.
విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం ఇప్పుడున్న హిందూ వ్యతిరేక వాతావరణంలో అవసరమే… ఆ సంఘటన, ఆ చైతన్యం, ఆ ప్రతిఘటన అవసరమే… పలు రాజకీయ పార్టీలు వోట్ల కోసం మైనారిటీల పక్కన నిలబడి మెజారిటీని ఉపేక్షిస్తూ, అవమానిస్తూ, రాబోయే ప్రమాదాల్ని పట్టించుకోని నేపథ్యంలో ఇలాంటివి అవసరమే…ఇదే విజయవాడలో విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఈ సభకు నేపథ్యం, సంకల్పం, ఉద్దేశం ఏమిటో తెలియవు కానీ… జనం మాత్రం స్వచ్చందంగా బాగా తరలివచ్చారు… మరి కొత్తగా తన అవసరం కోసం అర్జెంటుగా సనాతన ధర్మ దీక్ష తీసుకున్న సోకాల్డ్ పవన్ కల్యాణ్‌ను ఎందుకు పిలవలేదో తెలియదు.,. చంద్రబాబు ఎలాగూ రాడు, ఓ ముద్ర పడటానికి ఇష్టపడడు…సత్యవాణి వంటి అవకాశవాదులకు అక్కడ పెద్ద పీట దేనికో కూడా తెలియదు… అన్నింటికీ మించి స్వామీజీలు హైందవ ధర్మ సమర్థకులు కాదు, పోరాటవేత్తలూ కాదు… వాళ్లకే పెద్ద పీట కూడా సరికాదు… ఎవరి స్వార్థం వాళ్లది… ఏపీ బీజేపీ పెద్ద నేతలు, అధికారంలో ఉన్న నేతలు, పెత్తనాలు అనుభవిస్తున్న నేతలు ఎవరెవరు వచ్చారనేదీ వదిలేద్దాం…సరే, అచేతనులైన హైందవులున్న ఏపీలో ఈమాత్రం జనచైతన్యం ఆహ్వానిద్దాం… కొన్ని డిమాండ్లు కూడా హేతుబద్ధమే… సత్యకుమార్, విష్ణవర్దన్‌రెడ్డి వంటి పలువురిని వదిలేస్తే ఈ సమావేశానికి బీజేపీ నేతలు ఎందుకు దూరం..? మాజీ సోము వీర్రాజు, బీజేపీలో తమ అక్రమాస్తుల రక్షణ కోసం చేరిన మాజీ ఎంపీలు ఏరీ..?బీజేపీ బలపడే ప్రయత్నంలో భాగమే అనుకుంటే… అదీ సరిగ్గా లేదు… సరే, ఈ సభలో కొన్ని డిమాండ్లు న్యాయబద్దమే… అవి…
హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాల్సిందే… హైందవ శంఖారావంలో డిక్లరేషన్ ప్రకటించిన వీహెచ్‌పీ… ఆలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి ఇస్తూ చట్టసవరణ చేయాలి…హిందూ దేవాలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులు సరికాదు… చట్టవిరుద్ధంగా దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి… వినాయకచవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు… ఆలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తిశ్రద్ధలతో చేయాలి…హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి… హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలి… ట్రస్టుబోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు చోటు కల్పించాలి… హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి…అన్యాక్రాంతమైన ఆస్తులు స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించాలి… దేవాలయాల ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి… దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు…
Ads
ఇక్కడ హైందవ ధర్మ వ్యాప్తికి, రక్షణకు ఏమాత్రం ఉపయోగపడని స్వామీజీలకు ఇంపార్టెన్స్ వేస్ట్… సరే, సినీ గేయ రచయితను ఒక విషయంలో పొగడాలి, మరో విషయంలో జాలిపడాలి…ఇండస్ట్రీ మీద బతుకుతూ, క్షణక్షణం బడా నిర్మాతలు, చెత్తా పెత్తనాల హిపోక్రటిక్ పెద్దల అదుపాజ్ఞల్లో బతికే వాతావరణంలో కూడా… సినిమాల్లో హైందవ ధర్మం మీద వక్రీకరణలు, దాడుల మీద నోరు విప్పినందుకు అభినందించాలి… ఆఫ్టరాల్ ఓ చిన్న పిట్ట… ఐతేనేం, గొంతు విప్పింది…కానీ కర్ణుడికి గొప్పతనం ఆపాదించడం మీద విమర్శకే పరిమితం కావడం తన అర్ధజ్ఞానం… ఎన్నో వేల రెట్లు హైందవం మీద దాడి జరుగుతోంది… అదీ మాట్లాడాల్సింది… కర్ణుడు కనీసం కొన్ని విషయాల్లో గొప్పోడు… నిర్వివాదాంశం… అందుకే కృష్ణుడంతటివాడు సంధి ప్రయత్నాలు చేశాడు…ఎవరికీ అక్కడ పదునుగా మాట్లాడటం తెలియలేదు… జాతిని ఉత్తేజపరిచేే వక్తలూ లేరు… వోకే, కనీసం ఆ గడ్డ మీద ఓ సభ జరగడం, లక్షల మంది హాజరు కావడం వరకూ ఓ విశేషమే… ఆర్గనైజర్లను అభినందించొచ్చు..!!
Share this Article