.
స్ట్రీట్ ఫైటర్..! బెంగాల్‌లో ఉన్నవాళ్లకు ఎలా కనిపిస్తుందో గానీ… రెండు టరమ్స్‌గా ఆమె రాజకీయ ధోరణిని, కార్యాచరణ తీరును పరిశీలించే బయటివాళ్లకు మాత్రం మమతా బెనర్జీ అలాగే కనిపిస్తుంది..!
రౌడీయిజం… దాదాపు ఇదే ధోరణితో సీపీఎం దశాబ్దాల తరబడీ మరే ఇతర పార్టీని కోలుకోకుండా చేసింది… గ్రామ స్థాయి వరకు సీపీఎం పార్టీ చెప్పిందే శాసనం… పక్కాగా మమతా బెనర్జీ దాన్నే అమలు చేసి సీపీఎంను చావుదెబ్బ తీసింది… ఆమె విధానమే ‘అణిచివేత’… ఆమె బెంగాలీ శివగామి…
Ads
ఆమె ఆర్మీని రానివ్వదు.., బంగ్లా సరిహద్దుల్లో కంచెకు భూమి ఇవ్వదు.., సీబీఐ వాళ్ల మీద కేసులు పెట్టి లోపలేస్తుంది.., ఈడీ వాళ్లనూ సహించదు.., వోట్ల కోసం అక్రమ వలసదార్లకు ఆశ్రయం ఇస్తుంది… సాక్షాత్తూ ఓ ముఖ్యమంత్రే ‘రాజకీయాల్లో అవాంఛనీయ కేరక్టర్’లా మారిపోవడం ఓ ఐరనీ..! నిన్నటి ఐప్యాక్ కార్యాలయ వివాదంలో మరీ ఓ గల్లీ లీడర్ తరహాలో బిహేవ్ చేసింది… ముఖ్యమంత్రి అనే పోస్టు గౌరవాన్ని మంటగలిపింది…
అసలు ఆమె తీసుకుపోయిన ఆ ఫైళ్లలో ఏముంది..? కాస్త వివరాల్లోకి వెళ్దాం… కోల్‌కతా కేంద్రంగా సాగుతున్న అక్రమ బొగ్గు మైనింగ్, రవాణా కేసులో ఈడీ (ED) అనేక సోదాలు నిర్వహిస్తోంది… ఇదేమీ కొత్త కేసు కాదు… ఇందులో ప్రధాన సూత్రధారులకు, అధికార పార్టీలోని కీలక వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయనేది ఈడ ప్రధాన ఆరోపణ…

ఐప్యాక్… బీహారీ ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఈ సంస్థ భారత దేశ రాజకీయాలకు ఓ పురుగు… ఆ చర్చ మాటెలా ఉన్నా బెంగాల్‌లో సదరు సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్… తను టీఎంసీ ఐటీ డైరెక్టర్ కూడా… బొగ్గు అక్రమ రవాణాలో వచ్చిన డబ్బు (వందల కోట్లు) హవాలా మార్గంలో ఐప్యాక్ (I-PAC) సంస్థకు చేరిందనేది ఈడీ ప్రధాన ఆరోపణ…
ఐప్యాక్ కార్యాలయం మమత తాలూకు అక్రమ కార్యకలాపాలకు అడ్డా… అనుప్ మాఝీ (లాలా) అనే వ్యక్తి ద్వారా ఈ నిధులు టీఎంసీ పెద్దలకు మళ్లించబడ్డాయని దర్యాప్తు సంస్థ భావిస్తోంది… ఆ ఆఫీసులో మమత ఆర్థిక లావాదేవీల సమాచారం కూడా ఉందట… అందుకే ఈడీ దాడులతో ఆమె కలవరపడింది… పోలీస్ కమిషనర్‌ను వెంటేసుకుని, తనే హడావుడిగా వెళ్లింది…
ఈడీ దాడులు జరుగుతున్న ప్రతీక్ జైన్ నివాసంలోకి వెళ్లి ఓ ల్యాప్ టాప్, ఓ ఆకుపచ్చ ఫైల్ పట్టుకొచ్చింది… మా రాజకీయ వ్యూహాల సమాచారం, సర్ ఆధారాలు అందులో ఉన్నాయనే ఆమె ఆరోపణ ఓ సాకు… ఫేక్… ఎప్పటికప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది కదా… ఉల్టా ఆమె కేంద్రానికి నిరసనగా భారీ ర్యాలీలు చేయించింది…
ఈసారి గవర్నర్ తెర మీదకు రాలేదు… ఈడీయే కలకత్తా కోర్టులో కేసు వేసింది… కథ ముదిరి పాకాన పడుతోంది… ఎన్నికల ముందు ‘బాధితురాలు’ వేషం వేస్తోంది ఆమె… నిజానికి ఫైళ్లు, డిజిటల్ డివైజెస్ తీసుకుపోవడం అంటే… కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తును అడ్డుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం..! చట్టపరంగా ఆమె దోషి…

చట్టపరంగా ఆమెది తప్పు… రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా పెద్ద తప్పు… కోర్టు ఏమంటుందో చూడాలి… ఇప్పుడు కేంద్రం తొందరపడితే ఆమె ఆశిస్తున్న ‘విక్టిమ్ కార్డు’ను చేజేతులా ఆమెకు అప్పగించినట్టే… ఒకవేళ కోర్టు గనుక ఆ ఫైళ్లు, డివైజులు తిరిగి ఇచ్చేయమని చెప్పినా సరే… అందులో అసలు ఇప్పుడు ‘కీలక సమాచారం’ ఉంచితే కదా..!!
ఇక్కడ రెండు అంశాలు కూడా చెప్పుకోవాలి… పేరుకు ఆమెదే పెత్తనం, కానీ అసలు పెత్తనం మేనల్లుడు అభిషేక్ బెనర్జీదే… డబ్బు లావాదేవీలు తనే చూస్తాడు… తన గుప్పిట్లో ఉన్న ఐప్యాక్ డేటా ఆధారిత రాజకీయ సిఫారసులు చేస్తోంది… ఇది టీఎంసీలోని పాతతరం నేతలకు జీర్ణం కావడం లేదు… ప్రత్యేకించి ఒక వ్యక్తి- ఒక పదవి సూత్రం పార్టీలో పాత, కొత్త తరాల మధ్య అగాధం పెంచుతోంది…
ఐప్యాక్ సేకరించిన డేటా, చేసిన సిఫారసులు (ప్రత్యేకించి అక్రమ వలసదార్లు బలంగా ఉన్న నియోజకవర్గాలు) ఈడీ ద్వారా బీజేపీకి వెళ్తాయనే భయంతో ఆమె ఇలా గల్లీ లీడర్ అవతారం ఎత్తిందని ఓ వాదన బెంగాలీ మీడియాలో వినిపిస్తోంది… అదే నిజమైతే ఇక్కడ జగన్‌ను ముంచేసినట్టే అక్కడ ఐప్యాక్ మమతను కూడా ముంచేయడం ఖాయం… ఉద్దేశపూర్వకం కాదు, తప్పుడు సిఫారసులతో..!
#MamataBanerjee #IPAC #BengalPolitics #EDRaids #CoalScam #AbhishekBanerjee
Share this Article