Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…

October 18, 2025 by M S R

.

మొన్నామధ్య ఎక్కడో చదివాను… త్రిశూలం సినిమాలో జయసుధ పోషించిన పాత్ర కోసం ముందుగా స్మితా పాటిల్‌‌ను అనుకున్నాడట నిర్మాత మురారి… కానీ తీరా వెళ్లి అడిగితే మీ సౌత్ సినిమాల్లో మహిళలకు అసభ్యంగా చూపిస్తారు, నేను నటించనుపో అన్నదని…

ఆమె కొడుకు పేరు ప్రతీక్ బబ్బర్… తనను కన్నప్పుడే ఆమె మరణించింది… తను కూడా నటుడే… మొన్నటి నెత్తుటి కమురు వాసన సినిమా హిట్-3లో విలన్… ఆ వార్తకన్నా స్మితాపాటిల్ ఓ సినిమాను, ఓ పాత్రను తిరస్కరించిందనే వార్త ఎక్కువగా ఇంట్రస్టింగుగా అనిపించింది…

Ads

smitha

ఎస్, లెజెండరీ యాక్ట్రెస్… ఇప్పటివరకూ మళ్లీ ఎవరూ ఆమె దరిదాపుల్లోకి రాలేకపోయారు… సమాంతర సినిమాల్లో పాపులర్… సోషల్ యాక్టివిస్టు… పొలిటికల్ ఫ్యామిలీ… ఐతే… త్రిశూలం సినిమాలో జయసుధ పోషించిన పాత్రను తిరస్కరించడమే నిజమైతే, అది మురారి ఫెయిల్యూరే అవుతుంది…

smitha

అంటే, ఆ పాత్రను సరిగ్గా ఆమెకు కన్వే చేయలేకపోవడం అన్నమాట… నిజానికి అది చాలా సాత్విక పాత్ర… ఎక్స్‌పోజింగ్ ఏమీ ఉండదు, బూతు పాటలు కూడా లేవు ఆమెకు… చాలా పాజిటివ్ రోల్… నిజంగానే ఆ పాత్ర చేసి ఉంటే స్మితా పాటిల్ తెలుగు జనానికి ఇంకా చేరువయ్యేది… అంటే, జయసుధ బాగా చేయలేదని కాదు… ఇద్దరూ ఇద్దరే…

smitha

అవును, అప్పట్లో ముసలి, ముదురు ముడత మొహాలు హీరోయిన్లు పిరుదుల మీద చరుస్తూ, పిచ్చి స్టెప్పులు వేస్తూ కంపు కంపు చేశారు… కావచ్చు, ఆమెకు ఆ ఫీడ్ బ్యాక్ ఉండి నిజంగానే తిరస్కరించి ఉండవచ్చు… ఒక అభిప్రాయం ఉండటం తప్పు కాదు, కాకపోతే సమాధానపరచలేకపోవడం మన వైఫల్యమే అవుతుందిగా…

smitha

పోనీ, ఆమె పిచ్చి పాత్రలు చేయలేదా..? చేసింది… నమక్ హలాల్ సినిమాలో అమితాబ్‌తో కిందామీదా పడుతూ, ఎక్స్‌పోజ్ చేస్తూ వెగటు పాటలు కూడా చేసింది… చేసినందుకు ఏడ్చింది… కానీ తరువాత అలాంటి పాత్రలు కొన్ని చేసింది కూడా… సో, ఆమె మడికట్టుకుని ఏమీ లేదు… ఎటొచ్చీ మురారి ఆమెను కన్విన్స్ చేయలేకపోయాడు, చేయడానికి ప్రయత్నించలేదు, కారణం, తను పెద్ద ఇగోయిస్టు కాబట్టి…

smitha

ఏయ్, తన సినిమాను రెఫ్యూజ్ చేస్తుందానే అహం… అలా త్రిశూలం పాత్ర స్మితా పాటిల్ నుంచి జయసుధకు తరలిపోయింది… లేకపోతే ఆ పాత్రకు మరింత వాల్యూ యాడిషన్ జరిగి ఉండేదేమో… లేెకపోతే ఆ  స్మితా పాటిలే కృష్ణంరాజును ‘రాయిని ఆడది చేసిన రాముడివా, తలపై గంగను మోసిన శివుడివా’ అని పాడి ఉండేది… నిజమే… తెలుగు తెర ఆమెను వాడుకోలేకపోయింది…

smitha

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ధనపిశాచి కనీసం సినిమా థియేటర్ ఖర్చులైనా ఇప్పించేట్టు లేదు..!!
  • అక్కడ శ్రీచరణికి ఘన సత్కారం… ఇక్కడ అరుంధతిరెడ్డికి ఏది మరి..?!
  • ఏదీ పవన్ కల్యాణ్ ఫోటో..? ఏదీ ఆటల మంత్రి ఫోటో..? ఏం యాడ్స్ ఇవి..?!
  • ది గరల్ ఫ్రెండ్..! ఓ టాక్సిక్ లవ్ స్టోరీ… రష్మికను మరో మెట్టు ఎక్కించింది..!!
  • ఇప్పటి నగర ప్రణాళికలన్నా… త్రేతాయుగపు అయోధ్య ఎంతో నయం…
  • నా డెత్ సర్టిఫికెట్ పోయింది… దొరికినవారు దయచేసి సంప్రదించగలరు…
  • బంగారు బల్లి… వెండి బల్లి… కంచిలో వాటి తాపడాలూ మార్చేసేశారు…
  • స్టార్ల సినిమాలు కాదు… ఇదుగో ఇవి కదా రీరిలీజ్ చేయాల్సింది..!!
  • బండి రాకతో జుబ్లీ హిల్స్ ప్రచార చిత్రంలో హఠాత్ మార్పు… ఎలాగంటే..?
  • జుబ్లీ ఇరకాటంలో కేటీయార్..! మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions