Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…

October 10, 2025 by M S R

.

నో డౌట్… ఆమ్లెట్ అనేది మంచింగ్ మహారాజా… అయితే ఆమ్లెట్ మంచిదా..? హాఫ్ బాయిల్డ్ బెటరా, సింగిల్ సైడ్ బెటరా, డబుల్ సైడ్ బెటరా..? లేక బాయిల్డ్ ఎగ్ ఫ్రై మంచిదాా..? అనే చర్చ కాదిక్కడ…

గుడ్డు… ఈరోజు ప్రపంచ గుడ్డు దినోత్సవం… పేరులో ఉన్నట్టే ఇది గుడ్… వేరే మాట లేదు, ఆలెక్కన వెరీ గుడ్డు… ఆమధ్య కరోనా సమయంలో ఒరేయ్ చికెనో, గుడ్లో తినండిరా, ఇమ్యూనిటీ లభించునురా డింభకా అనే మాటలు విని, సలహాలు తలకెక్కి…

Ads

శుద్ధ శాకాహారులు సైతం మరీ చికెన్ జోలికి పోకుండా, పోలేక, గుడ్డును కళ్లకద్దుకుని, సారీ, కళ్లుమూసుకుని పెంకు తీసి, అలాగే నోట్లోకి వంపుకున్న కుటుంబాలు లక్షల్లో… అవును, గుడ్డు శ్రీరామరక్ష… అందుకే అండమో, పిండమో అనే మీమాంస వదిలేసి… ఇప్పుడు మెజారిటీ శాకాహారులు సైతం వెజిటేరియన్స్ శాఖ నుంచి ఎగిటేరియన్స్ శాఖలోకి వేగంగా జంపైపోతున్నారు… కారణం..?

ఒక విత్తనం తింటున్నాం, అందులోనూ జీవం ఉంది, పాతితే మొలకెత్తుతుంది… గుడ్డు కూడా అంతే, పొదిగితే కోడి, ఉడికిస్తే ఆహారం… అంతే… ఐనా ఇది శాకాహారమా..? మాంసాహారమా..? అనే చర్చ కూడా అక్కర్లేదు… ఇది చవకగా దొరికే ఆరోగ్యాహారం…

ఆగండి, అది నాటు కోడి గుడ్డా..? ఫారమ్ కోడి గుడ్డా..? ఏ కలర్ గుడ్డు ఎందుకు మంచిది..? అసలు కోడిగుడ్డేనా..? ఇంకేమైనా గుడ్లు కూడా బెటరా అనే చర్చ కూడా ఇక్కడ వలదు, పెంకులా వొలిచి తీసిపారేయడమే…

ఇందులోనూ రేసిజం ఉంది… అనగా వర్ణవివక్ష… కోడి గుడ్లు సాధారణంగా తెలుపు, గోధుమ రంగులలో లభిస్తాయి, కానీ కోడి జాతిని బట్టి నీలం, ఆకుపచ్చ, పింక్ రంగులలో కూడా ఉంటాయి… గుడ్డు రంగు దాని పెంకులో ఉండే వర్ణద్రవ్యం (పిగ్మెంట్) వల్ల వస్తుంది, ఇది జన్యుశాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది… కానీ గుడ్డు పెంకు రంగు, గుడ్డు పోషక విలువల మధ్య తేడా ఉండదు…

గోధుమ రంగు గుడ్లలో ప్రోటోపోర్ఫిరిన్ IX అనే వర్ణద్రవ్యం ఉంటుంది… అరౌకానా (Araucana) వంటి కొన్ని కోళ్లు నీలం- ఆకుపచ్చ రంగులో గుడ్లు పెడతాయి… కొన్ని జాతుల కోళ్లు ఆకుపచ్చ రంగులో గుడ్లు పెడతాయి… కడక్‌నాథ్ గుడ్లు లేత గోధుమ రంగులో లేదా పింక్ రంగులో ఉంటాయి…

కొందరు ఈమధ్య కోళ్లకు పెట్టే దాణాల్లో మినరల్స్, పోషకాలు కలిపేస్తున్నారు… కాస్త షేడ్ కలర్… రేటెక్కువ… నిజంగా కోడి తినే దాణాను బట్టి గుడ్డు పోషక విలువలు పెరుగుతాయా, నాన్సెన్స్, గాడిద గుడ్డు అని తీసిపారేసేవాళ్లూ ఉన్నారు కానీ… గాడిదగుడ్డులాగే అదీ ఓ బహ్మ, భ్రమపదార్థం…

ఆమధ్య ఎవరో మొదలుపెట్టారు… గుడ్డు సూపర్ ఫుడ్డే, మంచిదే, కానీ పచ్చసొనలోని కొలెస్ట్రాల్ పెద్ద సమస్య అని… దాంతో అత్యంత ఆరోగ్యకరమైన ‘నిత్య పచ్చ’టి సొనను పారేసి, వైట్ ఎగ్స్ వోన్లీ అనే నినాదం అందుకున్నారు చాలామంది… చేజేతులా పోషకాలను బయట పారేయడమే ఇది…

A, D, E, K మరియు కోలిన్ (Choline) చాలావరకు పచ్చసొనలోనే ఉంటాయి… ముఖ్యంగా, విటమిన్ D,  కోలిన్ కోసం పచ్చసొన తినడం చాలా ముఖ్యం…పచ్చసొనలో ఉండే కొవ్వులు అసంతృప్త కొవ్వులు (Unsaturated Fats) ఎక్కువగా ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైనవి… కళ్లకు మేలు చేసే లుటీన్, జీజాంథిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కేవలం పచ్చసొనలోనే లభిస్తాయి…

తమ వియ్యంకుడి వెంకటేశ్వర హేచరీస్‌కు కోడిగుడ్డంత నష్టం కూడా జరగకుండా… ఈనాడు చికెన్ గున్యా అనే పదాన్ని కూడా నిషేధించి, చికున్ గన్యా అని నిర్బంధంగా రాయించినట్టు… గుడ్డు మంచిదికాదు అని ఏ పాఠకుడూ భ్రమపడకుండా తన రాతల్లో చాలా జాగ్రత్తలు తీసుకునేది… ఫాఫం… కోడికి గానీ, గుడ్డుకు గానీ వీసమెత్తు వ్యతిరేకపదం రాయకుండా, రాకుండా చూసుకునేది…

నిజానికి గుడ్డు ఇండియన్లకు చాలా మేలు.,. మనది అసలే డయాబెటిక్ కంట్రీ… ఫుల్లు కార్బొహైడ్రేట్ల భోజనాలు మనవి… ఫలితంగా సుగర్ స్పైక్స్… బ్యాలెన్స్ చేయాలంటే అత్యుత్తమ మార్గం ఎగ్స్… ప్రొటీన్ల రారాజు గుడ్డు… తక్కువ కాలరీలు… విటమిన్ A, D, E, B12, ఐరన్, జింక్, సెలీనియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు…

సో, ఏ కోణంలో చూసినా… గుడ్డు ఈజ్ గుడ్… దట్సాల్… An Egg Is Equal To One Peg అంటుంటారు, అది వేరే స్టోరీ… కానీ 90 విత్ హాఫ్ బాయిల్డ్ వన్ సైడ్ అనేది మాత్రం చాలా ఫేమస్ మంత్ర…! ఇక చిల్లీ ఎగ్, ఎగ్-65, ఎగ్ నూడుల్స్, బ్రెడ్ ఆమ్లెట్ వంటి డిషెస్ కాదు ముఖ్యం… అది కడుపు నింపిందా లేదా…

ఏ రాత్రో వండుకునే ఓపిక లేకపోతే సింపుల్‌గా ఓ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటే చాలు… అది భోజనంతో బరాబర్, సరాసరి… డౌట్ లేదు.. గుడ్డు ఆల్వేస్ గుడ్డు, వెరీ గుడ్డు…! పోనీ, ఏమైనా డౌట్లున్నాయా..? సరే, రోజుకు ఒకటీ రెండు తినండి, ఏ ప్రమాదమూ లేదు… సరికదా, మీ గుండెకు కూడా శ్రీరామరక్ష… అతిగా సేవిస్తే అమృతమూ విషమే కదా…!!

బేరర్, వన్ హాఫ్ బాయిల్డ్ వన్ సైడ్ రోస్ట్ ఎగ్ ఆమ్లెట్ ప్లీజ్… విత్ వోన్లీ పెప్పర్… కమాన్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం కన్నప్ప… ఇంకా ఫాఫం రజినీకాంత్… పూర్ టీవీ రేటింగ్స్…
  • కేంద్రం బాగా ప్రమోట్ చేస్తోంది…. అసలు ఎవరు ఈ శ్రీధర్ వెంబు..!?
  • ట్రంపులమారి మళ్లీ ఏసేశాడు… అసలు ట్రేడ్ డీల్ చిక్కులేమిటంటే..?!
  • హికమత్, ఇంగితం కలిస్తేనే… ప్రాణహితం… తెలంగాణ ప్రయోజనం…
  • ధరల పెంపు దేనికి..? ప్రేక్షకులను ఎందుకు దోచుకోనివ్వాలి..?
  • ఆ గ్రామీణ ఆర్టీసీ బస్సులు పుష్పక విమానమంత అద్భుతాలు..!!
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ఒక అధ్యాయం సమాప్తం..!!
  • రాఫెల్ పైలట్ శివాంగీ సింగ్ అసలు జీవిత స్వప్నం ఏంటో తెలుసా..?!
  • పవర్ ఫుల్ సినిమా పెన్… ఓ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం…
  • జాన్వి స్వరూప్..! నో, శ్రీదేవి వారసురాలు కాదు… మంజుల వారసురాలు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions