Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం… మోనిత ఏం పాపం చేసింది… పట్టుకొచ్చేయండి, తాడోపేడో తేల్చేద్దాం…

August 14, 2022 by M S R

వంటలక్క… ఈ పేరు కొన్నేళ్లు ప్రతి తెలుగింట్లోనూ ఫేమస్… ఎందుకు…? కార్తీకదీపం అనే సీరియల్ బ్రహ్మాండమైన ఆదరణ పొందింది కాబట్టి, అందులో ప్రధాన పాత్ర పేరు వంటలక్క కాబట్టి…! ఆ పాత్రలో నటించిన మలయాళ టీవీ నటి ప్రేమి విశ్వనాథ్ కూడా ప్రతి తెలుగింట్లో సభ్యురాలు అయిపోయింది… ఏ సీరియల్‌కూ రానంతగా రేటింగ్స్… ఆ టీవీ సీరియల్ నిర్మాత ఎవరో గానీ కోట్లు కొల్లగొట్టుకున్నాడు… తరువాత ఏమైంది..?

బుర్రలో ఏదో పురుగు ప్రవేశించింది… ఎక్కడ తేడా వచ్చిందో ఏం పాడో… హఠాత్తుగా డాక్టర్ బాబు, వంటలక్క అలియాస్ దీప పాత్రల్ని మాయం చేశాడు, అదేమంటే యాక్సిడెంట్ అన్నాడు, ఫోటోకు దండలేశాడు… కథను సెకండ్ జనరేషన్‌లోకి తీసుకుపోయాడు… నాలుగైదు కొత్త మొహాల్ని పట్టుకొచ్చాడు… అసలు అప్పటికే కథ నానా వంకర్లూ తిరిగి, ప్రేక్షకుల్ని పిచ్చోళ్లను చేస్తూ ఉండేది… ఇక ఈ మార్పులతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ తిని, ఆ సీరియల్‌ను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు…

కార్తీకదీపం

Ads

అంతే… ఒకసారి ట్రాక్ తప్పాక అంతే… ఒకప్పుడు 18, 19, 20 దాకా కూడా రేటింగ్స్ సంపాదించిన ఈ సీరియల్ రేటింగ్స్ సగానికి సగం పడిపోయాయి… కొన్ని వారాలైతే వేరే సీరియళ్లు కార్తీకదీపం సీరియల్ రేటింగ్స్‌ను దాటేశాయి… సదరు నిర్మాతకు తలబొప్పి కట్టింది… అప్పటిదాకా రోజూ బంగారు గుడ్లను పొందినవాడు కదా… ఒరిజినల్ మలయాళ సీరియల్‌తో పోలిస్తే కథ పూర్తిగా మార్చేశారు… సాగదీసీ సాగదీసీ నిజానికి సీరియల్‌కే శుభం కార్డు వేయాల్సిన దశలో… ఈ పైత్యానికి పాల్పడ్డారు…

kartikadeepam



03/Aug/22 Wednesday 7:29 PM 7:59 PM KARTHIKA DEEPAM 1828 11.25
02/Aug/22 Tuesday 7:29 PM 8:00 PM KARTHIKA DEEPAM 1821 11.24
01/Aug/22 Monday 7:29 PM 8:00 PM KARTHIKA DEEPAM 1851 11.01
04/Aug/22 Thursday 7:29 PM 8:00 PM KARTHIKA DEEPAM 1862 10.83
05/Aug/22 Friday 7:29 PM 8:00 PM KARTHIKA DEEPAM 1852 10.68


పైన చార్ట్ చూశారు కదా… తాజా బార్క్ రేటింగ్స్… కార్తీకదీపం సీరియల్ ఇప్పటికీ టాప్ వన్… ఎందుకంటే..? ఈ సీరియల్ దుర్వాసనకన్నా మిగతా సీరియళ్ల దుర్వాసన ఘాటు ఇంకా చాలా ఎక్కువ కాబట్టి… అవి మరింత ఘోరమైన ట్రీట్‌మెంట్లతో జనాన్ని చావదొబ్బుతున్నయ్ కాబట్టి…! ఈ దిక్కుమాలిన సీరియల్‌నే అనివార్యంగా భరిస్తున్నారు అని అర్థం… ఐనా సదరు నిర్మాతకు సంతృప్తి లేదు… మళ్లీ బుర్రలో పురుగు మెసిలింది…

premi2

అంతే… టీవీ ప్రేక్షకులంత పిచ్చోళ్లు ఎవరూ ఉండరు, ఏది తీసినా కళ్లప్పగించి చూసేస్తారు అనే బలమైన నమ్మకం తనది… పైగా ఇష్టమొచ్చినట్టు కథను ఎడాపెడా మలుపులు తిప్పేయడంలో టీవీ సీరియళ్ల రచయితలు ఒక్కొక్కరు ఒక్కో కాళిదాసు… సో, అదే ప్రేమి విశ్వనాథ్‌ను (దీప) ఏం బతిమిలాడుకున్నాడో, అదే పరిటాల నిరుపమ్ (కార్తీక్)కు ఏం చెప్పుకున్నాడో… వాళ్లను మళ్లీ కథలోకి పట్టుకొస్తున్నాడు… అదేమిటి..? వాళ్లు చచ్చిపోయారు కదా అనే అమాయకపు పిచ్చి ప్రశ్న వేయకండి…

 

kartika deepam

మరణాలు సంభవించలేదట… దీప ఇన్నాళ్లూ కోమాలో ఉందట… ఇప్పుడు రేటింగ్స్ పడిపోయాయి కాబట్టి… హఠాత్తుగా డాక్టర్ బాబూ అని కోమాలో నుంచి బయటికి వచ్చిందట… సేమ్, కార్తీకుడు కూడా అలాంటి ట్విస్టుతో బతికేస్తాడు… తెలుగు ప్రేక్షకుల ఖర్మ… అయితే ఇక్కడ ఓ చిన్న డౌట్… చిన్న అంచనా… పాపం శమించుగాక… సీరియల్ ఆల్‌రెడీ ఔటాఫ్ ట్రాక్… ఈ పిచ్చి ట్విస్టులను చూసి ప్రేక్షకులు నవ్వుకుని, మరింత దూరం అవుతారేమోనని…!

shobha

ఎందుకంటే..? కార్తీకదీపం సీరియల్ అంటే కేవలం ప్రేమి, నిరుపమ్‌ల మెరిట్ మాత్రమే కాదు… ఆ కథలో అసలు విలన్ మోనిత పాత్ర… శోభా శెట్టి ఆ పాత్రలో ఇరగదీసింది… అలాగే అర్చన… (కేవలం ఈమె కారణంగానే మధ్యాహ్నం నాన్-ప్రైమ్ టైమ్‌లో వస్తున్నా సరే కేరాఫ్ అనసూయ సీరియల్ టాప్ రేటింగ్స్ కొడుతోంది…) ఆ ఇద్దరు పిల్లలు… వాళ్లే సీరియల్‌కు బలం… ఒక్క ప్రేమి, నిరుపమ్ మాత్రమే రీఎంట్రీ ఇస్తే సరిపోతుందా..? ఓ పనిచేయండి… శోభనూ పట్టుకొచ్చేయండి… ఎలాగూ తెలుగు ప్రేక్షకులు సగటున రోజూ పది హత్యలు, పన్నెండు కడుపు తీయడాలు, రెండు డజన్ల యాక్సిడెంట్లను, బొచ్చెడు కుట్రల్ని చూస్తూనే ఉన్నారు… రాటుదేలిపోయి ఉన్నారు… ఏమో, కార్తీకదీపాన్ని మళ్లీ కళ్లల్లో పెట్టుకుంటారేమో…!!

archana

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions