Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమే… మనకు యానిమల్స్ కావాలి… రియల్ సోల్డర్స్‌ను మనం చూడం…

December 14, 2023 by M S R

ఎంత బాధాకరం….! ఇవ్వాళ యూత్ అంత ఎగబడి చూస్తున్న Animal మూవీ రిలీజ్ అయినరోజే… సాహసోపేత భారత సైనికుడు, జాతీయ హీరో ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా జీవిత చరిత్ర మూవీ శాం బహదూర్ రిలీజ్ అయ్యింది… కానీ దీనికి ప్రచారం లేదు… చూడమని చెప్పేవారు లేరు… మానిక్ షా గారి సాహసోపేత ఫైటింగ్ వల్లనే పాకిస్థాన్లో బెంగాలీల మీద జరుగుతున్న హింసను ఆపడానికి పాకిస్థాన్ ను విడదీసి బంగ్లాదేశ్ ఏర్పడ్డది… షా గారు మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు… ఇందిరాగాంధీ గారిని ఎదిరించి ఆమే చెప్పినప్పుడు కాకుండా తాను అంచనా వేసిన రోజు పాకిస్థాన్ తో యుద్ధం చేసి గెలిచిండ్రు… దేశం కోసం ఎన్నో అవమానాలు పడి.. చివరికి హీరో గా బయటపడ్డాడు… ఇంతటి గొప్ప వీరుడి సైన్మా కు ప్రచారమే లేదు…!
.
ఇదీ ఓ మిత్రుడి వాల్ మీద చూసిన పోస్టు… ప్రచారం లేదు గానీ, మరీ ఘోరంగా ఏమీ లేవు వసూళ్లు… దేశంలోని పలుప్రాంతాల్లో ప్రచారం చేసి, పాన్ ఇండియా తరహాలో నాలుగైదు భాషల్లో విడుదల చేసి ఉంటే ఇంకా బాగుండేది… మానెక్ షా ఆ గౌరవానికి అర్హుడు కూడా… 13 రోజుల్లో వరల్డ్ వైడ్ 85 కోట్లు వసూలు చేసింది సినిమా… నిజానికి ఇంకా మంచి ఎఫిషియెంట్ టీం చేతిలో పడి ఉంటే ఈ కథ అదిరిపోయే బయోపిక్ అయ్యేదేమో… అసలు ఎంత మందికి ఈయన తెలుసు..? ఒక్కసారి ‘ముచ్చట’ పాత స్టోరీలోకి వెళ్దామా… ఆయన గొప్పదనం అర్థం కావడానికి…


sam bahadur



By…. పార్ధసారధి పోట్లూరి…..   ‘Indira Gandhi took 32 bullets for country but Government had no mention of her at Delhi event,’ Rahul Gandhi. ఇది రాహుల్ ఉవాచ. 1971 లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా పాకిస్తాన్ మీద మీద భారత్ సాధించిన విజయం మీద గోల్డెన్ జుబ్లీ ఉత్సవాల సందర్భంగా డిల్లీలోని ‘సైనిక్ విజయ్ సమ్మాన్ దివస్ ‘ లో ప్రధాని మోడీ ఇందిర పేరుని ప్రస్తావించలేదు అని వాపోతున్నాడు రాహుల్. ఎందుకు ప్రస్తావించాలి ? ఎందుకు ప్రస్తావించకూడదో నేను చెబుతాను.

1. 1971 లో తూర్పు పాకిస్తాన్ లో [బంగ్లాదేశ్ ] లో హింస చెలరేగింది. ఉర్దూని జాతీయ భాషగా అంగీకరించని తూర్పు పాకిస్తాన్ ప్రజలు తిరగబడడంతో సైన్యం అణిచివేత మొదలుపెట్టింది. దాంతో బంగ్లా ప్రజలు పొరుగునే ఉన్న అస్సాంలోకి శరణార్దులుగా రావడం మొదలుపెట్టారు. రోజురోజుకి సంఖ్య పెరిగిపోతుండడంతో అప్పటి ప్రధాని ఇందిర ఫీల్డ్ మార్షల్ మానెక్ షాని [Field Marshal Sam Hormusji Framji Jamshedji Manekshaw] పిలిపించింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ :

Ads

ఇందిర: శరణార్దుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. మనం ఏమీ చేయలేమా ?

మానెక్ షా : అంటే సైన్యం జోక్యం చేసుకోవాలి అని అర్ధమా? అది యుద్ధానికి దారి తీస్తుంది .

ఇందిర; ఫరవాలేదు! మీరు సిద్ధంగా ఉన్నారా ?

మానెక్ షా :లేదు. ఇప్పుడు కుదరదు. నా ఆర్మ్‌డ్ డివిజన్స్ లో ఒకటి ఝాన్సీ బబిత ఏరియాలో ఉంది, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నాకు సమయం కావాలి. ప్లాన్ చేయాలి. ట్రైనింగ్, ప్రిపరేషన్, ట్రూప్స్ కి కావాల్సిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నిత్యావసర సరుకులు, ఆర్టిలరీ, యుద్ధ టాంకులు ఇలా చాలా ఉన్నాయి సిద్ధం చేసుకోవడానికి. అదీ కాక మరొక వారం రోజుల్లో వర్షాలు మొదలువుతాయి. అస్సాం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిన్న చిన్న నదులు కూడా సముద్రాల్ని తలపిస్తాయి. ఒకవైపు నుండి చూస్తే ఇంకో వైపు అసలు ఏమీ కనపడే స్థితి ఉండదు. అలాగే వాతావరణం కూడా మన ఎయిర్ ఫోర్స్ కి సహకరించదు. కింద ఉంటేనే ఏమీ కనపడదు, అలాంటిది ఆకాశంలో పైలట్లకి ఏమీ కనపడదు కింద. ఎయిర్ ఫోర్స్ సహకారం లేకుండా ఆర్మీ ఒక్కటే ఏమీ చేయలేదు. మీరు కనుక యుద్ధానికి ఆదేశిస్తే నా రాజీనామా ఇప్పుడే ఇచ్చేస్తాను. ఎందుకంటే ఓడిపోయే యుద్ధం నేను చేయలేను కనుక. నన్ను కాదని వేరే వాళ్ళని పంపించినా 100% ఓడిపోతాము మనం.

bangla

ఇందిరకి తన మాట కాదన్నందుకు కోపం వచ్చింది కానీ శాం మానెక్ షా పనితీరు ఎలా ఉంటుందో తనకి తెలుసు కనుక ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. వర్షాలు తగ్గగానే ఫీల్డ్ మార్షల్ శాం మానెక్ షా పక్కా ప్లాన్ తో తూర్పు పాకిస్తాన్ మీద దాడిచేసాడు. 13 రోజుల్లోనే పాకిస్తాన్ ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడు. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోవడానికి కారణం ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్ షా మాత్రమే ! ఇంకొన్ని విషయాలు…

1. శామ్ మానెక్ షా మరియు యాహ్యాఖాన్ లు ఇదరు కూడా బ్రిటీష్ ఇండియా సైన్యంలో కలిసి పనిచేసిన వారే ! విభజన తరువాత యాహ్యాఖాన్ పాకిస్థాన్ సైన్యంతో వెళ్ళిపోయాడు. శామ్ మానెక్ షా శక్తి,సామర్ధ్యం, యుద్ధ వ్యూహాలు ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తి యాహ్యాఖాన్.

2. 1971 నాటికి యాహ్యాఖాన్ పాకిస్తాన్ నియంత మరియు సైనిక జెనరల్. శామ్ మానెక్ షా డిసెంబర్ 9వ తేదీన 1971 లో పాకిస్తాన్ నియంతని ఉద్దేశించి ఒక మెస్సేజ్ పంపాడు: భారత సైన్యం మిమ్మల్ని చుట్టుముట్టింది. మీరేమీ చేయలేరు. మీ ఎయిర్ ఫోర్స్ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. బంగ్లా ముక్తి వాహిని మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. చిట్టగాంగ్, చల్నా, మనగ్లా పోర్టులని బ్లాక్ చేసాము. మీకు బయటి నుండి ఎలాంటి సహాయము అందే ప్రసక్తే లేదు. మీరు బంగ్లా ప్రజల మీద చేసిన క్రూర హత్యలు, అత్యాచారాల మీద చాలా కోపంగా ఉన్నారు. మీరు కాలయాపన చేస్తే మా సైన్యం కూడా రక్షించలేదు మీ సైనికులని బంగ్లా ప్రజల నుండి. ఎందుకు అనవసరంగా ప్రాణాలని బలి పెడతారు. లొంగిపొండి. వెనక్కి వెళ్లి మీ భార్యా పిల్లలతో సుఖంగా ఉండండి… ఇదీ ఆ మెసెజ్….

bangla

ఈ మెసేజ్ యాహ్యాఖాన్ మీద బాగా పనిచేసింది. 93 వేల మంది సైనికుల ప్రాణాలని బలి పెట్టేకంటే లొంగిపోవడమే మేలని బంగ్లాదేశ్ లోని సైనిక కమాండర్ లకి ఆదేశాలు ఇచ్చాడు యాహ్యాఖాన్. ఎందుకంటే యాహ్యాఖాన్ కి శాం మానేక్ షా గురించి బాగానే తెలుసు. ఇటు భారత ప్రభుత్వ ప్రమేయం కంటే ఫీల్డ్ మార్షల్ మానెక్ షా హెచ్చరిక బాగా పనిచేసింది. ఒకవేళ భారత ప్రభుత్వ అధికారులు కనుక హెచ్చరిక చేసి ఉంటే మాత్రం యాహ్యాఖాన్ తన దళాలని పోరాడమనే చెప్పేవాడు.

౩. ఆ విధంగా పాకిస్తాన్ లొంగిపోయింది, 93,000 మంది పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా భారత్ చేతిలో చిక్కారు. కొద్ది వారాల తరువాత జుల్ఫీకర్ ఆలీ భుట్టో పాకిస్తాన్ ప్రధానిగా పదవీ స్వీకారం చేసిన తరువాత ఇందిరతో రాయబారాలు చేశాడు.

4. ఇందిర, భుట్టోల మధ్య సిమ్లా శాంతి ఒప్పందం కుదిరింది. బేషరతుగా 93,000 మంది పాకి సైనికులని విడిచిపెట్టింది ఇందిర. కనీసం మన సైనికులు పాకిస్తాన్ చేతిలో యుద్ధ ఖైదీలుగా ఉన్నారని కానీ, వాళ్ళని వదిలేయమని కానీ అడగలేదు ఇందిర. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ప్రస్తావన లేనే లేదు ఆ ఒప్పందంలో. అసలు 93 వేల మంది శత్రు సైనికులు మన దగ్గర యుద్ధ ఖైదీలుగా ఉన్నప్పుడు ముందు అడగాల్సింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి. అసలు ఆ సమయం మళ్ళీ మళ్ళీ రాదు కానీ ఇందిర ఆ పని చేయలేదు.

5. ఇందిర, జుల్ఫీకర్ ఆలీ భుట్టోల మధ్య జరిగిన ఒప్పందాన్ని మానెక్ షా ఏమన్నాడో తెలుసా ? ‘‘పాకిస్తాన్ మనల్ని కోతిని చేసి ఆడించింది’’ అని. మనకి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జరిగిన సైనిక, ధన నష్టానికి బదులుగా ఇప్పటికీ బంగ్లాదేశ్ లో సాగుతున్నదేమిటి..? హిందువుల మీద దాడులు, బలవంతపు మత మార్పిడులు.

6. మరో పక్క ఎప్పటికయినా ప్రమాదం అని బెంగాల్ నుండి ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళే దారిలో ఉన్న చికెన్ నెక్ ప్రాంతాన్ని విస్తరించి బంగ్లాదేశ్ భూభాగం కలుపుకోమని ఇందిరకి అప్పటి సైనిక వ్యూహకర్తలు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు చికెన్ నెక్ ప్రాంతం చాలా ప్రమాదకరంగా మారింది. ఇన్ని తప్పులు చేసి బంగ్లాదేశ్ విముక్తి తన ఖాతాలో వేసుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి తప్పితే వేరే విధంగా ఉపయోగపడలేదు భారతదేశానికి.

7. 1971 లో సాధించిన విజయం కేవలం గంపగుత్తాగా ఫీల్డ్ మార్షల్ మానెక్ షా కే దక్కుతుంది. మరి నాలుగేళ్ల తరువాతే ఎమర్జెన్సీ ఎందుకు విధించింది ఇందిర ? అదే ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ సవరణ చేసి బలవంతంగా ‘india secular ‘ అనే పదాన్ని ఎందుకు పెట్టింది ?

bangla

8. ఇక రాహుల్ అన్నట్లు 32 బులెట్లు అనేది స్వయంకృతాపరాధం. పాకిస్తాన్ ISI సృష్టించిన ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎదుర్కొవడానికి భింద్రన్ వాలేని సృష్టించింది ఇందిర. భింద్రన్ వాలేకి RAW చేత శిక్షణ ఇప్పించింది. ఇదే అతి పెద్ద తప్పు. భింద్రన్ వాలేని వాడుకున్నంత సేపు అడిగినంత డబ్బు, ఆయుధాలు ఇచ్చింది. అవసరం తీరిపోగానే పక్కన పెట్టింది. తనని పావుగా వాడుకున్నది ఇందిర అని తెలుసుకొని భింద్రన్ వాలే ఎదురుతిరిగాడు. పాకిస్తాన్ ISI తో చేతులు కలిపి ఇందిరకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. భింద్రన్ వాలేని చంపమని ఆదేశాలు ఇచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సిక్కుల పవిత్ర క్షేత్రం గోల్డెన్ టెంపుల్ లో దాక్కున్నాడు భింద్రన్ వాలే. అయినా సరే గోల్డెన్ టెంపుల్ నాశనం అయినా సరే భింద్రన్ వాలేని చంపమని ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే భింద్రన్ వాలే బ్రతికి ఉంటే తన బండారం బయటపడుతుంది మరి. చివరికి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో గోల్డెన్ టెంపుల్ మీద దాడి చేసింది సైన్యం. భింద్రన్ వాలే మరణించాడు. కానీ సిక్కు సమాజం మాత్రం తమ పవిత్ర ఆలయం మీద జరిగిన దాడిని జీర్ణించుకోలేకపోయింది. దాని ఫలితమే ఇందిరకి రక్షణగా ఉన్న సిక్కులు ఇందిరని కాల్చి చంపారు. ఇందులో దేశం కోసం ప్రాణం ఇచ్చింది అనేది ఒక కోణంలో అవాస్తవం. తన తప్పులని కప్పి పుచ్చుకునే క్రమంలో చేసిన తప్పులే ఇందిరని బలిగొన్నాయి. మంచి సలహాలు ఇచ్చే వాళ్ళని పక్కనపెట్టి తన భజన చేసే వాళ్ళని సలహాదారులుగా పెట్టుకున్న ఇందిర తగిన మూల్యం చెల్లించుకుంది. నిజానికి ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలో అప్పట్లో తన కాబినెట్ లోనే ఉన్న PV నరసింహరావుని కానీ, ప్రణబ్ ముఖర్జీని కానీ సలహాలు అడగలేదు.

golden temple

9. 2008 లో ఫీల్డ్ మార్షల్ మానెక్ షా వృద్ధాప్యం వల్ల అనారోగ్యంతో ఊటిలోని హాస్పిటల్ లో చేరితే సైన్యానికి కి చెందిన తోటి జనరల్స్ ని పరామర్శించడానికి సైతం అనుమతి ఇవ్వలేదు మన్మోహన్ సింగ్ సర్కార్. మానెక్ షాని హాస్పిటల్ కి వెళ్లి యోగక్షేమాలు అడిగింది అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాత్రమే. చివరికి మానెక్ షా గారికి రావాల్సిన పాత బాకీలు 1.15 కోట్లు ఆయన చివరి రోజుల్లో చెక్ రూపంలో ఇచ్చారు. అదీ కలాం చొరవతో మాత్రమే. అంత డబ్బుని అన్ని రోజులు ఆయనకి ఇవ్వకుండా ఎందుకు ఆపినట్లు ? కనీసం ఆయన మరణించిన రోజున కానీ, ఆయన అంత్యక్రియలు జరిగిన రోజున కానీ జాతీయ పతాకాన్ని అవనతం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.

10. కృష్ణమీనన్ అనే చవట రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఆర్మీ చీఫ్ తిమ్మప్ప రిటైర్ అవగానే మానేక్ షాని పిలిచి జెనరల్ తిమ్మప్ప మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. దానికి మానెక్ షా బదులిస్తూ తోటి జెనరల్ మీద నా అభిప్రాయం ఏమిటో తెలుస్కోవాలనే కుతూహలాన్ని బట్టి చూస్తే మాలో మాకు అభిప్రాయ భేదాలు సృష్టించడానికే అనిపిస్తున్నది. మేము సోల్జర్స్ మి. మీ రాజకీయ ప్రయోజనం కోసం మాలో మాకు తగువులు పెట్టవద్దు. మీరు మా విషయాలలో జోక్యం చేసుకోనంత వరకు మేము మీ విషయాలలో జోక్యం చేసుకోం. Mind your own business and we mind our own business అని బదులిచ్చారు మానెక్ షా! ఒక రక్షణ మంత్రితో ఒక ఫీల్డ్ మార్షల్ ఇలా మాట్లాడడం భారత దేశ చరితలో అదే మొదటిసారి.

bangla

11. మానెక్ షా చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న రోజుల్లో సైనిక తిరుగబాటు జరగవచ్చు అనే వదంతులు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మరోసారి విక్రం సింగ్ హయాంలో కూడా సైనిక తిరుగుబాటు జరగవచ్చనే వదంతులు వచ్చాయి. ఇలా కాంగ్రెస్ హయాంలోనే ఎందుకు వదంతులు వచ్చాయంటారు ?

అందుకని ఇందిర ప్రస్తావన చేయలేదు. చేయకూడదు కూడా! 1971 నాటి యుద్ధ సమయానికి ఉన్న ఆయుధాలు అంతకు ముందు ప్రధాని లాల్ బహుదర్ శాస్త్రి హయాంలో కొన్నవే. గాంధీ కుటుంబం మాత్రం విమానాలలో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవచ్చు. విమానవాహక నౌకలో విహార యాత్ర చేసుకోవచ్చు. బట్టలు లండలో ఇస్త్రీ చేయించుకొని తెప్పించుకోవచ్చు. ఇందిర చెప్పుల కోసం ప్రత్యేక విమానంలో తెప్పించుకోవచ్చు కానీ సైనికులకి మాత్రం సరయిన బూట్లు, చలి కాచుకోవడానికి దుస్తులు ఇవ్వరు. కానీ తుప్పు పట్టిన తుపాకులతో శత్రువుతో యుద్ధం చేయాలి. నెహ్రూ హయాంలో ఉన్న రక్షణ మంత్రి కృష్ణ మీనన్ శాం మానెక్ షా ని మిలటరీ కోర్టులో దోషిగా నిలబెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించి, అంతే తీవ్రంగా విఫలం అయ్యాడు. ఇదీ అసలు ట్రాజెడీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions