అసలు ఇప్పుడు బిగ్‌బాస్ హౌజులో ఉన్నదే ఆ ఒక్క చూడ ముచ్చటైన జంట… దాన్ని కూడా విడదీసింది బిగ్‌బాస్ టీం… దాంతో ఏం సాధించాలని అనుకుంటున్నదో దానికే తెలియాలి… నిజానికి రెండుమూడు జంటలు ఉండాలి, వీలయితే ఓకటీరెండు త్రికోణ యవ్వారాలు ఉండాలి… సాధింపులు, కవ్వింపులు, కలవరింతలు, పులకింతలు గట్రా నడుస్తూ ఉండాలి… అప్పుడే బిగ్‌బాస్ హౌజుకు ఓ కళ… చూసేవాడికి కాస్త మజా… కానీ ఇలా చేశారేమిట్రా..? మొత్తం 19 మంది… అందులో కాస్త హాట్ హాట్ అనుకున్న సరయును ఫస్ట్ వీకే వెళ్లగొట్టారు… తరువాత ఉమాదేవి ఔట్… ఉన్నవాళ్లలో కాస్త పెళ్లి కాని అందగత్తె లహరి ఉందనుకుంటే ఆమెను కూడా పంపించేశారు… తీరా ఇప్పుడు ఇక ఎవరున్నారు..? ప్రియాంక అందరికీ చెల్లె అయిపోయింది… కాస్త ఏజ్ బార్ ప్రియ ప్రస్తుతం సింగిలే అయినా అందరికీ అక్క అయిపోయింది ఎందుకో మరి..! లేక ఈ లవ్వు యవ్వారాలు గట్రా కుదరవు అని ముందే గట్టిగా చెప్పిందేమో…
యానీ మాస్టర్ కూడా అదో పద్ధతి… అంతా దూరం దూరం యవ్వారం… సిరి ఉంది గానీ, ఆమె ఆల్రెడీ ఎవరో బాయ్ ఫ్రెండ్‌కు ఎంగేజ్ అయినట్టుంది బయట… హౌజులో మాత్రం షణ్ముఖ్‌తో క్లోజ్‌నెస్ నటిస్తున్నట్టుంది… కాజల్ మ్యారీడ్… శ్వేతను భరించడం కష్టం… మగధీరులు ఎవరూ ఆ సాహసం చేయడం లేదు… సో, మిగిలింది ఒక్క హమీదా… ప్లజెంటుగా ఉంటుంది… శ్రీరాంచంద్రతో కనెక్టయింది… ఇదొక్క జంటే కనిపిస్తోంది ప్రస్తుతం… ఇప్పుడిక ఆ జంటనూ విడదీయడంలో బిగ్‌బాస్ లాజిక్ ఏమిటో అర్థం కాదు… నిజానికి ఈసారి 15 మందిలో 9 మందిని ఎలిమినేషన్ జాబితాలో చేర్చడమే ఓ అబ్సర్డిటీ… జెస్సీ, విశ్వ లీస్ట్ వోట్లతో వెనుకబడి ఉన్నట్టు పలు సైట్ల సొంత వోటింగ్ సరళి చెప్పింది… కానీ అనూహ్యంగా ఈ ఆడపేరును కొట్టేసి, వెళ్లగొట్టడం ఏమిటి..? అంటే, ఆమె బలమైన కంటెస్టెంట్ ఏమీ కాదు, కానీ మరీ తక్కువ వోటింగులో ఏమీ లేదు… అసలే బిగ్‌బాస్ షోను ఈసారి ఎవడూ దేకడం లేదురా అంటుంటే, ఇలాంటి నిర్ణయాలు ఏమిటో…!!
Ads
Share this Article