తగిలాయ్, ఇప్పుడు ఆ ఖర్చంతా తాజా బిల్లుల్లో వసూలు చేసుకుంటాం అనే క్లాజే ఫూలిష్… అనుకోకుండా బొగ్గు ధరలు పెరిగినయ్, కరెంట్ ధరలు పెరిగినయ్, మా ఖర్చులు పెరిగినయ్, ఇప్పుడు అదంతా కక్కు అంటే ఎలా..? (ఆ సబ్జెక్టులోకి ఇక్కడ ఇంకా లోతుల్లోకి పోలేం…)
Ads
నిజానికి ట్రూఅప్ ఛార్జీలకు అనుమతించాలంటే రెగ్యులేటరీ కమిషన్‌కూ ఓ నిర్దేశిత పద్ధతి ఉంది… అదేమీ పాటించనట్టుంది, దాంతో ఇరకాటంలో పడింది… వసూలు చేసిన చార్జీలను జనానికి వాపస్ ఇచ్చేయండి అనేసింది… అలా ఈ ట్రూఅప్ చార్జీలు వాపస్ వస్తున్నయ్… ఎస్, ఈ విషయంలో సీపీఎం ప్రయత్నం అభినందనీయం… ఈ చార్జీలు, చట్టంలో ఏముందో అధ్యయనం చేసి, కొందరు సరైన పాయింట్లు పట్టుకుని, కోర్టు దాకా వెళ్తే, మరికొందరు కమిషన్ వెంటపడ్డారు… ఇక్కడ మరో విషయమూ చెప్పుకోవాలి… ప్రతి అంశానికీ నాలుగు జెండాలు పట్టుకుని, బజారుకొచ్చి, రోడ్లు బ్లాక్ చేసి, గొంతులు చించుకుంటే ఫలితం ఉండదు… ఇదుగో, ఇలా… కీలెరిగి వాతలు పెడుతూ, ఎక్కడ ఏ పాయింట్‌తో పోరాడాలో తెలిసి కదలడమే కరెక్టు… ట్రూఅప్ చార్జీల వాపస్ చెబుతున్న నీతి ఇదే…
Share this Article