.
ఈ బడ్జెట్లు ఉత్త ముచ్చట్లురా నాయనా… ఇదొక సోది పురాణం… దానికోసం వందల గంటల చట్టసభల సమయం వృథా… అసలు ఎంతమంది చట్టసభ్యులు వాటిని చదువుతారు, వాళ్లకు అర్థమవుతుంది అనేది ఓ పెద్ద బ్రహ్మ పదార్థం అంటే కొందరికి బాగా కోపమొచ్చింది…
అధికారిక రికార్డులే చూద్దాం, జస్ట్ మచ్చుకు… బడ్జెట్ అంటే రఫ్‌గా మనకు ఎంత ఆదాయమొస్తుంది, ఏయే శాఖలకు ఎంత ఖర్చు పెడదాం అనే ఓ ఎస్టిమేషన్ మాత్రమే… బడ్జెట్‌లో పెట్టినంతమాత్రాన ఆ మొత్తాలు ఖర్చు చేయాలనీ లేదు, అసలు నిధులు ఆమేరకు రావాలనీ లేదు…
Ads
కాకపోతే ఒక ప్రభుత్వం తన ప్రయారిటీలు చెప్పుకునేందుకు ఓ సందర్భం… అంతే… అసలు జీడీపీలు, జీఎస్డీపీల లెక్కలే ట్యాంపరింగు అనే విమర్శలున్న నేపథ్యంలో… అసలు బడ్జెటుకన్నా ప్రాధాన్యం ఏముంది..? ఏ పద్దు మీద చర్చ జరగకపోతే అన్నీ గుండుగుత్తాగా జిలెటిన్ చేసేస్తారు… చివరలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదింపజేసుకుని వదిలేస్తారు…
అంటే, గత బడ్జెట్ ఖర్చులకు సభ ఆమోదం అన్నమాట… అది లేకపోతే చట్టప్రకారం కుదరదు కాబట్టి… ఇక మిగతా బడ్జెట్ సెషన్ల చర్చలన్నీ క్షుద్ర రాజకీయ ఎత్తుగడలు, విమర్శలు, ఎత్తిపొడుపులు, ర్యాగింగులు… సొసైటీకి నయా పైసా ప్రయోజనం లేదు, డొల్ల పైచేయి అనిపించుకునే ధోరణులు…
2023-24 సంగతే చూద్దాం… కేసీయార్… అందరూ చెబుతుంటారు కదా… అపర చాణుక్యుడు అనీ, ఏదేదో అని… 2.16 లక్షల కోట్లు బడ్జెట్… అంకెలు పేర్చడమే కదా… అద్భుతంగా పేర్చేశారు… బీఆర్ఎస్ నేతలు ఆహా ఓహో అన్నారు… మస్తు డప్పు… సహజంగానే కాంగ్రెస్, బీజేపీ నామ్‌కేవాస్తే విమర్శలు చేశాయి… అసలు ఎందరు చదివారు..? ఎందరికి అర్థమైంది బడ్జెట్ అనేది వదిలేస్తే…
తీరా ఆడిటింగ్ జరిగేసరికి ఆ బడ్జెట్ 1.69 లక్షల కోట్లకు కుదించుకుపోయింది… అంటే 47 వేల కోట్లు… అంటే దాదాపు పావుసగం బడ్జెట్ హరించుకుపోయింది… మరిక ఈ బడ్జెట్లు, ఈ అంకెలు, ఈ అంచనాలకున్న శాస్త్రీయత ఎంత..? వాటికి విలువ ఎంత..? శాంటిటీ ఎంత..?
ఎందుకు కుదించుకుపోయిందయ్యా అంటే… కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లు 40 వేల కోట్లు అనుకుంటే 10 వేల కోట్లు వచ్చిందట… కేసీయారేమో మోడీని, అమిత్ షాను బజారుకు లాగి బట్టలిప్పాలని చూస్తాడు, బీజేపీ ప్రధాన కార్యదర్శిని అరెస్టు చేయడానికి విమానాలు పంపిస్తాడు, అదీ ఓ క్రియేటెడ్ డ్రామా ఆధారంగా…
అదొక శుష్క, డొల్ల, తిక్క, పిచ్చి రాజకీయ వ్యూహం… సరే, మళ్లీ కొడుకును, అల్లుడిని ఢిల్లీకి పంపి రాయబేరాలు నడిపిస్తాడు, బీజేపీకి కూడా దక్షిణాదికి సంబంధించి దిక్కుమాలిన వ్యూహాలే కాబట్టి ఇక కేసీయార్ మళ్లీ సేఫ్… ఇక్కడ ఎవరు ఎవరి వల్ల బకరా అవుతున్నారనేది వేరే విషయం… కానీ… ఫాఫం మోడీ, ఫాఫం షా…
కేంద్ర గ్రాంట్లు ఆహా ఓహో అనే స్థాయిలో వస్తాయని బడ్జెటులో రాసుకోవడమే ఓ తిక్కతనం… పైగా స్టేట్ రెవిన్యూ కూడా గొప్పగా చెప్పుకున్నాడు కేసీయార్… అదీ తన్నేసింది… దాంతో ఎడాపెడా పద్దుల్ని కోసేసి, తుంగలో తొక్కేసి, మరిన్ని ఎక్కువ అప్పులు తీసుకొచ్చి కథ గట్టెక్కించాడు ఆర్థిక శాఖ కార్యదర్శి…
ఆయన ఇప్పుడిక కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అట… లాంగ్ లివ్ రేవంత్ రెడ్డి..!! అన్నట్టు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా ఇలాగే ఉండబోతున్నది… అదే ఆర్థిక కార్యదర్శి… ప్రభుత్వ ముఖ్యులకు అసలు ఆర్థిక జంఝాటాలు, సమీకరణాలు అర్థమైతే కదా,…
Share this Article