.
ఒకప్పుడు మల్లెమాల ప్రొడక్షన్స్ అంటే… ఓ టేస్ట్, ఓ స్టాండర్డ్… తరువాత ఎంఎస్ రెడ్డి కొడుకు శ్యాంప్రసాద్‌రెడ్డి… ఫాఫం, అంజి అని చిరంజీవి ఫాల్స్ ఇమేజీకి, తను వేళ్లూ కాళ్లూ పెట్టిన ధోరణికి బలైపోయిన సినిమాను వదిలేస్తే… అరుంధతి, అమ్మోరు వోకే, సూపర్ బ్లాక్ బస్టర్లు…
ఫాఫం… అంజితో మొత్తం తన టేస్టు కాలిపోయినట్టుంది… ఈటీవీలో జబర్దస్త్ సహా ఒకటోరెండో దరిద్రపు షోలు చేయసాగాడు… బూతులు, అక్రమ సంబంధాలు, అత్యంత దరిద్రిపు టేస్టున్న షోలలో ఒకటి అది… ప్రపంచం అంతా తిడుతున్నా దాన్ని గ్రేటుగా స్వీకరించినట్టున్నాడు ఫాఫం…
Ads
నాగబాబు బ్యాచ్ వచ్చింది… తన వీరభక్త బూతుపదాల హనుమాన్ హైపర్ ఆది వంటి కేరక్టర్లు ఎంటరయ్యాయి… వెరసి మల్లెమాల అంటేనే ఓ బూతు నిర్మాణ సంస్థగా పేరుపడింది.,. డబ్బులొస్తున్నయ్ కదాని… గొప్ప గొప్ప నీతులు చెప్పే మల్లెమాల ప్లస్ ఈటీవీ మూసీ పంకిలంలో పడి కొట్టుకుపోసాగాయి…
12 ఏళ్లయిందట… ఆ బృహత్తర, లోకోత్తర టీవీ షో స్టార్ట్ చేసి… ఓ సెలబ్రేషన్ కండక్ట్ చేసి, ఓ కొత్త షో చేశారు… దాని పేరే మెగా సెలబ్రేషన్స్… అంటే మెగాకు దాసోహం… మెగా పాదతీర్థసేవనం… ఫాఫం ఎంఎస్ రెడ్డి ఇజ్జత్ తీస్తున్నారు.., ఆహా, ఇలాంటి కొడుకులు..? కలలో కూడా ఊహించలేదేమో ఆయన…
మెగా సెలబ్రేషన్స్ అని పేరెందుకు పెట్టారు..? నాగబాబును ముఖ్యఅతిథిగా పిలిచారు కాబట్టి… ఓ పవన్ కల్యాణో, ఓ చిరంజీవో వస్తే వోకే… మరీ నాగబాబుకు భజన… ఫాఫం… మరి ఎమ్మెల్సీ కదా, కాబోయే మంత్రి కదా… జనం ఎన్నుకోకపోతేనేం, తమ్ముడి పెత్తనం నడుస్తోంది కదా… చంద్రబాబు ఈ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడు కదా, తన సుదీర్థ జాతీయ రాజకీయాల చక్రాలు తిప్పిన ఘనతను కూడా వదిలేసి…
పోనీ, అదేమైనా టేస్టుండి ఏడిచిందా..? లేదు..! కమెడియన్ల పాదపూజలు… ఫాఫం మల్లెమాల అన్నది అందుకే… అనాగరిక, పూర్వకాలం ఆదిమవాసుల కల్చర్ అది… అదీ బహిరంగంగా, కోట్ల మంది చూసే టీవీ షోలో… ఫాఫం ఈటీవీ క్రియేటివ్ టీం… ఈటీవీ ఓనర్లకు సోయి లేదు సరే, శ్యాంప్రసాద్‌కూ సోయి లేదు సరే… ఈ టీమ్‌కైనా ఉండాలి కదా…
వోకే, నాగబాబు గతంలో ఇదే చెత్తా బూతు షోకు జడ్జి… తన నోటికి పవరెక్కువ కదా… తన మాటే చెలామణీ… కమెడియన్లందరూ తప్పనిసరై పాదాల దగ్గర భజన చేసుకునేవారు… ఇదే మల్లెమాలను తుంగలో తొక్కి బయటికి వెళ్లిపోయాడు నాగబాబు… ఎక్కడెక్కడో కామెడీ షోలు చేశాడు… డిజాస్టర్స్…
మళ్లీ ఇప్పుడు అదే ఈటీవీకి వచ్చాడు, ఫాఫం శ్యాంప్రసాదుడు సాగిలబడ్డాడు… అంత విధేయత అవసరమా..? అన్నింటికీ మించి మల్లెమాలను ధిక్కరించి బయటికి పోయాడు సుడిగాలి సుధీర్… అదే ఈటీవీకి వేరే షోలకు హోస్టింగ్ చేస్తున్నాడు గానీ మల్లెమాల క్యాంపు మొహం చూడటం లేదు… అది ఉండాల్సిన టెంపర్‌మెంట్…
ఐనాసరే, సుధీర్ ప్రస్తావన లేకుండా షో నడవదు… నడపరు… అదొక దిక్కుమాలిన తనం… సుధీర్ మాస్కు వేసి, ఏవేవో హైపర్ ఆదితో పిచ్చి కూతలు కూయించారు… (మళ్లీ నేను సుధీర్ జాన్‌జిగ్రీ అని ఏతులు… అనగా, గొప్పలు, కవరింగులు…)
గతం వేరు, ఇప్పుడు జనసేనకూ వైసీపీకీ, టీడీపీకీ వైసీపీకి నడుమ భగ్గుమంటోంది… రోజాకు అంత అర్థం చేసుకునే సీన్ గతంలో లేదు… పైగా ఈటీవీకి జగన్‌కూ నడుమ వందల కిలోమీటర్ల అగాధం… మళ్లీ ఈ మెగా సెలబ్రేషన్స్‌కు వెళ్తే జగన్ మూడో కన్ను తెరుస్తాడేమోనని అనుకుందేమో ఆమె అవాయిడ్ చేసింది.,..
ఐనా ఆమె పేరు లేకుండా షో నడవలేదు… ఫాఫం మల్లెమాల… ఫాఫం ఈటీవీ… మరీ మెగా పాదాల మీద పడి పాకాలా ఈటీవీ యాజమాన్యం… కాదంటే వెంటనే జనసేన కళ్లురిమి, టీడీపీని గంగలో కలిపేస్తుందా..? పైసా కూడా విచక్షణ, జ్ఞానం లేని పోకడ… ఈటీవీ వ్యవహారాలు ఎవరు చూస్తున్నారో గానీ… ఫాఫం..!!
ఈ వోల్ (నాట్ హోల్, whole) ప్రపంచంలో ఎవడికీ అర్థం కాని కేరక్టర్ అనసూయ… అదే అనసూయాంటీ… హఠాత్తుగా లేచి, రష్మిని హత్తుకుని అన్నీ మరిచిపోదాం అనేసింది… సరే, సర్లె అని కళ్లు తుడుచుకుంది రష్మి ఆంటీ… ఈమె ఆమెను మించిన మహానటి…
అంటే, కొన్నాళ్లుగా ఎక్కడో తేడా కొట్టింది, ఇద్దరి మధ్య ఏవో పాతపగలు రగలి, మాటలు కూడా లేనట్టున్నాయి.,.. గతంలో కూడా ఈ వైరం ఉంది వారి నడుమ…, అనసూయ టెంపర్‌మెంట్‌కూ, రష్మి లిబరల్ మనస్తత్వానికీ పడలేదు… ఇప్పుడు మళ్లీ… ఏం పోకడలురా నాయనా..!!
Share this Article