.
Pardha Saradhi Upadrasta …. ఒకే రాత్రిలో 9 దేశాలపై ఇరాన్ దాడులు – మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరిస్తుందా?
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు వేగంగా ఉద్రిక్తంగా మారుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రం అయిన South Pars Gas Field పై ఇజ్రాయెల్ దాడి చేసిన తరువాత, ఇరాన్ భారీ ప్రతీకార చర్యలకు దిగింది.
ఈ ప్రతీకార చర్యల్లో భాగంగా ఒకే రాత్రిలో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలు , అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగాయి
Ads
ఇరాన్ దాడుల లక్ష్యాలు
ఇజ్రాయెల్… ఇరాన్ ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్.
మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలపై బాలిస్టిక్ మిస్సైళ్లు , క్లస్టర్ మునిషన్లు ప్రయోగించింది. .
రామత్ గాన్ నగరంలో ఇద్దరు మృతి
వెస్ట్ బ్యాంక్‌లో ఇరాన్ క్షిపణి పడడంతో నలుగురు పాలస్తీనా మహిళలు మరణం
ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అత్యంత భారీ ప్రతీకార దాడులలో ఒకటిగా చెబుతున్నారు.
ఖతార్ … ఖతార్‌లోని Ras Laffan Industrial City ప్రపంచంలోనే అత్యంత కీలక LNG (Liquefied Natural Gas) కేంద్రాలలో ఒకటి. ఇరాన్ నుంచి 14 బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగం. గ్యాస్ ప్రాసెసింగ్ , LNG ఎగుమతి కేంద్రాలకు నష్టం. QatarEnergy సంస్థ “extensive damage” జరిగిందని తెలిపింది. ఈ ప్రాంతం ప్రపంచ LNG సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ … 13 బాలిస్టిక్ మిస్సైళ్లు, 27 డ్రోన్లు ప్రయోగం
యూఏఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు చాలా వరకు వాటిని అడ్డుకున్నట్లు సమాచారం.
ఇరాన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లక్ష్యంగా తదుపరి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
సౌదీ అరేబియా… సౌదీ అరేబియాలో పెద్ద ఎత్తున అప్రమత్తత ప్రకటించారు.
SAMREF Refinery, Jubail Petrochemical Complex ఈ రెండు కీలక పరిశ్రమల వద్ద కార్మికులను ఖాళీ చేయమని ఆదేశాలు ఇచ్చారు.
రియాద్ వైపు వచ్చిన మిస్సైళ్లను ఎక్కువగా అడ్డుకున్నట్లు సమాచారం. అడ్డుకున్న మిస్సైల్ లు క్రింద పడ్డప్పుడు కొంత నష్టం కలిగింది.
కువైట్ …. కువైట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా మిస్సైళ్లు ప్రయోగం. కువైట్ ఎయిర్ డిఫెన్స్ వాటిలో చాలా వరకు అడ్డుకుంది.
బహ్రెయిన్ … బహ్రెయిన్‌లో అమెరికా 5వ నౌకాదళం ప్రధాన కార్యాలయం ఉంది. ఈ ప్రాంతం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీలక లక్ష్యంగా మారింది. అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా మిస్సైళ్లు ప్రయోగం. ఎయిర్ డిఫెన్స్ వాటిలో చాలా వరకు అడ్డుకుంది. సౌదీ, బహ్రెయిన్ లను కలిపే బ్రిడ్జి పాక్షికంగా ధ్వంసం అయ్యిందని వార్తలు, ఇది నిజము అయితే రెండు దేశాల మధ్య రాకపోకలు, ముఖ్యముగా వాణిజ్యం దెబ్బ తింటుంది.
ఒమాన్ … ఒమాన్ ఇప్పటివరకు తటస్థ దేశంగా భావించబడింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్లపై డ్రోన్ దాడులు జరిగినట్లు , కొంతమంది కార్మికులు మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
జోర్డాన్ … జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు కూడా లక్ష్యంగా మారాయి. చాలా వరకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లు వీటిని చేధించాయి.
ఇరాక్ … బాగ్దాద్‌లోని అమెరికా రాయబారి కార్యాలయంపై వరుసగా డ్రోన్ దాడులు .
ఎందుకు ఈ దాడులు?
ఈ దాడులు ప్రధానంగా ఇజ్రాయెల్ South Pars Gas Field పై దాడికి ప్రతీకారంగా జరిగాయి. .
South Pars గ్యాస్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం, ప్రపంచ LNG సరఫరాలో కీలక భాగం, ఇరాన్ , ఖతార్ మధ్య పంచుకున్న గ్యాస్ నిల్వలు
ఈ ప్రాంతంపై దాడి జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్ పై భారీ ప్రభావం ఉండొచ్చు.
ప్రపంచానికి ప్రమాదం ఏమిటి?
ఈ దాడులు ఒక పెద్ద సంకేతం ఇస్తున్నాయి. ఇంత వరకు గల్ఫ్ దేశాలు తన మీద జరుగుతున్న దాడులను ఎదుర్కొంటూ వస్తున్నారు కానీ ఎదురు దాడి చేయలేదు. ఒక,సారి గల్ఫ్ దేశాలు చర్యలు తీసుకోవటం మొదలు పెడితే ,
గల్ఫ్ ప్రాంతం మొత్తం యుద్ధ రంగంగా మారే అవకాశం.
ప్రపంచ గ్యాస్ , ఆయిల్ సరఫరా ప్రభావితం కావచ్చు.
అమెరికా, యూరప్, ఆసియా దేశాలు కూడా ఈ యుద్ధంలోకి లాగబడే ప్రమాదం.
మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రాంతీయ ఘర్షణ నుండి ప్రపంచ స్థాయి సంక్షోభంగా మారే దశకు చేరుకుందా? అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చకు వస్తోంది.
—– ఉపద్రష్ట పార్ధసారధి
Share this Article