Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

BRS, BJP … రేవంత్ రెడ్డి కంబైన్డ్ టార్గెట్ … గ్రేటర్ హీట్ షురూ …

June 9, 2026 by M S R

.

దొంగది కాదు, దొడ్లోకి రాదు… లడాయికోతి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై వెటకారంగా దట్టించిన వ్యాఖ్యలు… అంటే బీజేపీయే, కానీ బీఆర్ఎస్‌కు సపోర్ట్ అని… నేను వెళ్లి ఎవరైనా కేంద్ర మంత్రుల్ని కలిసి రాగానే, రెండు మూడు రోజులకు వాళ్లను కలిసి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు… కాళ్లల్లో కట్టెలు పెట్టడం అంటే అర్థం ఇదే…

ఎందుకు హఠాత్తుగా కిషన్‌రెడ్డి టార్గెట్ అయ్యాడు..? నాట్ ఓన్లీ కిషన్ రెడ్డి… బీజేపీని, బీఆర్ఎస్‌ను కలిపి టార్గెట్ చేస్తున్నాడు సీఎం… బీఆర్ఎస్ చెప్పినట్టు కిషన్‌రెడ్డి ఆడుతున్నాడనే ముద్రతో… రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో త్రిముఖ పోటీని ద్విముఖ పోటీగా మార్చే ప్రయత్నం… బీఆర్ఎస్- బీజేపీ ఒకటే, వాళ్లు ఒకవైపు, మేం ఒకవైపు అని చెప్పడం…

Ads

గ్రేటర్ ఎన్నికల మీద బీజేపీకి చాలా ఆశలున్నాయి ఈసారి… ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ఎప్పుడో స్టార్టయింది… మరోవైపు నగరం, పరిసరాల్లో బీఆర్ఎస్ లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగిన సీట్లే గెలిచింది… సో, ఆ ఇద్దరినీ కలిపి కొడితేనే వర్కవుట్ అవుతుందనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం కావచ్చు… అందుకే పెద్దన్న అనే మాటల్ని పక్కన పెట్టేసి… గుజరాత్ మోడీని, ఫామ్ హౌజ్ కేడీని ఎదుర్కుంటాం అనే నినాదం అందుకున్నాడు…

కిషన్‌రెడ్డితోపాటు నలుగురు ఎంపీలను తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నాడు రేవంత్ రెడ్డి, నగర అభివృద్ధికి నిధులు తీసుకురావడం చేతకాదా అని ప్రశ్నిస్తున్నాడు… చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి ఎంపీలు… అందరూ గ్రేటర్ లింక్డ్ ఎంపీలే… మరి కిషన్‌రెడ్డే ఎందుకు..? వై నాట్ బండి సంజయ్ అండ్ అదర్ ఎంపీస్ అంటారా..? వాళ్లకూ గ్రేటర్‌కు లింక్ లేదు కాబట్టి…!

మూసీకి నిధులేవీ, మెట్రో విస్తరణకు సాయం ఏది..? వంటి విమర్శలు కూడా బీజేపీని ఇరుకునపెట్టేవే… అఫ్‌కోర్స్, తుమ్మడిహెట్టి, ఆర్ఆర్ఆర్ వంటివీ ప్రస్తావిస్తున్నా సరే, గ్రేటర్ లింక్ పనులపైనే రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు… బీజేపీ ఒకరకంగా డిఫెన్స్‌లో పడిపోతోంది… ఉదాహరణకు, అబ్బే, మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ రాయనేలేదని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు నిన్న ఎక్కడో అన్నాడు…

వెంటనే ఎంపీ చామల స్పందించి, ఇదుగో ఆ లేఖ… అని దాని కాపీని చూపించేశాడు… రాంచందర్‌రావు ఇక ఏం మాట్లాడతాడు..? ఈ రాజకీయాలు పక్కనపెడితే… ఎన్టీయార్ విగ్రహం, ఉప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి విగ్రహం… ఎలివేటెడ్ కారిడార్‌కు ఆయన పేరు, మరో రాజకీయ ఎత్తుగడ… మరోవైపు మొన్న, నిన్న ఉప్పల్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఎలివేటెడ్ కారిడార్లు, అండర్ పాస్‌లు, ఫ్లయి ఓవర్లు, రోడ్లకు శంకుస్థాపనలే కాదు… నగరంలో లక్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లు కడతానని చెబుతున్నాడు…

సో, గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి అడుగులు పడుతున్నాయి… ఇదంతా అటువైపే పయనం… చివరగా… నేను నీలాగా నాలుగు పార్టీలు మారలేదు అని కిషన్ రెడ్డి కౌంటర్… కానీ, రేవంత్ రెడ్డి బాహటంగా పార్టీలు మారాడు, కానీ ఒక పార్టీలో ఉండి, మరో పార్టీకి దాస్యం చేయడం లేదు అని రేవంత్ టీం రీ-కౌంటర్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Aeromart 2026 – గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో మరో గ్లోబల్ ఈవెంట్!
  • నితిన్ నబీన్‌జీ … కేసీయార్‌పై ఈగ వాలనివ్వనిది మీరే మహాశయా…
  • బాస్ పేరిట వాట్సప్ మెసేజలు- కోట్లు గల్లంతు – బహుపరాక్
  • చివరి సినిమాలో… ఒక్క పాటలోనే తన నాలుగు అభిమాన పాత్రల్లో…
  • Campa … మార్కెటింగ్‌లో అంబానీ తెలివే తెలివి! వేగంగా నంబర్.3 ప్లేస్!!
  • ఇడుపు కాయితం! రచ్చ లేపుతున్న టైటిల్ కొత్తదేమీ కాదు – పాతదే!
  • భయంతో ఆడుకున్న ఈ నియంతను ఆ ‘భయమే’ బలిగొంది!!
  • ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’… తడి తడిమే వేటూరి ఆర్తగీతిక !
  • అనామక ఐర్లాండ్ క్రికెట్ జట్టు మన తోపులకు నేర్పిన పాఠాలేమిటంటే.?
  • సాయిబాబా వివాదం నేపథ్యంలో గుర్తుకొస్తున్న ఓ పాత సినిమా పాట!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions