Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చాయ్ వోకే… కానీ కొన్ని గైడ్ లైన్స్ దాటొద్దట… దాటితే బుక్కయినట్టేనట..!!

May 14, 2024 by M S R

ఫుల్లుగా బిర్యానీ పట్టించాక మాంచి మసాలా టీ గానీ ఇరానీ చాయ్ గానీ తాగుతారు చాలామంది… కొందరైతే ఒకవైపు బిర్యానీ లాగిస్తూనే మరోవైపు చాయ్ లేదా కాఫీ తాగుతుంటారు… (ఈమధ్య కూల్ డ్రింక్స్ కూడా తాగుతున్నారు…) ఐతే అది డేంజర్ అంటోంది ఐసీఎంఆర్… అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్… కొన్ని భారతీయ ఆరోగ్య విషయాల్లో క్లారిటీ ఇచ్చింది…

లంచ్ లేదా డిన్నర్ తరువాత టీ తాగితే ఛాతీ, గొంతు నుంచి నూనెను అది తొలగిస్తుందనీ, బాగా జీర్ణం అవుతుందనీ భావిస్తారు… కానీ దానివల్ల రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందని అంటోంది ఆ సంస్థ తను విడుదల చేసిన 148 పేజీల ‘‘ఆహార మార్గదర్శకాలు’’ డాక్యుమెంట్‌లో…

టీ, కాఫీలలో టాన్నిన్ ఉంటుంది, అది మన దేహం ఐరన్‌ను శోషించకుండా అడ్డుపడుతుంది… అందుకని టీ, కాఫీ సేవనానికి కనీసం భోజనానికి ముందు, తరువాత గంట వ్యవధి ఉండేలా చూసుకోవాలట… రక్తకణాల వృద్ధికి ఐరన్ ప్రధానం కాబట్టి, ఐరన్‌కు అడ్డుపడటం అంటే మనంతట మనమే రక్తహీనతను ఆహ్వానించడం అన్నమాట…

Ads

ఇదొక్కటే కాదు, గ్రీన్ టీ గానీ, బ్లాక్ టీ గానీ పాలు యాడ్ చేయకపోతేనే బెటర్ అని తేల్చిచెబుతున్నారు.,. టీలో థియోబ్రోమైన్, థియోఫిల్లీన్ ఉంటాయి… అవి రక్తనాళాల్ని రిలాక్స్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడేలా చేస్తాయి… ఫ్లేవనాయిడ్స్, ఇతర యాంటీ యాక్సిడెంట్ పాలీఫెనోల్స్ ఉండటం వల్ల గుండె సమస్యలకు ఉపశమనం, అలాగే స్టమక్ కేన్సర్‌కు కూడా నిరోధకం… అయితే కాలు కలపని టీ వల్ల, అదీ మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే ఈ ప్రయోజనాలు వస్తాయి…

ఆ సంస్థ ఇంకా ఏం చెప్పిందంటే..?

  • బత్తాయి, ద్రాక్ష, పైనాపిల్, యాపిల్స్, దానిమ్మ ఏది తీసుకున్నా సరే వాటి రసాలకన్నా (జ్యూస్) నేరుగా వాటిని తినేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి… నేరుగా తీసుకోవడం వల్ల విటమిన్ సి, బీటా కెరోటిన్, పొటాషియం, కాల్షియం ఎట్సెట్రా దేహానికి ఎక్కువ అందుతాయి… ఆరోగ్యకరమైన ఫైబర్ కూడా…
  • 100 ఎంఎల్ చెరుకు పానీయంలో కనీసం 13- 15 గ్రాముల సుగర్ ఉంటుంది… ప్రజలు చల్లదనం పేరిట వేసవిలో ఎక్కువ తాగుతుంటారు, సో, ఎంత పరిమితం చేస్తే అంత మంచిది…

అందరూ అనుకుంటారు కొబ్బరి నీళ్లతో కోకొల్లలు ప్రయోజనాలు అని… అవి నిజమే గానీ, ఓ హెచ్చరిక కూడా ఉంది… ఈ నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచే మాట నిజమే… కానీ కిడ్నీ, హార్ట్ సమస్యలున్న వారు జాగ్రత్త… అవాయిడ్ చేసినా తప్పులేదు… (పొటాషియం లెవల్స్ ఎక్కువయితే హైపర్‌కలేమియా అనే లక్షణాలు కనిపిస్తాయి… అందుకని..)

అబ్బే, మేం మామూలు ఉప్పు వాడం, పింక్ సాల్ట్ వాడతాం, బ్లాక్ సాల్ట్ వాడతం అంటుంటారు కొందరు… కానీ ఉప్పు ఏదైనా ఉప్పే… కలరేదైనా అందులో ఉండేది సోడియమే… బీపీకి, గుండె సమస్యలకు అది శాపం… అన్నింటికీ మించి సంస్థ ఏం హెచ్చరిస్తోంది ఏమిటంటే..? మితిమీరిన వ్యాయామం మంచిది కాదు, ఈమధ్య ఎక్సెస్ ఎక్సర్‌‌సైజు కారణంగా కొన్ని డిజాస్టర్ కేసుల్ని చూస్తున్నాం కదా…

సో, రెగ్యులర్ దైహిక శ్రమ మంచిదే… అది హెల్తీ లైఫ్‌కు ముఖ్యం… కానీ ఒక్కొక్కరి దేహస్వభావం ఒక్కో తీరు… (బాడీ కాన్‌స్టిట్యూషన్)… సో, సరైన నిపుణుల పర్యవేక్షణ లేనిదే అధిక వ్యాయామం కొన్నిసార్లు చెడు ప్రభావాలకు దారితీయొచ్చు… యోగా, ధ్యానంతో ఏ ప్రాబ్లమ్సూ లేవు…

సంస్థ చెప్పినట్టు మన దేశంలో 56 శాతం ఆరోగ్య సమస్యలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే వస్తాయి… పర్టిక్యులర్‌గా బీపీ, ఒబెసిటీ, సుగర్ వంటివి… అయితే తన డాక్కుమెంట్, మార్గదర్శకాల్లో సగటు మనిషికి అర్థం కానివి, ఆచరణకు క్లిష్టమైనవీ పొందుపరిచింది… దానిబదులు సరళంగా జనానికి తెలియజెప్పాల్సి ఉండె…

ప్యాక్డ్ ఫుడ్స్ తగ్గించాలని చెప్పింది… వోకే, కానీ మన జనంలో ప్యాక్డ్ ఫుడ్ తినేవాళ్లు ఎందరు..? పాకెట్లపై లేబుళ్లను నిశితంగా పరిశీలించాలట… నిజమే, కానీ ఏం పరిశీలించాలో, ఏది ప్రమాదకరమో చెప్పదు… పైగా చదువుకున్నవాళ్లకే ఆ లేబుళ్ల కంటెంట్ అర్థం కాదు… ఎస్, రెడీ కుక్ ఫుడ్స్, ప్రొటీన్ సప్లిమెంట్లు కూడా పరిమితి దాటితే మంచివి కావు…

రోజువారీ ఆహారంలో షుగర్ 5 శాతం, మిల్లెట్స్, ఇతర ధాన్యాలు 45 శాతం, ప్రొటీన్స్ 15 శాతం ఉండేలా చూసుకోవాలంటోంది… ప్రొటీన్ ఇన్‌టేక్ విషయంలో వ్యక్తి బరువుని బట్టి కేజీకి 1.6 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని… అంతకుమించి ప్రొటీన్ తీసుకోరాదని సూచించింది… వీటితోపాటు తాజా ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి… కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు డైట్‌లో తప్పక ఉండేలా చూసుకోవాలని కూడా ఐసీఎంఆర్ తన లిస్ట్‌లో పేర్కొంది… గుడ్, కానీ ఏ ఆహారాన్ని ఎంత తీసుకుంటే ఈ 45, 15, 5 శాతాల బ్యాలెన్స్ ఉంటుందో ఎవరు చెప్పాలి మహాశయా… ప్రజలందరూ న్యూట్రిషనలిస్టుల వద్దకు పరుగులు తీయాలా.,.!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మాకు అప్పగించండి… ఫోన్ ట్యాపింగ్ అరాచకం కథేమిటో తేల్చేస్తాం..’’
  • రేయ్ ఎవుర్రా మీరంతా… ఈ పాదపూజలు, నాగభజనలూ ఏమిటర్రా…
  • అదనపు అమ్మ స్తన్యం… ఎందరెందరో బిడ్డలపై ‘అమ్మతనం’…
  • చందమామపై ఓ విల్లా… ఎట్‌లీస్ట్ ఓ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్…
  • కాళేశ్వరంపై కేసీయార్ క్యాం‘పెయిన్’… ఓ పే-ద్ద కౌంటర్ ప్రొడక్టివ్…
  • ఇక్కడ సుహాసిని- విజయశాంతి… అక్కడ జయప్రద – శ్రీదేవి…
  • బాలీవుడ్‌పై అండర్ వరల్డ్ తుపాకీ నీడ… ఓ దర్శకుడి స్టోరీ ఇది….
  • మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
  • ఎఐసీసీ మంత్రి పదవిని ప్రామిస్ చేస్తే… రేవంత్ రెడ్డిని ఎందుకు అడగడం..!?
  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions