Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కల్వకుంట్ల షర్మిలక్క..! పూర్తిగా దారితప్పిన బిడ్డ… ఫాఫం, కేసీఆర్..!!

August 4, 2025 by M S R

.

ఈమె ఏదో ఫైటర్… థింకర్… టెంపర్‌మెంట్ ఉన్నదీ అనుకున్నాం గానీ… 72 గంటల దీక్షతో… ఆ ప్రారంభ ఉపన్యాసంతో అర్థమైపోయింది… ఈమె కాంగ్రెస్ షర్మిలకన్నా పూర్ స్టాండర్డ్ అని…

ఆమె పదే పదే క్రిస్టియన్లు, మణిపూర్ అని ఏదేదో యాంటీ హిందూ మాటలు మాట్లాడుతుంది… దేవనపల్లి కవిత అలియాస్ కల్వకుంట్ల కవిత ఇంకాస్త ఎక్స్‌ట్రీమ్… ముస్లింలకు ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలట…

Ads

కేటీయార్, బేఫికర్… ఆమె ఆలోచనావిధానం చూసి బెంబేలెత్తకు, నవ్వుకో… మరో షర్మిల కాదు, బిలో షర్మిల… ఇక లైట్ తీసుకో ఆమెను… ఏమయ్యా, లిల్లీపుట్ లీడరూ, ఇక వదిలెయ్ ఆమెను… జనమే నవ్వుకుంటారు తనను చూసి…

ఆమెను ఏం చేద్దాం అని కేసీయార్ రోజుల తరబడీ ఫామ్ హౌజులో భేటీలు, చర్చలు చేయాల్సిన అవసరమే లేదు… ఆమెను ఎవరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదు… ఆమె భావాలతో మాకు సంబంధం లేదు, మేం సస్పెండ్ చేస్తున్నాం అని సింపుల్‌గా ప్రకటిస్తే సరి…

ఎందుకమ్మా తల్లీ… 10 శాతం ముస్లిం రిజర్వేషన్లు..? సోయి ఉండాలి కదా మాట్లాడితే… రేవంత్ రెడ్డి సంకల్పించిన 42 శాతం రిజర్వేషన్లకే రాజ్యాంగ చిక్కులు, సుప్రీంకోర్టు పాత తీర్పుల చిక్కులున్నాయి… 50 శాతం రిజర్వేషన్లు దాటితే కేంద్రం ఒప్పుకోదు…

మరిక 10 ముస్లిం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికో కవితే చెప్పాలి… మరి క్రిస్టియన్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర మైనారిటీలు, ఈబీసీలు కూడా కలిపితే మొత్తం ఎంత శాతం..? ఇక మిగిలే శాతం ఎంత..? ఫాఫం వాళ్లూ మనుషులే కదమ్మా తల్లీ… ఓపెన్ కంపిటీషన్ అంటే, అగ్రవర్ణాలు అని కాదు, వాళ్లందరివీ దొరకుటుంబాలు కావు…  లిల్లీపుట్ లీడర్లు అంటే పొట్టి, పొడుగు కదమ్మా, దిక్కూదివాణం, ఆలోచన, సోయి మన్నూమశానం ఏవీ లేని పొట్టి బుర్రలు అని అర్థం…

నీ లెక్కల ప్రకారం… మరిక అన్ని రిజర్వేషన్లూ పోగా, ఇక ఓపెన్ కంపిటీషన్ ఏమున్నట్టు..? ఎత్తిపారేద్దామా..? నీకేందమ్మా, నీ కొడుకు అమెరికన్ గ్రాడ్యుయేట్, నీకు పోయేదేముంది..? దుమ్మూధూళి…! పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన, బీసీ రిజర్వేషన్లను హైజాక్ చేసి, క్రెడిట్ తీసుకునే ఓ కుటిల రాజకీయం కాదా ఇది.,.! ఎక్కడో కాస్త ఏమూలో మిణుకుమిణుకు అంటున్న సానుభూతి కూడా ఈరోజుతో మటాష్… మంచి సలహదారులను పెట్టుకోవమ్మా తల్లీ….

దీక్షకు వెళ్తూ… మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి ఫూలే విగ్రహాలకు, ట్యాంక్ బండ్ పైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించింది ఆమె… గుడ్, అందులో తప్పులేదు… 10 శాతం ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్ జెండా ఎత్తుకున్నప్పుడు, కాస్త ఓల్డ్ సిటీలో ఎక్కడో ఓ దగ్గరికి వెళ్లి, సలావుద్దీన్ ఒవైసీ ఫోటో దగ్గర కూడా నివాళి అర్పిస్తే సరిపోయేదనే అవుడియా రాలేదామ్మా…

గత పదేళ్లూ సాక్షాత్తూ నీ తండ్రి పాలనలో అక్రమాలకు, వైఫల్యాలకు ఒక్కరోజూ కిక్కుమనకపోయినా… ఏవేవో మద్యం స్కాముల్లో తలమునకలైపోయినా… ఇప్పుడు బీసీలు, ముస్లింలు గుర్తొస్తున్నారు… సంతోషం… కాకపోతే కాస్త రాజకీయ విజ్ఞత కావాలి.,. సాధ్యాసాధ్యాల వివేచన కావాలి… ఏదో డిమాండ్ విసిరితే పోలా అనుకుంటే నీకూ షర్మిలకూ తేడా ఏమున్నట్టు..? పోనీ, సుప్రీంకోర్టులో కొట్లాడు… ఈ ‘ప్రదర్శనలు’ దేనికి..?

ప్చ్, బీసీ హక్కుల కోసం ఓ వెలమ దొర కుటుంబ సభ్యురాలు పోరాడుతోంది… ఇది కదా అసలు బీసీ ఉద్యమ నాయకులు సిగ్గుపడాల్సింది… ఒక్కరంటే ఒక్కరూ బీఆర్ఎస్ నేతలు ఆమె వెంట లేరు… పార్టీయే కాదు, సాక్షాత్తూ ఆమె తండ్రే ఆమెను దూరం పెట్టాడు… రేపోమాపో సస్పెన్షన్ ఖాయం… బీఆర్ఎస్ పార్టీ ఆమెను బహిష్కరించింది… చివరకు లిల్లీపుట్లు కూడా ఆమెను ఎహె ఫోవమ్మా అని తీసిపారేస్తున్నారు…

ఏ అయ్యగారు బీసీ రిజర్వేషన్లను కుదించాడో, ఆ అయ్యగారికి బిడ్డగారు మాత్రం

ఈ దశలోనే కాస్త వివేచనతో డిమాండ్లు పెట్టాలి… వెళ్లి ఢిల్లీలో దీక్ష చేయాలి… ఏయ్, మోడీ, ఈ సివంగి వచ్చింది, ఇక నీ పని ఖతం అని సవాల్ చేయాలి… ఇక్కడ హైదరాబాదులో హైలెవల్ ఫైవ్ స్టార్ దీక్షలతో వచ్చేదేముంది తల్లీ… దేవనపల్లి కవితమ్మా..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే పార్టీలో ఈటల ఎదురీత… ఈలోపు కాళేశ్వరం రిపోర్ట్ షాక్…
  • కల్వకుంట్ల షర్మిలక్క..! పూర్తిగా దారితప్పిన బిడ్డ… ఫాఫం, కేసీఆర్..!!
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • మరీ ఇది యండమూరి నవలా..? నిజమేమిటో తనే చెప్పాలిక…!!
  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…
  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…
  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions