.
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. … హిందీలో బ్లాక్ బస్టర్ జుగ్నుకి (1973) రీమేక్ ఈ గురు సినిమా . తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో తీసారు . తమిళంలో సూపర్ డూపర్ హిట్ . తమిళనాడులో కన్నా శ్రీలంకలో బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టేసింది .
జూలై 1980 లో వచ్చిన ఈ గురు సినిమా తెలుగులో కూడా బాగా ఆడింది . అయితే జుగ్నుయే బాగుంటుంది . హిందీ సినిమాలు తక్కువగా చూసే నేను జుగ్నుని రెండు సార్లు చూసాను . ధర్మేంద్ర హీరోయిజం , డ్రీమ్ గర్ల్ హేమమాలిని అందచందాలు సూపర్బ్ .
Ads
ఫండ్ రైజింగ్ కొరకు సినిమాలో ఓ డాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుంది . హేమమాలిని నృత్యం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది . జుగ్ను సినిమా కూడా యూట్యూబులో ఉంది . ఈ పాట వీడియోని ప్రత్యేకంగా వీక్షించండి . Unmissable .
https://www.youtube.com/watch?v=2XSnJqORyr4&ab_channel=Puranenayegaane
ప్రముఖ దర్శకుడు ఐ వి శశి దర్శకత్వంలో వచ్చిన ఈ గురు సినిమాలో హీరో కమలహాసన్ పాత్ర రాబిన్ హుడ్ పాత్ర . హీరో తాత జమీందారు . తండ్రి స్వాతంత్ర్య పోరాటంలో విప్లవవాది . విప్లవవాది ఇంట్లోనుంచి వెళ్ళిపోతాడు . హీరో రాబిన్ హుడ్ అవతారం ఎత్తి దోపిడీలను గురు పేరుతో చేస్తూ అశోక్ పేరుతో అనాధాశ్రయం నడుపుతూ ఉంటాడు .
అతిలోకసుందరి ఈ సినిమాలో కరాటే ఫైట్లు కూడా చేస్తుంది . హీరోహీరోయిన్లు కలిసి విలన్లను పోలీసులకు అప్పచెప్పటంతో సినిమా ముగుస్తుంది . ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు అరవ వాసనతో ఉంటాయి . పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు . వాసన అరవదే అయినా శ్రావ్యంగానే ఉంటాయి .
ముఖ్యంగా ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో శ్రీదేవి నృత్యం చాలా చాలా బాగుంటుంది . ఈ నృత్యంలోని నా వందనము పాటని యస్ జానకి చాలా శ్రావ్యంగా పాడింది . ఈ నృత్యం వీడియో తెలుగులో క్వాలిటీ బాగా లేదు . తమిళంలోని వీడియో చూడండి . భాషతో పని ఏముంది ? మనం ఆస్వాదించేది శ్రీదేవి నృత్యాన్నేగా ! అర్థం అవుతుంది .
దొరికితే దొంగలు సినిమాలో యన్టీఆర్ , జమునలు ఆకాశంలో, జీపులో పాడుకుంటారు . ఈ సినిమాలో హీరో విమానంలో , హీరోయిన్ హెలికాప్టర్లో ఉండి నేలయినా నింగయినా నీవెంటే నేనుంటా అంటూ పాడుకుంటారు . కన్నుల కైపు వెన్నెల చూపు ఉన్నది నీకోసం అనే శ్రీదేవి మత్తులో పాడే పాటలో బాగా నటిస్తుంది .
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా డ్యూయెట్ , అనాధాశ్రయంలో పిల్లలతో పాట ఆడండి పాడండి శ్రావ్యంగా , అరవంగా ఉంటాయి . అరవ ట్యూన్లని మార్చి తెలుగు వారికి నచ్చేలా ట్యూన్లు ఉండి ఉంటే మన తెలుగు సినిమా కూడా తమిళంలో లాగా , హిందీలోలాగా ఇంకా బాగా ఆడి ఉండేది . సినిమాలకు పాటలేగా ప్రాణం !
హిందీలో ప్రాణ్ పాత్రలకు తెలుగులో కేరాఫ్ సత్యనారాయణ . ఇందులో కూడా అంతే . ఇతర పాత్రల్లో మోహన్ బాబు , ప్రభాకరరెడ్డి , కాంతారావు , ముక్కామల , సిలోన్ మనోహర్ , వెన్నిరాడై నిర్మల ప్రభృతులు నటించారు . మోహన్ బాబు కూడా రెండు భాషల్లోనూ నటించారు .
రెండు భాషల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . తెలుగు వీడియోల క్వాలిటీ బాగా లేదు . తమిళం బాగుంది . శ్రీదేవి భక్తులు తమిళంలోని పాటల వీడియోలను చూడండి . ఇవన్నీ ఎలా ఉన్నా జుగ్ను సినిమాని మాత్రం తప్పక చూడండి . డ్రీం గర్ల్ నృత్యాలు , పాటలు unmissable . అందమే ఆనందం . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు………
Share this Article