.
బోట్లు నడిపే కుటుంబం 30 కోట్లు మహాకుంభమేళాలో సంపాదించిందనే వార్త చాన్నాళ్లు వెంటాడింది… 3 లక్షల కోట్ల స్థూల ఆదాయం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సమకూరిందనే వార్తలు కూడా…
ఆహా, ఈ లెక్కన ఆ రాష్ట్రం నుంచి ఈసారి జీఎస్టీ ఎన్ని వేల కోట్లు పెరగబోతున్నదో కదా అనిపించింది… ప్చ్, పాపం… దిక్కుమాలిన బీమారు రాష్ట్రాలు అని నిందిస్తున్నాం కదా, ఈ దెబ్బకు యూపీ టాక్స్ ఇమేజ్ అడ్డగోలుగా పెరుగుతుందిలే అనుకున్నాం కదా…
Ads
తుస్… తుస్సున్నర… గత ఏడాది మార్చిలో యూపీ జీఎస్టీ 9087 కోట్లు, ఈసారి 9956 కోట్లు… అంటే కేవలం పది శాతం… అంతే… విస్మయకరంగా ఉందా..? నిజమే… అంకెలు ఎప్పుడూ నిజాలే చెబుతాయి… ఇదీ నిజమే కాబట్టి… అన్నీ మోనాలిసా అమ్మిన పూసల దండల్లాగే…! ఇదుగో ఈ టేబుల్ చూడండి…
మరి లక్షల కోట్ల ఆదాయానికి సరిపడా జీఎస్టీ వసూళ్లు ఉండాలి కదా అంటారా…? అవును, అదే కనిపించడం లేదు అంటున్నది ఈ టేబుల్… మరో విస్మయం ఏమిటంటే… ఈశాన్యం వదిలేస్తే నార్త్ ఇండియాలో అన్ని రాష్ట్రాలకన్నా దరిద్రం బీహార్ అనే ముద్ర ఉంది కదా… గత ఏడాది మార్చితో పోలిస్తే జీఎస్‌టీ వృద్ధి ఏకంగా 30 శాతం పెరిగింది…
అబ్బే, అడ్వాన్స్ టాక్స్ కుమ్మేసి ఉంటారు, ఆర్థిక సంవత్సరం చివరి నెల కదా అంటారా..? నో, గత ఏడాది కూడా ఇలాగే వసూళ్లు చేసి ఉంటారు కదా… సో, బీహార్‌లో ఏదో మార్పు కనిపిస్తోంది… ఉత్తరప్రదేశ్‌తో పోలిస్తే బీహార్ టాక్స్ వసూళ్లు పది శాతమే… కానీ గణనీయంగా పెరుగుదల కనిపిస్తున్నదనేదే ఇక్కడ ప్రధానం…
మేమే నార్త్ ఇండియాను పోషిస్తున్నాం అని స్టాలిన్లు, పినరై విజయన్లు, రేవంత్ రెడ్డిలు చెబుతుంటారు కదా… ఛల్, మనమే ఓ సొంత దేశం ఏర్పాటు చేసుకుందాం అన్నట్టు మాట్లాడుతుంటారు కదా… తెలంగాణలో గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ మార్చి జీఎస్టీ పెరుగుదల జస్ట్, జీరో… నిజమే… సున్నా శాతం పెరుగుదల…
తమిళనాడు 7 శాతం, కేరళ 9 శాతం, కర్నాటక 4 శాతం మాత్రమే… ఆంధ్రప్రదేశ్ అంటారా..? అది మైనస్‌లోకి పడిపోయింది… తోపు తురుము అని చెప్పకునే గుజరాత్‌లో వృద్ధి కూడా ఆరు శాతమే…
మనకు ఎగువన ఉన్న చత్తీస్‌గఢ్‌లో జీఎస్టీ వృద్ధి 18 శాతం, ఒడిశాలో 14 శాతం… స్థూలంగా చూస్తే ఉత్తరాఖండ్, రాజస్థాన్ సహా నార్తరన్ స్టేట్స్ మంచి వృద్ధి నమోదు చేయగా… సౌత్ స్టేట్సే బాగా వెనుకబడి పోయాయి… చివరకు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పన్ను వసూళ్లలో వృద్ధి కనిపిస్తోంది గణనీయంగా..! సర్, స్టాలిన్ గారూ వాటీజ్ దిస్..!!
Share this Article